Tuesday, August 19, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
SportsCricketRinku-Gambhir : రింకూపై గంభీర్ పగబట్టాడా? ఇలాంటి...

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ హ్యాండ్ బుక్: క్లాస్ & సబ్జెక్ట్ వారీగా Model filled diary | AP Teachers Handbook

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా AP Teachers handbook మరియు model...

1st Class Telugu Month Wise Model Filled Teacher Diary

1st Class Telugu Month Wise Model Filled Teacher DiaryFilled...

1st Class English Month Wise Model Filled Teacher Diary

1st Class English Monthly Model Filled Teacher DiaryFilled Teacher...

భారతదేశం గణితంతో మళ్లీ ప్రేమలో పడాలి: మంజుల్ భార్గవ | Manjul Bhargava mathematics

ప్రపంచ ప్రసిద్ధ ఫీల్డ్స్ మెడలిస్ట్ Manjul Bhargava mathematics భారతదేశం గణితంతో...

Rinku-Gambhir : రింకూపై గంభీర్ పగబట్టాడా? ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Rinku-Gambhir శ్రీలంక సిరీస్​ను టీమిండియా గ్రాండ్ విక్టరీతో మొదలుపెట్టింది. శనివారం జరిగిన తొలి టీ20లో ఘనవిజయం సాధించి సిరీస్​లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్​తో భారత్​కు చాలా సానుకూల అంశాలు లభించాయి. బ్యాటింగ్​లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (21 బంతుల్లో 40), శుబ్​మన్ గిల్ (16 బంతుల్లో 34) దుమ్మురేపారు. ఫస్ట్​ డౌన్​లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 58) కీలక ఇన్నింగ్స్​తో టీమ్​కు భారీ స్కోరు అందించాడు. కీపర్ రిషబ్ పంత్ (33 బంతుల్లో 49) యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ ఆఖరి వరకు క్రీజులో నిలబడటం మరో పాజిటివ్ అంశం. బౌలింగ్​లో అర్ష్​దీప్ సింగ్, అక్షర్ పటేల్​తో పాటు రియాన్ పరాగ్ మ్యాజిక్ స్పెల్​తో లంకను కూల్చి మన బౌలింగ్​కు ఢోకా లేదని నిరూపించారు.

Motivation: సంతోషంగా ఉండాలని ఉందా.? భగవద్గీతలోని ఈ 5 పాటించండి..

Rinku-Gambhir

Rinku-Gambhir ఇలా ఒక్క మ్యాచ్​తో భారత్ చాలా సానుకూల అంశాలను సాధించింది. అయితే ఇప్పుడు టీమిండియా ఘనవిజయం కంటే మరో రెండు విషయాలు హైలైట్ అవుతున్నాయి. అందులో ఒకటి టీమ్​లో ఉన్న ప్లేయర్ రింకూ సింగ్ గురించి, మరొకటి బెంచ్ మీద ఉన్న ఆటగాడు సంజూ శాంసన్ గురించి కావడం గమనార్హం. సంజూ​ను ప్లేయింగ్ ఎలెవన్​లోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లూ అతడికి సపోర్ట్​గా మాట్లాడుతూ వచ్చిన గంభీర్.. తీరా కోచ్ అయ్యాక అతడికి హ్యాండ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. అదే టైమ్​లో రింకూ విషయంలో వ్యవహరించిన తీరుతోనూ గౌతీ ట్రోలింగ్​కు గురయ్యాడు. ఎంతో టాలెంట్ ఉన్న రింకూకు గంభీర్ అన్యాయం చేస్తున్నాడని.. అతడి మీద పగబట్టాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

rinku singh

Rinku-Gambhir ఈ సీజన్​ ఐపీఎల్​లో కేకేఆర్ ఫ్రాంచైజీకి మెంటార్​గా వచ్చిన గంభీర్​ అందరు ఆటగాళ్లకు సరైన అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు. దీని వల్లే టీమ్ కప్పును ఎగరేసుకుపోయిది. అందరి విషయంలో ఒకలా వ్యవహరించిన గౌతీ.. రింకూతో ప్రవర్తించిన తీరు మాత్రం వివాదాస్పదంగా మారింది. ఆ టోర్నీలో రింకూకు సరైన ఆపర్చునిటీస్ ఇవ్వలేదు. దీని వల్ల అతడికి టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్​లో ప్లేస్ మిస్ అయింది. రిజర్వ్ ప్లేయర్​గా మెగాటోర్నీకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు లంకతో సిరీస్​లో తొలి మ్యాచ్​లో రైటాండ్-లెఫ్టాండ్ కాంబినేషన్ ఉండాలనే కారణంతో రింకూను బ్యాటింగ్​కు వెళ్లకుండా ఆపాడు గౌతీ. అతడి కంటే ముందు రియాన్ పరాగ్​ను పంపాడు.

Rinku-Gambhir ఆఖర్లో బ్యాటింగ్​కు దిగిన రింకూకు కేవలం 1 బంతి ఆడే ఛాన్స్ దొరికింది. దీంతో గంభీర్​పై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. రింకూ లాంటి పించ్​ హిట్టర్​ను ముందు పంపకుండా.. రైట్-లెఫ్ట్ కాంబో అంటూ టైమ్ వేస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పరాగ్ పొడిచిందేమీ లేదని.. అతడి కోసం రింకూను బలి చేయొద్దని సీరియస్ అవుతున్నారు. ఇలాగే అవకాశాలు ఇవ్వకుండా ఆపితే రింకూ కాన్ఫిడెన్స్ దెబ్బతిని.. అతడి కెరీర్ మరింత డేంజర్​లో పడటం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. అతడి కెరీర్​తో ఆడుకోవద్దని అంటున్నారు. మరి.. రింకూ విషయంలో గంభీర్ వ్యవహరిస్తున్న తీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this