Life StyleHuman InterestHumanity మనిషితనం మొలకెత్తాలి!

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Humanity మనిషితనం మొలకెత్తాలి!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Humanity ‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు/ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు/…అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి/ చుట్టూ తిరుగుతున్నాడమ్మా’ అంటాడో కవి. పతనం అంచున ఊగిసలాడుతున్న మానవ సంబంధాల పట్ల కవి ఆవేదన ఇది. మనిషితనం మరచిపోయిన మనిషి ప్రవర్తన పట్ల ఒకింత జుగుప్స కలగక మానదు. ఒక మనిషి మరో మనిషిపై, ఒక జాతి మరో జాతిపై ఆధిపత్యం చెలాయించాలనుకోవడం, దానికోసం ఎంతకైనా తెగించడం మాయమవుతున్న మనిషితనానికి నిదర్శనం. మనిషన్నవాడు- చెయ్యరాని చెడ్డా లేదు, చెయ్యలేని మంచీ లేదు. పాల్పడరాని స్వార్థమూ లేదు, సాధించలేని పరార్థమూ లేదు. దిగరాని నైచ్యమూ లేదు, అందుకోలేని ఉచ్ఛ స్థితీ లేదు. చెయ్యరాని నాశమూ లేదు, చెయ్యలేని నిర్మాణమూ లేదు. అందుకే అంటాడు పానుగంటి- ‘మనుష్యుడంత మాయకాడు మరియొకడున్నాడా? ముందునకు వాడే నడచును. ఆ కాళ్లతోనే వెనుకకునూ వాడే నడచును’ అని. మానవత్వం మంట కలిసిన ప్రతి చోటా… డబ్బు చుట్టే మనిషి జీవితం తిరుగుతుంటుంది. ఆ మనిషిని వెనుకుండి తిప్పే అతీత శక్తి ప్రపంచీకరణ. మనిషి తనను తాను మర్చిపోయి, స్వార్థంలో కూరుకుపోయి, నేను అనే స్వార్థపరతత్వంతో కూడిన వ్యవస్థను నిర్మిస్తున్నది ఈ మట్టికాళ్ల మహారాక్షసి ప్రపంచీకరణే.

‘ఓ రిటైర్డ్‌ టీచర్‌…తన పూర్వ విద్యార్థి పెళ్లికి వెళతాడు. ఆడంబరంగా జరుగుతున్న ఆ పెళ్లి ఆవరణలోకి అనుమతి లభించదు. నేను పెళ్లికొడుకు మాస్టార్‌ని అని చెప్పినా ఎవరూ నమ్మరు. మీరూ… మీ వేషం….మీరు టీచరేంటి? పొండి పొండి… అంటారు. వెనక్కి వెళ్లిన మాస్టారు…ఈసారి తెల్లని బట్టలు కట్టుకొని, శుభలేఖ పట్టుకొని మళ్లీ వస్తారు. మాస్టార్‌ని చూసిన పెళ్లికొడుకు…రండి మాస్టారూ…అంటూ ఆహ్వానిస్తాడు. అరే అబ్బారు…ఇదిగో నువ్విచ్చిన శుభలేఖ. మనిషిని మనిషిగా గౌరవించని చోట క్షణం కూడా వుండలేను. వేష భాషలకిచ్చే గౌరవం తోటి మనిషికి ఇవ్వలేనప్పుడు, నువ్వు ఎంత ఎదిగినా దానికి విలువ వుండదు… గుర్తుంచుకో’ అని వెళ్ళిపోతారు. ఇలాంటి సంఘటనలు తరచూ వింటూ వుంటాం. ‘ఇక్కడొక మనిషుండాలి/ కలల విత్తనాలుండాలి/ ఆనందాల మొలకలుండాలి/ తోటి మానవునికి చేయూతనిచ్చే చేయుండాలి/ బతుకుదారిలో కన్నీళ్లను తుడిచే చూపుడు వేలుండాలి/ ఇక్కడొక మనిషుండాలి/ ఏడీ ఏమయ్యాడు?’ అంటూ మనుషులు… మనుషులు కాకుండా పోతున్న వైనాన్ని చెప్తాడో కవి. అయితే, తాజాగా జరిగిన ఈ ఘటనలు మనిషితనాన్ని మరోసారి నగంగా నడివీధిలో నిలబెడతాయి. ‘ధోతీ ధరించారన్న కారణంతో ఓ అన్నదాతకు అవమానం జరిగింది. ఓ తండ్రీ, కుమారులు సినిమా చూసేందుకు బెంగళూరులోని జీటీ మాల్‌లోకి వెళ్తుండగా అక్కడి భద్రతా సిబ్బంది ఆ రైతుని అడ్డగించారు. ఆ రైతు ధోతీ ధరించడమే కారణమని, ప్యాంట్‌ ధరించి వస్తే లోపలికి అనుమతిస్తామని సిబ్బంది తెలిపారు. ఇటీవల బెంగళూరులోని రాజాజీనగర్‌ మెట్రో స్టేషన్‌లోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. మురికిగా వున్న బట్టలతో వున్నాడని ఓ రైతుని మెట్రో రైలు ఎక్కేందుకు అనుమతి నిరాకరించాడు అక్కడి సెక్యూరిటీ సూపర్‌వైజర్‌. తోటి ప్రయాణీకులు కొందరు కలుగజేసుకొని, ఆ రైతుకు మద్దతుగా నిరసన తెలిపేవరకూ వెళ్లింది.

Humanity తలకిందులవుతున్న సమాజ పోకడల్నీ, ధ్వంసమౌతున్న మానవ విలువల్నీ, మానవ సంబంధాల్నీ అంటుకట్టి బతికించుకోవాలి. ఎడారుల్లా, ఒంటరి ద్వీపాల్లా మిగిలిపోయే సంక్లిష్ట సమయాల్లోంచి, సంక్షుభిత సందర్భాల్లోంచి, సంకుచిత స్వభావాల్లోంచి మనిషి అలికిడి, మానవతా విలువలు మొలకెత్తాలి. ‘మనిషే నా కేంద్రం/ మనిషే నా సిద్ధాంతం/ అచ్చం మనిషిలానే జీవిస్తాను/ చివరకు మనిషిలానే మరణిస్తాను’ అంటూ మనిషితనాన్ని, మనిషి పట్ల మనిషికి వుండాల్సిన మానవతా బంధాన్ని కవిత్వీకరిస్తాడు కవి చిత్తలూరి. మనిషిలోని మానవత్వం గడ్డకట్టిందంటే.. జరగరానిదేదో జరిగినట్లు… మనిషి చుట్టూ పద్మవ్యూహం పన్నిన ప్రపంచీకరణే మాట్లాడుతున్నట్లు. అనేకానేక మాస్కులు తొడుక్కున్న కార్పొరేట్‌ సంస్కృతి మధ్య మానవ ముఖం సరికొత్తగా పుట్టుకురావాలి. ‘పాపాత్ముడు, పుణ్యాత్ముడు రాల్చే కన్నీళ్లకు తేడాలేదు. ప్రేమపూరిత హృదయం రక్తాశ్రువుల్ని రాలుస్తుంది’ అంటాడు కబీరు. ‘తనను అవమానించిన వ్యక్తిని ఉద్యోగంలోంచి తీసేయొద్దు…అతనికీ ఓ కుటుంబం వుంది’ అంటూ మనిషితనాన్ని చాటుకున్న ఆ రైతు హృదయం ప్రతి మనిషిలోనూ మొలకెత్తాలి. మానవ విలువల్ని పాదుకొల్పాలి.

Source: Praja Sakti


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this