Home Blog Page 72

UP Students : క్లాస్‌లో పో*ర్న్ చూసిన విద్యార్థులు..అడ్డుకున్న ప్రిన్సిపల్ ను చితకబాదిన వైనం

0

UP Students ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలోని ఓ ఇంటర్‌ కాలేజీలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి.. కొంతమంది విద్యార్థులు తరగతి గదిలో మొబైల్‌లో పో*ర్న్ చూస్తున్నారు. దీంతో ప్రిన్సిపల్‌ మందలించారు. సెలవుల అనంతరం కొందరు విద్యార్థులు దారిలో చుట్టుముట్టి ప్రిన్సిపల్‌ ను చితక బాది.. డబ్బులు కూడా లాక్కెళ్లారు. బఘౌచ్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహంత్ త్రివేణి పర్వత్ ఇంటర్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

UP Students

అసలేం జరిగిందంటే.. కాలేజీలో ఏడో పీరియడ్‌ సమయంలో క్లాస్‌లోని కొందరు విద్యార్థులు ఇతర బాలికలతో కలిసి ఓ గదిలో కూర్చుని మొబైల్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నారు. ఇది గమనించిన ప్రిన్సిపాల్ విద్యార్థులను మందలించి.. మొబైల్ లాక్కోవడంతో పాటు ఎనిమిదో పీరియడ్‌లో మళ్లీ అలా చేయవద్దని సూచించారు. మొబైల్‌ను తిరిగి ఇచ్చేశారు. అయితే క్లాస్‌ ముగించుకుని ప్రిన్సిపాల్‌ బైక్‌పై ఇంటికి వస్తుండగా ఓ విద్యార్థి తన స్నేహితులతో కలిసి చుట్టుముట్టి కొట్టాడు. అంతే కాదు ఆ విద్యార్థి తనను తుపాకీతో బెదిరించి జేబులోంచి రూ.2200 తీసుకున్నాడని ప్రిన్సిపాల్ ఆరోపించారు. గట్టిగా అరవడంతో స్థానికులు వస్తారని బయపడి నిందితులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు.

ప్రిన్సిపాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

UP Students ఈ కేసులో నిందితుడైన విద్యార్థిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ శశి శేఖర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై బాఘౌచ్‌ఘాట్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి రాజేష్ పాండే మాట్లాడుతూ.. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని, విచారణ జరుపుతున్నామన్నారు. త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

కాగా..UP Students ఈ ఇంటర్ కాలేజ్ బీహార్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. కళాశాల నుంచి బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా దూరం కేవలం ఒక కిలోమీటరు మాత్రమే. బీహార్ నుంచి 40 శాతం మంది విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువుకుంటారు. ఈ కళాశాలలో మొత్తం 2800 మంది విద్యార్థులు ఉన్నారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Kohli Rohit కోహ్లీ, రోహిత్‌లతో జాగ్రత్త.. వాళ్లు సామాన్యులు కాదు! గంభీర్‌కు BCCI హెచ్చరిక

0

Kohli Rohit శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు(జులై 30, మంగళవారం) టీమిండియా, శ్రీలంకతో చివరి టీ20 మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి టీ20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయాలని భావిస్తోంది. టీ20 సిరీస్‌ తర్వాత.. లంకతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది భారత జట్టు. ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్‌ మొదలుకానుంది. ఈ వన్డే సిరీస్‌ కోసం ఇప్పటికే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శ్రీలంకకు చేరుకున్నాడు. ఈ రోజు విరాట్‌ కోహ్లీ కూడా రానున్నాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు బీసీసీఐ పెద్దలు పలు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది.

