Home Blog Page 71

Wayanad landslides వయనాడ్‌లో జల విలయం.. 600 మంది వలస కార్మికులు గల్లంతు.. ఆచూకీపై ఆందోళన

0

Wayanad landslides : కేరళలోని వయనాడ్ జిల్లాలో సంభవించిన ప్రకృతి విలయం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. భారీ వరదలతో కొండచరియలు విరిగిపడడంతో మాటలకందని విపత్తు సంభవించింది. దాదాపు వంద మంది ప్రాణాలు కోల్పోగా, వందల సంఖ్యలో స్థానికులు గల్లంతయ్యారు. పొట్టకూటి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు కూడా విపత్తులో చిక్కుకుపోయారు. సుమారు 600 మంది వలస కార్మికులు జాడ తెలియడం లేదు.

Wayanad landslides

తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వచ్చిన కార్మికులు ముండకై ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరంతా హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నారు. తమ కంపెనీలో పనిచేసే కార్మికులను ఇప్పటివరకు సంప్రదించలేకపోయామని కంపెనీ జనరల్ మేనేజర్ బెనిల్ జోన్స్ వెల్లడించడంతో ఆందోళన రేగుతోంది. మొబైల్ ఫోన్ నెట్‌వ‌ర్క్‌ కూడా పనిచేయకపోవడంతో కార్మికుల జాడ తెలియరాలేదు. ముండకై ప్రాంతంలోని నాలుగు వీధుల్లో 65 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కార్మికులు నివాసం ఉండే ప్రాంతాలపై కొండ చరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో కార్మికులు ఏమాయ్యారోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

నదిలో తేలియాడుతున్న మృతదేహాలు
Wayanad landslides కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు మలప్పురం చలియార్ నదిలో తేలియాడుతున్నాయి. కొండ చరియలు విరిగిపడ్డ స్థలానికి కిలోమీటర్ల దూరంలో శరీర భాగాలు లేకుండా మృతదేహాలు లభ్యమవుతుండడం దిగ్బ్రాంతి కలిగిస్తోంది. శరీర భాగాలు లేకుండా మూడేళ్ల పాప మృతదేహం దొరకడం అక్కడున్నవారిని తీవ్రంగా కలచివేసింది.

సహాయక చర్యలు ముమ్మరం
Wayanad landslides కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బాధితులకు సాయం చేయడానికి నౌకాదళానికి చెందిన 30 మంది గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. భారత వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 321 మందితో కూడిన అగ్నిమాపక దళంతో పాటు 200 మంది సైనిక సిబ్బంది కూడా సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


AP EAMCET Counselling Final Phase Allotment Result 2024 Link Out Now

0

AP EAMCET Counselling Final Phase Allotment Result 2024 : AP EAPCET counselling 2024 final phase allotment result to be announced online today, July 30, 2024. Candidates who have applied for the final phase allotment round can check the results online. 

EAMCET Counselling Final Phase Allotment

Once announced the AP EAMCET counselling final phase allotment result will be available on the official website – eapcet-sche.aptonline.in. To check the allotment result, students must visit the official website and login using the EAMCET hall ticket number and date of birth. Candidates will also be provided with the direct link here to download the allotment result.

AP EAMCET Counselling 2024 Final Phase Allotment – Click Here

eamcet counselling final phase allotment
october 1, 2026, 11:11 pm - duniya360

Forms

INFORMATION BULLETIN / Downloads

Important Dates

How to Check AP EAPCET Counselling Allotment Result 

The AP EAMCET counselling final phase allotment result will be available on the official website soon. Those who have applied for the allotment round can check the allotment result through the link given here. 

