Life StyleMotivation: సంతోషంగా ఉండాలని ఉందా.? భగవద్గీతలోని ఈ...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Motivation: సంతోషంగా ఉండాలని ఉందా.? భగవద్గీతలోని ఈ 5 పాటించండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సంతోషం.. కాలం, ప్రాంతం, వ్యక్తులను బట్టి మారే ఓ రహస్య పదార్థం. అసలు సంతోషం అంటే ఏంటి.? దీనికి ఠక్కున సమాధానం చెప్పడం ఎవరి వల్ల కాదు. ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కో అర్థం ఉంటుంది. అందుకే సంతోషానికి అర్థం మారుతూనే ఉంటుంది. అయితే ప్రతీ ఒక్కరూ కోరుకునేది ఈ సంతోషమే. ఇందుకోసమే మానవ మనుగడ సాగుతుంటుంది. ఈరోజు కష్టపడ్డా సరే రేపు సంతోషంగా ఉండాలనుకుంటారు. అయితే సంతోషం అనేది కేవలం డబ్బు సంపాదనలో ఉండదు. మనం జీవించే విధానంలో కూడా ఉంటుంది. ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతి లేకపోతే అంతా వృధానే.

మరి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి.? ఈ సృష్టిలో ప్రతీ ప్రశ్నకు సమాధానం భగవద్గీతలో సమాధానం ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు. ఒక్క భారతీయులే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలు భగవద్గీతను ఫాలో అవుతుంటాయి. కార్పొరేట్‌ కంపెనీలు మొదలు సామాన్య ప్రజల వరకు వారి జీవితంలో ఎదురయ్యే ప్రతీ సవాలుకు సమాధానం ఈ పవిత్ర గ్రంథంలో ఉంటుంది. మరి సంతోషంగా ఉండాలంటే జీవితంలో పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* సముద్రంలోకి నదుల నుంచి నీరు ప్రవహిస్తూనే ఉంటాయి. కానీ సముద్రం మాత్రం నిలకడగా ఉంటుంది. అలాగే మన మనసులోకి నిత్యం ఎన్నో ఆలోచనలనే ప్రవాహాలు దూసుకొస్తూనే ఉంటాయి. అయితే అలాంటి సమయంలో కూడా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. ఎన్ని చెడు ఆలోచనలు, మిమ్మల్ని బాధించే జ్ఞాపకాలు మనసును మెలిపెడుతోన్న నిగ్రహంతో ఉండాలి. అప్పుడే జీవితంలో మీరు అనుకున్న స్థానానికి చేరుకుంటారు.

* ఇక సంతోషంగా ఉండాలంటే మనిషికి ఉండకూడని మూడు ప్రధాన అంశాలు. మోహం, దురాశ, కోపం.. ఈ మూడే మనిషి పతనానికి కారణమవుతాయి. ఎన్నో సమస్యలకు కారణం కూడా ఇవే. ఎవరిపై ఎక్కువ ఇష్టం, ఇతరులపై దురాశ, కోపం ఇందులో ఏది ఎక్కువైనా మనశ్శాంతి దూరం అవ్వడం ఖాయం.

* ఇక చాలా మంది బాధపడేది చేసిన పనికి ప్రతిఫలం దక్కలేదనో, లేదో అసలు పని మొదలు పెడుతున్నప్పుడే.. ఫలితం వస్తుందో రాదో అనే భయంతో ఉంటారు. అయితే మీ చేతిలో ఉంది ప్రయత్నం మాత్రమే అనే భావన మీలో కచ్చితంగా ఉండాలి. మీరు పని మాత్రమే చేయాలి.. ఇక ఫలితం అంటారా.? అది సమయం, మీ పక్కన వారి మీద ఆధార పడి ఉంటుంది. కాబట్టి ఫలితం గురించి ఆలోచిస్తే జీవితంలో ముందుకు వెళ్లలేరు.

* మనకు వచ్చే కష్టాలు తాత్కాలికమేననే ఆలోచనలో ఉంటారు. జీవితమనే ప్రయాణంలో కష్టాలు కేవలం స్పీడ్‌ బ్రేకర్స్‌లాగా భావిస్తేనే సంతోషంగా ఉంటాం. అలా కాదని వాటిని పట్టుకొని కూర్చుంటే జీవితంలో ముందుకు వెళ్లలేము. కాబట్టి కష్టాలకు కుంగిపోకుండా ముందుకు సాగాలి.

* అంతా మన మంచికే అనే భావన జీవితంలో పెంపొందించుకోవాలి. గతంలో మనకు నచ్చని, ఇలా జరగకుండా ఉంటే బాగుండు అనే ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. అయితే ఏదో ఒకరోజు అవి మన మంచికే జరిగాయన్న భావనతో ఉండాలి. ఇలా పాజిటివ్‌ ఆటిట్యూడ్‌తో ఉంటే కచ్చితంగా సంతోషం మీ సొంతమవుతుంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this