Newsకుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై స్పందించిన...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Talliki Vandanam (తల్లికి వందనం) Attendance Check – ఇప్పుడు మొబైల్ లోనే మీ పిల్లల హాజరు శాతం తెలుసుకోండి!

ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత...

How to Know Thalliki Vandanam Eligibility Status | తల్లికి వందనం ఏలిజిబిలిటీ స్టేటస్

తల్లికి వందనం పథకం 2026-27 – అర్హత స్థితి తనిఖీ విధానం2026-27...

కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు కీలక ఆదేశాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

CM Revanth Reddy : హైదరాబాద్​ జవహర్ నగర్లో వీధి కుక్కలు రెండేళ్ల బాలుడిపై దాడిచేయడంతో ఆ బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ  విషాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. బాలుడి మృతి ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. భ‌విష్య‌త్‌లో ఇటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాలని సూచించారు. వీధి కుక్కల బెడదను అరికట్టడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు.

వీధి కుక్క‌ల దాడులకు వాతావ‌ర‌ణ ప‌రిస్థితులా, లేక సీజ‌న‌ల్ కార‌ణాలా.. అనే అంశంపై అధ్యయనానికి పశు వైద్యులు, బ్లూక్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల నిపుణుల కమిటీ వేయడం జరుగుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. వీధి కుక్కలకు టీకాలు వేయటం, లేదా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో కుక్కలు దాడులు చేస్తే తక్షణ అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి సంఘటనలను నివారించడానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, బస్తీలు, కాలనీలు, సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులను సీఎం ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులు, పెద్దలపై వీధి కుక్కల దాడి ఘటనలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ జవహర్ నగర్ లో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. విహాన్ అనే రెండేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు అత్యంత పాశవికంగా దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికంగా విషాదం నెలకొంది.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this