Kohli Rohit

ఇKohli Rohit ప్పటి వరకు టీ20 సిరీస్‌లో భాగంగా యువ క్రికెటర్లతో మాత్రమే ఉన్న గంభీర్‌.. వన్డే సిరీస్‌లో టీమిండియాలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ లాంటి సూపర్‌ స్టార్‌ క్రికెటర్లతో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోనున్నాడు. ఈ క్రమంలోనే యువ క్రికెటర్లతో వ్యవహరించినట్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలతో వ్యవహరించే ప్రయత్నం చేయవద్దని, సీనియర్‌ ఆటగాళ్లుగా వాళ్లతో ప్రోటాకల్‌ పాటించాల్సందే అంటూ బీసీసీఐ గంభీర్‌కు గట్టి సూచనలు చేసినట్లు రిపోర్ట్స్‌ పేర్కొంటున్నాయి. ఇది ఫ్రాంచైజ్‌ టీమ్‌ కాదని, ఇది ఇండియన్‌ టీమ్‌ అనే విషయం గుర్తుంచుకోవాలని గంభీర్‌ను హెచ్చరించినట్లు సమాచారం.

అంతా నీ ఇష్టం వచ్చినట్లు చేస్తానంటూ కుదరదని, కొత్తలో కొంత ఇబ్బంది ఉంటుందని, రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఈ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డాడని, కానీ, తర్వాత అర్థం చేసుకున్నాడంటూ బీసీసీఐ పెద్దలు గంభీర్‌కు వివరించారు. ద్రవిడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయి.. కోచ్‌గా బాధ్యతలు తీసుకునే సమయానికి ఇండియన్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ వ్యవహరాల్లో చాలా మార్పులు జరిగాయి. వాటికి అనుగుణంగానే నడుచుకోవాలని గంభీర్‌కు సూచించారు. పైగా టీమ్‌లో చాలా మంది మల్టీ బిలియనీర్లు ఉన్నారు, ఫ్రాంచైజ్‌ క్రికెట్‌కు కెప్టెన్లుగా ఉన్నారు.. వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని.. ఇష్టమొచ్చినట్లు చేస్తే కుదరదంటూ, ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ గంభీర్‌కు బీసీసీఐ పెద్దలు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Kohli Rohit

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Manu Bhaker – Sarabjot Singh ఒకే ఒలింపిక్స్‌లో 2 మెడల్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించిన మను భాకర్..

0

Manu Bhaker – Sarabjot Singh : పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ చరిత్ర సృష్టించింది. ఆమె పిస్టల్ నుంచి పేల్చిన బుల్లెట్ భారత్‌కు మరో పతకం సాధించడంలో సహాయపడింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 2కి పెరిగింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా కూడా మను భాకర్ నిలిచింది. మను భాకర్ తన భాగస్వామి సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి భారత్‌కు రెండో పతకాన్ని అందించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో మను-సరబ్‌జోత్ 16-10తో కొరియా జోడీని ఓడించారు.

Manu Bhaker – Sarabjot Singh ఒకే ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డ్..

అంతకుముందు, జులై 28న పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకాన్ని అందుకుంది. పారిస్‌లో సాధించిన తొలి కాంస్యంతో మను పతకాల పట్టికలో భారత్‌ ఖాతా తెరిచింది. పారిస్‌లో తొలి విజయం సాధించిన 48 గంటల తర్వాత ఇప్పుడు మను భాకర్ మరో కాంస్యం సాధించి చరిత్ర సృష్టించింది.

పారిస్‌లో మను-సర్బ్‌జోత్ జోడీ అద్భుతం..

జులై 29న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక మ్యాచ్‌కు మను భాకర్, సరబ్జోత్ సింగ్ అర్హత సాధించారు. వీరిద్దరూ క్వాలిఫికేషన్ రౌండ్‌లో 20 పర్ఫెక్ట్ షాట్‌లు చేసి 580 పాయింట్లు సాధించారు.

టోక్యో వైఫల్యానికి పారిస్‌లో చెక్ పెట్టేసిన మను భాకర్..

