EntertainmentCinemaSardar 2: కార్తి 'సర్దార్ 2' సినిమా...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ సినిమా షూటింగ్‌లో ప్రమాదం..ఫైట్ మాస్టర్ మృతి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం సర్దార్ 2. పీఎస్‌ మిత్రన్ దర్శకత్వంలో గతంలో వచ్చిన సర్దార్ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇటీవలే చెన్నైలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను పట్టాలెక్కించారు. సోమవారం (జులై 15) నుంచి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక ప్రమాదం కారణంగా ప్రముఖ ఫైట్ మాస్టర్ కన్నుమూసినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తోన్న క్రమంలో ఎజుమలై అనే ఫైట్‌ మాస్టర్‌ సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డాడు. వెంటనే స్పందించిన చిత్రబృందం అతనిని ఆస్పత్రికి తరలించింది. అయితే అంత ఎత్తు నుంచి కిందపడటం వల్ల ఛాతీ భాగంలో తీవ్ర గాయం, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో ఎజుమలై మృతి చెందాడని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగన సమయంలో హీరో కార్తీ కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటననకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆగిపోయిన షూటింగ్..

మరోవైపు ఈ ప్రమాద ఘటనతో షూటింగ్ అయిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై హీరో కార్తీక్, దర్శకుడు పీఎస్ మిత్రన్ నుండి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న సర్దార్ 2 సినిమాలో కార్తీ ద్విపాత్రాభియనం చేస్తున్నాడు. అలాగే మరో నటుడు ఎస్‌.జె.సూర్య ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూరుస్తున్నాడు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా ఇటీవల సినిమా షూటింగుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో కమల్ హాసన్ భారతీయుడు, అలాగే ఎన్టీఆర్ దేవర సినిమా సెట్స్ లోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this