SportsManu Bhaker – Sarabjot Singh ఒకే...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Manu Bhaker – Sarabjot Singh ఒకే ఒలింపిక్స్‌లో 2 మెడల్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించిన మను భాకర్..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Manu Bhaker – Sarabjot Singh : పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ చరిత్ర సృష్టించింది. ఆమె పిస్టల్ నుంచి పేల్చిన బుల్లెట్ భారత్‌కు మరో పతకం సాధించడంలో సహాయపడింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 2కి పెరిగింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా కూడా మను భాకర్ నిలిచింది. మను భాకర్ తన భాగస్వామి సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి భారత్‌కు రెండో పతకాన్ని అందించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో మను-సరబ్‌జోత్ 16-10తో కొరియా జోడీని ఓడించారు.

Manu Bhaker – Sarabjot Singh ఒకే ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డ్..

అంతకుముందు, జులై 28న పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకాన్ని అందుకుంది. పారిస్‌లో సాధించిన తొలి కాంస్యంతో మను పతకాల పట్టికలో భారత్‌ ఖాతా తెరిచింది. పారిస్‌లో తొలి విజయం సాధించిన 48 గంటల తర్వాత ఇప్పుడు మను భాకర్ మరో కాంస్యం సాధించి చరిత్ర సృష్టించింది.

పారిస్‌లో మను-సర్బ్‌జోత్ జోడీ అద్భుతం..

జులై 29న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక మ్యాచ్‌కు మను భాకర్, సరబ్జోత్ సింగ్ అర్హత సాధించారు. వీరిద్దరూ క్వాలిఫికేషన్ రౌండ్‌లో 20 పర్ఫెక్ట్ షాట్‌లు చేసి 580 పాయింట్లు సాధించారు.

టోక్యో వైఫల్యానికి పారిస్‌లో చెక్ పెట్టేసిన మను భాకర్..

Manu Bhaker – Sarabjot Singh పారిస్‌లో రెండో ఒలింపిక్స్ ఆడుతోంది. అంతకుముందు ఆమె టోక్యోలో ఒలింపిక్ అరంగేట్రం చేసింది. అక్కడ ఖాళీ చేతులతో తిరిగి రావాల్సి వచ్చింది. టోక్యోలో మను భాకర్ వైఫల్యానికి కారణం ఆమె పేలవమైన ఆట కాదు. తన పిస్టల్‌లో సాంకేతిక లోపంతో విఫలమైంది. టోక్యోలో వైఫల్యం తర్వాత, మను చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. కానీ, మను భాకర్ పారిస్ నుంచి ఖాళీ చేతులతో తిరిగి రాకపోవడం విశేషం. తనతో పాటు పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతక ఖాతా తెరిచింది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this