Manu Bhaker – Sarabjot Singh పారిస్‌లో రెండో ఒలింపిక్స్ ఆడుతోంది. అంతకుముందు ఆమె టోక్యోలో ఒలింపిక్ అరంగేట్రం చేసింది. అక్కడ ఖాళీ చేతులతో తిరిగి రావాల్సి వచ్చింది. టోక్యోలో మను భాకర్ వైఫల్యానికి కారణం ఆమె పేలవమైన ఆట కాదు. తన పిస్టల్‌లో సాంకేతిక లోపంతో విఫలమైంది. టోక్యోలో వైఫల్యం తర్వాత, మను చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. కానీ, మను భాకర్ పారిస్ నుంచి ఖాళీ చేతులతో తిరిగి రాకపోవడం విశేషం. తనతో పాటు పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతక ఖాతా తెరిచింది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Nagini Dance : వ్యూస్ లైక్స్ కోసం ఏ పనైనా చేస్తున్న యువత.. బురదలో నాగిని డ్యాన్స్ వీడియో వైరల్

Nagini Dance ప్రస్తుతం రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా రీల్స్ చేయడానికి ఏదైనా చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని రకాల వీడియోలకు ఆసక్తికర వ్యాఖ్యలు, లైకులు వస్తాయి. దీంతో తము ఇంటర్నెట్ లో చాలా ఫేమస్ అవుతామని భావిస్తున్నారు కూడా. ప్రస్తుతం అందరూ రీల్స్ చేయడానికి ముఖ్య కారణం ఇదే. కొన్ని రకాల వీడియోలు ఆకట్టుకుంటాయి. వీటిని ఇది చూసిన తర్వాత ఒక్కోసారి ఆశ్చర్యానికి లోనవుతారు.. ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఒక్కోసారి అనిపిస్తుంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశమైంది.

Nagini Dance

నాగినీ డ్యాన్స్ అంటే ఎంత క్రేజో మనందరికీ తెలిసిందే. పెళ్లిళ్లలో ప్రజలు ఈ నృత్యాన్ని ఉత్సాహంగా చేయడం తరచుగా చూసి ఉంటారు. ఇటీవలి కాలంలో ఇలాంటి వీడియో జనాల్లో చర్చనీయాంశమైంది. ఒక జంట పాములా మారి నాగిలీ డ్యాన్స్ చేస్తున్నారు. అయితే ఈ నాగిని డ్యాన్స్ ను బురదతో కూడిన పొలంలో చేయడం విశేషం. ఇది చూసి చాలా మంది లైకులు, వ్యూస్ కోసం యువత వీర్రితలలు వేస్తుంది అని కామెంట్ చేస్తున్నారు.

Nagini Dance ఓ జంట బురదలో పాములా డ్యాన్స్ చేయడం వీడియోలో చూడవచ్చు. వీరిని చూస్తుంటే భార్యాభర్తలా అనిపిస్తోంది. వీరి డ్యాన్స్‌ బురదతో నిండిన పొలంలో సాగిపోయింది. ఓ యువ జంట పొలంలో రొమాంటిక్ పోజ్ ఇస్తూ నృత్యం చేయడం ప్రారంభించింది. బురదలో కప్పుకున్న జంట చేసిన ఈ నాగినీ డ్యాన్స్ వీడియో వేగంగా వైరల్ అవుతోంది.

వినయ్ Vk 9351 అనే ఖాతా ద్వారా ఈ Nagini Dance వీడియో YouTubeలో షేర్ చేశారు. ఇప్పటి వరకూ ఈ వీడియోను వేల మంది దీనిని చూసి కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారుడు లైక్, వ్యూస్ మీద పిచ్చి ప్రజలను వెర్రివాళ్లను చేస్తోందని కామెంట్ చేస్తే, మరొకరు ‘సర్పం ఇలా ఎలా నాట్యం చేస్తుంది’ అని కామెంట్ చేశారు. అంతేకాదు చాలా మంది ఇతర వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానించడం ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపారు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


AP Open School Admissions : సార్వత్రిక విద్యాలయం ప్రవేశాల తేదీలివే..

AP Open School Admissions : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పదవ తరగతి ఇంటర్ లో ప్రవేశాల కొరకు పత్రిక ప్రకటన విడుదల చేసింది.

