SportsParis Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో యాంటీ...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Talliki Vandanam (తల్లికి వందనం) Attendance Check – ఇప్పుడు మొబైల్ లోనే మీ పిల్లల హాజరు శాతం తెలుసుకోండి!

ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత...

How to Know Thalliki Vandanam Eligibility Status | తల్లికి వందనం ఏలిజిబిలిటీ స్టేటస్

తల్లికి వందనం పథకం 2026-27 – అర్హత స్థితి తనిఖీ విధానం2026-27...

Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో యాంటీ సెక్స్ బెడ్స్‌.. పాపం అంటున్న నెటిజ‌న్లు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Paris Olympics 2024 : పారిస్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఒలింపిక్స్ 2024కు అంతా సిద్ధ‌మైంది. మ‌రో ఆరు రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. జూలై 26 నుంచి ఆగ‌స్టు 11 వ‌ర‌కు ఒలింపిక్స్ క్రీడ‌లు కొన‌సాగ‌నున్నాయి. అయితే.. ఈ సారి ఒలింపిక్స్ ఆరంభ వేడుక‌ల‌ను కాస్త భిన్నంగా చేయ‌నున్నారు. ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మ‌నీని సెన్ న‌దిపై నిర్వ‌హించ‌నున్నారు. కాగా.. ఆరంభ వేడుక‌లు స్టేడియంలో కాకుండా ఆరు బ‌య‌ట న‌దిలో జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి కానుంది.

ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల కోసం నివాసం క‌ల్పించే ఒలింపిక్ విలేజ్‌లో సైతం భిన్న‌మైన ఏర్పాట్లు చేస్తున్నారు. అథ్లెట్లు శృంగారంలో పాల్గొన‌కుండా ఉండేలా.. యాంటీ సెక్స్ బెడ్స్ సిద్ధం చేశారు. కాగా..ఈ బెడ్‌ల ప‌రిణామం చాలా చిన్న‌విగా ఉన్నాయి. అదే స‌మ‌యంలో 3లక్ష‌ల కండోమ్‌ల‌ను అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు తెల‌ప‌డం గ‌మ‌నార్హం.

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా 2020లో టోక్యో వేదిక‌గా జ‌రిగిన ఒలింపిక్స్‌లో సాన్నిహిత్యం పై నిషేదం విధించారు. అత్యంత క‌ఠిన నిబంధ‌న‌ల మ‌ధ్య‌నే టోక్యో ఒలింపిక్స్‌ను నిర్వ‌హించారు. కాగా.. ఈ సారి దాదాపుగా అన్ని ఆంక్ష‌లు ఎత్తి వేశారు. అయిన‌ప్ప‌టికీ కూడా పారిస్ ఒలింపిక్స్ నిర్వాహ‌కులు ఇద్ద‌రు వ్య‌క్తులు కౌగిలించుకుని ప‌డుకోవ‌డానికి వీలు లేకుండా బెడ్‌ల‌ను త‌యారు చేయించారు. అంతేకాదండోయ్‌.. ఈ బెడ్‌ల‌ను సెక్స్ నిరోధించే ప‌దార్థాల‌తో త‌యారు చేయించిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ బెడ్‌ల‌ను జ‌ప‌నీస్ కంపెనీ ఎయిర్‌వేవ్ త‌యారు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఈ కంపెనీ బెడ్‌ల‌నే వాడారు.

ఒలింపిక్స్ విలేజ్‌లో శృంగారం గురించి ఎన్నో ద‌శాబ్దాలుగా చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదిక‌గా 2000 సంవ‌త్స‌రంలో నిర్వ‌హించిన ఒలింపిక్స్ స‌మ‌యంలో 70 వేల కండోమ్ ప్యాకెట్ల‌ను అందుబాటులో ఉంచారు. అయితే.. అవి స‌రిపోక‌పోవ‌డంతో రెండో సారి 20 వేల కండోమ్‌ల‌ను ఆర్డ‌ర్ ఇవ్వాల్సి వ‌చ్చింది. ఆ త‌రువాత నుంచి నిర్వ‌హిస్తున్న ఒలింపిక్స్‌లో ల‌క్ష కండోమ్‌ల‌ను అందుబాటులో ఉంచుతున్నారు. ప్ర‌స్తుత ఒలింపిక్స్‌లో 3 ల‌క్ష‌ల కండోమ్‌ల‌ను ఉంచ‌నున్నారు.

ఇక ఈ వార్త‌లు వైర‌ల్‌గా మార‌గా.. నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this