ViralBiryani Master Job : బిర్యానీ వంట...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Biryani Master Job : బిర్యానీ వంట మాస్టర్ కావాలంట! జీతం ఏకంగా లక్షల్లో!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Biryani Master Job చదువు చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లేది ఒక్క విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పేదరికాన్ని పారద్రోలి జీవితాల్లో వెలుగులు నింపేది చదువు ఒక్కటే. అయితే ప్రస్తుత రోజుల్లో డిగ్రీలు, పీజీలు చేసినా ఉద్యోగాలు సాధించడం కష్టంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో విపరీతమైన కాంపిటీషన్ నెలకొంది. దీంతో చదువుకొని తప్పు చేశామా? అనే నిరాశకు లోనవుతున్నారు. ఎందుకంటే చదువు లేకుండా కూడా చాలా మంది లక్షల్లో సంపాదిస్తున్నారు. మరి మీరు కూడా ఇలా లక్షల్లో సంపాదించాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లో ఓ రెస్టారెంట్ లో బిర్యానీ వంట మాస్టర్ కావాలంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. నెలకు 75 వేల జీతం ఇస్తారట.

Biryani Master Job

హైదరాబాద్ బిర్యానికి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉంటారు. ఒక్కసారైన హైదరాబాద్ బిర్యానీ రుచి చూడాలని తహతహలాడుతుంటారు. బిర్యానీ రుచిగా రావాలంటే వంట మాస్టర్ చేతుల్లో ఉంటుంది. మరి మీరు కూడా మంచి వంట మాస్టరా? అయితే మీకు ఓ బంపరాఫర్ ఉంది. ఏ చదువు లేకపోయినా సరే మీరు వండర్ ఫుల్ గా బిర్యాని వండితే చాలు. కళ్లు చెదిరే జీతాన్ని సొంతం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఓ యూజర్ బిర్యానీ మాస్టర్ చెఫ్ కావాలంటూ పోస్టు చేశాడు. ఆ వీడియోలో.. హైదరాబాద్ లోని మల్లాపూర్, నాచారం ఏరియాలో ఓ రెస్టారెంట్ లో బిర్యానీ వంట మాస్టర్ కావాలంటూ కోరారు. రోజుకు 10 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఆయన కేవలం బిర్యానీ చేస్తే చాలు. ఇతడికి సహాయంగా పాత్రలు కడగడానికి, కూరగాయలు కట్ చేయడానికి అసిస్టెంట్ లను కూడా ఇస్తారు.

అయితే బిర్యానీ కుక్ కు ఓ కండీషన్ పెట్టారు. చెఫ్ కు పాన్ గుట్కా తినే అలవాటు ఉండకూడదు. ఇక ఈ బిర్యానీ చెఫ్ కు ఇచ్చే శాలరీ ఎంతో తెలుసా? రోజుకు రూ. 2500 అంటే నెలకు రూ. 75 వేలు. అంటే ఏడాదికి రూ. 9 లక్షల జీతం అన్నమాట. బిర్యాని చెఫ్ కు చదువుతో సంబంధం లేకుండా లక్షల్లో జీతం వస్తుండడంతో చదువుకున్న నిరుద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసి వేస్ట్ అంటూ ఉసూరుమంటున్నారు. చదువుకోకుండా వంట మాస్టర్ అయినా కూడా లక్షల్లో సంపాదించుకునే వాళ్లమని తెగ బాధపడిపోతున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this