AP Open School Admissions

AP Open School Admissions ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించింది. అడ్మిషన్ల ప్రక్రియ జూన్ నెల 31వ తేదీ నుండి ప్రారంభం అయ్యి సెప్టెంబర్ 4వ తేదీతో పూర్తవుతుంది.

ap open school admissions
october 2, 2026, 12:14 am - duniya360

AP Open School Admissions పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము (APOSS) ద్వారా 2024-2025 విద్యా సంవత్సరంనకు సంభందించి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ తరగతులలో అడ్మిషన్ పొందడానికి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము (APOSS) సంచాలకులు వారు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగినది.

పదవ తరగతిలో చేరుటకుగాను 14 సంవత్సరాలు నిండిన వారికి మరియు ఇంటర్మీడియట్ చేరుటకుగాను పదవ తరగతి పాసై 15 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తులు చేయుటకు అర్హులు, దరఖాస్తు చేసుకోవడానికి www.apopenschool.ap.gov.in

ప్రవేశం కొరకు వివరములు

S.NoItemDates
1అడ్మిషన్లు ప్రారంభ తేది31-07-2024
2అడ్మిషన్లు ఆన్లైన్ లో సబ్మిట్ చేయడానికి చివరి తేది27-08-2024
3అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేది.28-08-2024
4Rs. 200/- లేటు ఫీజుతో అడ్మిషన్లు ఆన్లైన్ లో చేయడానికి చివరి తేది04-09-2024

ఆసక్తి ఉన్న అభ్యాసకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనవల్సిందిగా కోరుతున్నాము. అదనపు సమాచారం కొరకు www.apopenschool.ap.gov.in వెబ్ సైట్ ను లేదా మీకు సమీపంలోని A.I. సెంటర్ ను సంప్రదించి పూర్తి వివరములు పొందగలరు.

Hyderabad Friends Rape : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై స్నేహితుల సామూహిక అత్యాచారం

0

Hyderabad Friends Rape : హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్‌రేప్‌ జరిగింది. ఓ హోటల్‌లో యువతిపై స్నేహితులే సామూహిక అత్యాచారం జరిగిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.

Hyderabad Friends Rape హైదరాబాద్‌ వనస్థలిపురంలో స్నేహితుడితో కలిసి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ యువతి హోటల్‌కు వెల్లింది. అక్కడ యువకులతో పాటు యువతికూడా మద్యం సేవించినట్లు తెలుస్తుంది. అయితే స్నేహితులతో పాటు మరొక వ్యక్తి కూడా రావడంతో.. అతను కూడా మద్యం సేవించాడు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ.. స్నేహితురాలని ఆమె నివాశానికి తీసుకుని వెళ్లకుండా.. ఆమెపై అందరూ కలిసి అత్యాచారం చేయాలని ప్లాన్‌ వేసుకున్నారు. మద్యం మత్తులో వున్న స్నేహితురాలిని స్నేహితులే రేప్‌ చేశారు. స్నేహితులే కాకుండా వారితో పాటు వచ్చిన మరొక వ్యక్తి కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. మద్యం మత్తులో వున్న ఆ యువతి తరువాతి రోజు మెలుకువ రావడంతో.. తనపై అత్యాచారం జరిగిందని గ్రహించింది. స్నేహితులని నమ్మివస్తే.. తనకు మద్యం ఇచ్చి.. అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

Hyderabad Friends Rape

Hyderabad Friends Rape న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పథకం ప్రకారమే తనును హోటల్‌ రూంకు తీసుకుని వెళ్లినపై అత్యాచారం చేశారని అర్థమైందని వాపోయింది. స్నేహితులని నమ్మితే తనపై రేప్‌ చేశారని కన్నీరుమున్నీరుగా విలపించింది. స్నేహితులతో వచ్చిన వ్యక్తి కూడా తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు తెలిపింది. యువతి ఇచ్చిన ఆధారాలతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతిని ఎందుకు హోటల్‌ కు తీసుకుని వెళ్లారు. ఇంతకు ముందుకు కూడా ఇలానే చేశారా? లేక యువతిని స్నేహం పేరుతో ట్రాప్ చేసి ప్లాన్‌ ప్రకారం ఆమెకు మద్యం తాగింది అత్యాచారానికి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితులతో కలిసి వచ్చి మరో వ్యక్తి ఎవరు? వీరందరూ కలిసి యువతిపై అత్యాచారం చేశారంటే.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మద్యంలో యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి వుంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. యువతితో సహా తన స్నేహితులందరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పోలీసులు గుర్తించారు. వీరు ఏ సంస్థలో పనిచేస్తున్నారనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Annapurna Studios Fake Mail : సినిమాలో ఆఫర్ అంటూ అన్నపూర్ణ స్టూడియో పేరుతో ఫేక్ మెయిల్స్

