FoodTasty Potato Roast: పొటాటో రోస్ట్ ఇలా...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Tasty Potato Roast: పొటాటో రోస్ట్ ఇలా చేశారంటే.. మొత్తం లాగించేస్తారు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Tasty Potato Roast బంగాళ దుంప అంటే చాలా మందికి ఫేవరెట్ ఫుడ్. ఆలు గడ్డతో ఎలాంటి వెరైటీలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. ఆలూతో ఎన్నో రకాల వేల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా రకాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మరో కొత్త రెసిపీ మీ కోసం తీసుకొచ్చాం. అదే విధంగా బంగాళ దుంప తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు మాత్రం తీసుకోకూడదు. చాలా మంది ఎక్కువగా ఆలూ ఫ్రై చేసుకుంటూ ఉంటారు. ఎలాంటి వాటితో తిన్నా సైడ్ డిష్ గా చాలా రుచిగా ఉంటుంది. అదే విధంగా ఆలూ రోస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టండి. లొట్టలేసుకుంటూ.. ఎలాంటి అనారోగ్య సమస్యల గురించి కూడా ఆలోచించకుండా తినేస్తారు. మరి ఈ ఆలూ రోస్ట్ ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ రోస్ట్‌కి కావాల్సిన పదార్థాలు:

ఆలు గడ్డలు, కారం, పసుపు, ఉప్పు, మిరియాల సొడి, కొబ్బరి నూనె, అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తి మీర, సోంపు, ఆయిల్.

ఆలూ రోస్ట్‌ తయారీ విధానం:

ముందుగా బంగాళ దుంపకు తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్లలో వేయాలి. ఇలా వేస్తే ముక్క క్రంచీగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి, కరివేపాకులు వేసి మెత్తగా పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ రోస్ట్ చేయడానికి ఖచ్చితంగా మీకు నాన్ స్టిక్ పాన్ కావాలి. ఎందుకంటే ఇందులో త్వరగా మాడిపోకుండా ఉంటుంది. కాబట్టి నాన్ స్టిక్ పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది.

Tasty Potato Roast

నూనె వేడెక్కగానే బంగాళ దుంప ముక్కలు వేసి.. ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియంలో పెట్టి మధ్య మధ్యలో వేయిస్తూ ఉండి. ఇవి రంగు మారిన తర్వాత కారం, ఉప్పు, పసుపు, సోంపు పొడి, మిరియాల పొడి వేసి కలపాలి. ఇవి కాస్త వేగాక.. మిక్సీ పట్టిన పేస్టు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా చిన్న మంట మీద ఓ ఐదు నిమిషాలు వేగాక.. చివరగా కొత్తి మీర చల్లి దించేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆలూ రోస్ట్ సిద్దం. ఇలాగ మీరు ఇతర కూరగాయలు, చికెన్‌, ఎగ్ తో కూడా ట్రై చేయవచ్చు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this