Annapurna Studios Fake Mail సినిమా అంటే ఎంటర్‌టైన్ మెంటే కాదు ఎమోషన్ కూడా. సినిమా మీద పిచ్చి, ఫ్యాషన్‌తో చాలా మంది ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్‌కు వెళ్లే రైలెక్కేస్తుంటారు. వెండితెరపై తమను తాము చూసుకోవాలని ఆరాటపడుతూ ఎక్కడకు వెళ్లాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక కష్టాలు పడుతుంటారు.

Annapurna Studios Fake Mail స్టూడియో గేట్ల దగ్గర లేదంటే సినిమా ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతుంటారు. ఇలాంటి వారినే టార్గెట్ చేస్తూ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపుతున్నారు. నటీనటులు కావాలంటే కాస్టింగ్ కాల్ అంటూ ప్రకటనలు చేసి.. వారి వద్ద నుండి డబ్బులు దండుకుని పత్తా లేకుండా పోతున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఫేక్ మెయిల్స్ పంపుతున్నారు. అలాగే ఫేక్ ప్రకటనలు చేస్తున్నారు. ఈ విషయం అన్నపూర్ణ స్టూడియో దృష్టికి వెళ్లింది.

Annapurna Studios Fake Mail

కాస్టింగ్ కాల్ పేరుతో ప్రకటనలు, మెయిల్స్ పంపడంపై అన్నపూర్ణ స్టూడియో స్ స్పందించింది. అవి ఫేక్ మెయిల్ అండ్ ప్రకటన అని తెలిపింది. ఇంతకు ఆ ప్రకటనలో ఏముందంటే..? 205 ఖైదీ స్టోరీ అనే మూవీకి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కోసం కాస్టింగ్ కాల్ ప్రకటన చేసింది. ఇందులో హీరో క్యారెక్టర్ 20-27 ఏళ్లు ఉండాలని, హీరోయిన్స్ ముగ్గురు అని అందులో 8-15 సంవత్సరాలు  ఉండాలని, ఫ్రెండ్ క్యారెక్టర్ (బాయ్స్ అండ్ గర్ల్స్) 8-15 సంవత్సరాలు వయసున్న వాళ్లు, అలాగే సిస్టర్ క్యారెక్టర్, చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఇదే వయస్సుతో ఉన్నవాళ్లు కావాలంటూ ఎనౌన్స్ చేసింది. దీనిపై అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోగో వేసి ఉండటంతో పాటు ప్రొఫైల్ పిక్ పంపాలంటూ అడ్రస్ ఉండటంతో నిజమేనని అనుకున్నారంతా. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్పందించింది అన్నపూర్ణ స్టూడియోస్.

Annapurna Studios Fake Mail ఈ ప్రకటన సదరు నిర్మాణ సంస్థ దృష్టికి వెళ్లడంతో స్పందించింది. ‘అన్నపూర్ణ స్టూడియో పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ కాస్టింగ్ కాల్ మా దృష్టికి వచ్చింది. మేము ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మా సంస్థకు ఈ ప్రకటనకు ఎటువంటి సంబంధం లేదు. వ్యక్తిగత సమాచారాన్ని అందించకండి. ఎలాంటి డబ్బులు పంపకండి. అలాంటి నకిలీ కాస్టింగ్ కాల్‌లో పాల్గొనకండి. మా కాస్టింగ్ కాల్, అప్ డేట్స్ కేవలం మా సోషల్ మీడియా ఖాతాలు, పేజీలల్లో మాత్రమే పోస్టింగ్ చేయబడతాయి’ అని పేర్కొంది. అయితే గతంలో కూడా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఇలాంటి ఫేక్ మెయిల్స్ పంపించారు. దీనిపై చర్యలు తీసుకుంటామని నిర్మాణ సంస్థ వెల్లడించింది. మొన్నటి మొన్న మంచు విష్ణు నుండి కూడా కొంత మందికి ఫేక్ మెయిల్స్ వెళ్లిన సంగతి విదితమే.





Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Asia Cup Host India : వచ్చే ఏడాది ఆసియా కప్ కు ఆతిథ్యమివ్వనున్న భారత్

0

  • 2025లో ఆసియా కప్ కు వేదికగా భారత్
  • టీ20 ఫార్మాట్ లో పోటీలు
  • ఒకే ఒక్కసారి 1990-91లో ఆసియా కప్ కు ఆతిథ్యమిచ్చిన భారత్

Asia Cup Host India భారత్ 2025లో పురుషుల టీ20 ఆసియా కప్ కు ఆతిథ్యమివ్వనుంది. 2023లో ఆసియా కప్ ను హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వన్డే ఫార్మాట్ లో ఆసియా కప్ నిర్వహించగా… పాకిస్థాన్, శ్రీలంక ఆతిథ్యమిచ్చాయి. ఈసారి ఆసియా కప్ ను టీ20 ఫార్మాట్ లో నిర్వహించనుండగా, ఆతిథ్య హక్కులను భారత్ చేజిక్కించుకుంది.

Asia Cup Host India

కాగా, 1984 నుంచి ఆసియా కప్ టోర్నీ నిర్వహిస్తుండగా… అప్పటి నుంచి ఇప్పటివరకు భారత్ ఒక్కసారి మాత్రమే ఆతిథ్యమిచ్చింది. 1990-91 సీజన్ లో ఆసియా కప్ కు భారత్ వేదికగా నిలిచింది. ఆ టోర్నీలో టీమిండియానే విజేతగా నిలిచింది.

ఇక, 2027 ఆసియా కప్ టోర్నీ ఆతిథ్య హక్కులు బంగ్లాదేశ్ కు కేటాయించారు. అయితే బంగ్లాదేశ్ లో జరిగే ఆసియా కప్ ను వన్డే ఫార్మాట్ లో నిర్వహించనున్నారు.

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


AP: School Complex Meeting Dates 2024-2025 ఈ విద్యా సంవత్సరానికి స్కూల్ కాంప్లెక్స్ నిర్వహణ తేదీలివే

School Complex Meeting Dates announced in Academic calendar for Academic Year 2024-2025. ఈ విద్యా సంవత్సరానికి స్కూల్ కాంప్లెక్స్ నిర్వహణ తేదీలివే..

ap open school admissions

School Complex Meeting Dates

  • ఆగష్టు 2024::-16&17
  • సెప్టెంబర్ 2024::-17&18
  • అక్టోబర్ 2024::-16&17
  • నవంబర్ 2024::-16&18
  • డిసెంబర్ 2024::-16&17
  • జనవరి 2025::-22&23
  • ఫిబ్రవరి 2025::-21&22
  • మార్చి 2025::-21&22

iPhone Wedding Card : వైజాగ్ జంట వినూత్న ఆలోచన.. ఐఫోన్ పోలిన వెడ్డింగ్ కార్డు.. నెటిజన్లు ఫిదా..!

iPhone Wedding Card : ఇప్పుడు ట్రెండ్ మారింది.. వెడ్డింగ్ కార్డ్ అనేది కేవలం ఇన్విటేషన్ మాత్రమే కాదు.. దంపతుల అభిరుచి, శైలికి ప్రతిబింబం. దంపతుల ప్రత్యేక రోజు గురించి స్నీక్ పీక్. ఇటీవలి సంవత్సరాలలో పెళ్లిళ్ల సమయంలో ఫ్యాన్సీ, కస్టమైజడ్ వెడ్డింగ్ కార్డులు ప్రత్యేకింగా నిలుస్తున్నాయి. చాలామంది వధువరులు తమ వెడ్డింగ్ కార్డు విషయంలో సరికొత్తగా ఆలోచిస్తున్నారు. కాలానికి అనుగుణంగా, విశాఖపట్నంలో ఒక జంట ఐఫోన్ బ్యాక్‌గ్రౌండ్ మాదిరిగా ప్రత్యేకమైన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును రూపొందించారు.

iPhone Wedding Card

iPhone Wedding Card లక్ష్మణ్ వెడ్డింగ్ కార్డ్స్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆహ్వానానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఐఫోన్‌ను పోలి ఉండేలా రూపొందించిన వినూత్న వెడ్డింగ్ ఇన్విటేషన్ అందరిని ఆకట్టుకుంటోంది. మొత్తం మూడు పేజీలలో బుక్‌లెట్-డిజైన్ లేఅవుట్‌తో రూపొందించారు. కవర్ పేజీలో ఫోన్ వాల్‌పేపర్ మాదిరిగా జంట ఫోటోను ‘బ్యాక్‌గ్రౌండ్’గా కనిపిస్తుంది. ఫొటో పైన వివాహ సమయం, తేదీ వివరాలు ప్రముఖంగా ప్రింట్ చేశారు. ఇన్విటేషన్ లోపల ఉన్న పేజీలలో ఒకటి వాట్సాప్ చాట్ మెసేజ్ ఫార్మాట్ కలిగి ఉంది.

3డీ మాదిరి డిజైన్.. ఐడియా అదుర్స్ :
iPhone Wedding Card “సెండ్ లొకేషన్” క్యాప్షన్, వేదిక వివరాలు ఉన్నాయి. ఇంతలో, ఇన్విటేషన్ ‘బ్యాక్ కవర్’ అద్భుతమైన కెమెరా ఇలస్ట్రేషన్‌ను కలిగి ఉంది. 3డీ మాదిరిగా డిజైన్ చేసి ఉంది. ఇప్పటివరకు ఈ వీడియో 15 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇంటర్నెట్ యూజర్లు ఈ ప్రత్యేకమైన డిజైన్‌ను చూసి ఆశ్చర్యపోయారు.

తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఈ పెళ్లి కార్డుల ఖరీదు గురించి కూడా కొందరు ఆరా తీశారు. ”ఒక డిజైనర్ వివాహం చేసుకున్నప్పుడు.. ఈ ఐడియా నాకు బాగా నచ్చింది’’ అని ఒక యూజర్ కామెంట్ చేయగా, మరో యూజర్ ‘చాలా ఖరీదైన వెడ్డింగ్ కార్డ్’ అని చమత్కరించారు.

iPhone Wedding Card మూడో యూజర్… మీ ఆలోచన బాగుందని మెచ్చుకోగా.. నాల్గో యూజర్ ”నువ్వు నిజంగా ప్రతిభావంతుడివి” అని కామెంట్ చేశాడు. గతంలో, కంపెనీ రోజువారీ వస్తువుల నుంచి ప్రేరణ పొందిన ఇతర వినూత్న డిజైన్‌లను కూడా రూపొందించింది.

ఐఫోన్-ఫార్మాట్ ఇన్విటేషన్లతో పాటు సంప్రదాయ ఆహ్వాన ఆకృతికి ఆహ్లాదకరమైన అంశాన్ని జోడించి, పాస్‌పోర్ట్‌లు, వార్తాపత్రికలను పోలి ఉండే వెడ్డింగ్ కార్డులను అందిస్తారు. గతేడాది రీసెర్చ్ పేపర్‌లా ఉండే ఓ యూనిక్ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరిగా, వెడ్డింగ్ కార్డు టైటిల్‌లో వివాహ వేదికతో పాటు జంట పేర్లు కూడా ముద్రించారు. వివాహం ప్రాముఖ్యతను కూడా అందులో వివరించారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.