Step 1: Visit the official website of AP EAMCET counselling

Step 2: Click on the counselling final phase allotment result link

Step 3: Login using the hall ticket number and date of birth

Step 4: The EAMCET allotment result will be displayed

Step 5: Download the allotment result for further reference

AP EAMCET Counselling 2024 Documents Required for Admission

Those allotted seats in the final phase of allotment must report to the allotted colleges between July 31 and August 3, 2024. Students must also carry with them the following documents for final admissions

  • AP EAMCET hall ticket
  • AP EAPCET scorecard
  • Allotment letter
  • Category certificate
  • 10th, 12th marksheets
  • Date of Birth proof
  • EWS category certificate
  • Domicile certificate
  • ID proof
  • Other required documents

Check Your CFMS Bill Status

0

Check Your CFMS Bill Status AP Government Employees Salary Pay Bill Status CMFS Bill Number CFMS Citizen Salary Bill Status Series Bill Number AP Payroll Herb Bill Status with 2022 Series Bill Number BILL DETAILS DETAIL FLOW OF BILL BENEFICIARY DETAILS

check your cfms bill status

Check Your CFMS Bill Status

  • CFMS ద్వారా ట్రజరీకి సబ్మిట్ చేసిన బిల్ స్టేటస్ ను తెలుసుకోండి.
  • బిల్ స్టేటస్ తెలుసుకోవాలంటే లాగిన్ అవసరం లేదు. 

Check Your CFMS Bill Status బిల్ నెంబర్ కావలెను. ఏ నెల బిల్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నమో ఆ నెల పే స్లిప్పు హెర్బ్ అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే పేస్లిప్ లో ఆ నెల బిల్ నంబరు అందుబాటులో ఉంటుంది ఆ బిల్ నెంబర్ ద్వారా మనం క్రింది లింకు ఉపయోగించి ఆ బిల్ స్టేటస్ తెలుసుకొనవచ్చును.

Know Your CFMS Bill Status

Steps involved in crediting salaries:

1. In Green channel clearance

2. In process for payment disbursement through RBI e-Kuber

3. Payment in progress with batch number – xxxxx

జీతం బిల్లులకు బ్యాచ్ నెంబర్లు కేటాయించిన తర్వాత మాత్రమే జీతాలు జమ అవుతాయి……

CFMS Bill Status click here

NIDHI Pay Slip App Download

0

NIDHI Pay Slip App Download Latest Version https://nidhi.apcfss.in/  NIDHI AP Employees Pay Slip App NIDHI APCFSS APP latest Updated Version Download  Android App Latest version Download nidhi-pay-slip-android-app APCFSS – MOBILE APPS AP Employees Pay Slip https://nidhi.apcfss.in/ AP Employees Pay Slip Download Pay Slip Android App Download Pay Slip iOS App AP Employees, Teachers pay particulars AP Govt. Employee Pay Slip AP Employees Salary Slip / Pay Slip Download AP Employees Download Pay Slips from Govt Official NIDHI APP Government of Andhra Pradesh has implemented the new PRC for the Employees / Pensioners and is making the payment of Salaries / Pensions Revised Pay Scale RPS 2022. Employees / Pensioners can access their New Pay Slips from January 2022.

To download NIDHI Pay Slip App Download Click on below link 🖇️

Download NIDHI Pay Slip App

NIDHI Pay Slip App Download Latest Version Features:

  • Personal Information
  • Pay Slips
  • Bank Details
  • Spouse Name
  • School Address
  • APGLI
  • PF
  • PRAN/ CPS వివరాలు పొందవచ్చు
  • Paermanent /Communication Address
  • 01.01.2022 నుండి Pay Slips పొందవచ్చు
  • Bank Account No మార్చుకునే సదుపాయం కలదు
  • ELs

AP Employees can download Official Pay Slips and can change Personal, Aadhaar, PAN, Bank details without any OTP & without DDO Login from Latest NIDHI Mobile Application.

NIDHI Pay Slip App Download Latest Version User-friendly app designed for all Andhra Pradesh state government employees. This app has a provision that, an employee can get his/her information through the services designed as per employee data. At present services provided like, Pay slip, APGLI, CPS Contribution Dash Board Employee services. Employee can view pay slip and they can download the pay slip. Employee can check APGLI Fresh/enhanced policy status, loan status and refund status. Employee can view the profile.

nidhi pay slip app download

NIDHI (HERB) Mobile App:

  • NIDHI Mobile ద్వారా జీత భత్యాల వివరాలు CFMS ID తో చాల సులభంగా తెలుసుకోవచ్చు.
  • మనకు కావలసిన నెలకి పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.(one year back up)
  • APGLI వివరాలు తెలుసుకోవచ్చు .
  • CPS వివరాలు తెలుసుకోవచ్చు .
  • NIDHI అప్ ను ఇన్స్టాల్ చేసుకుని మన వ్యక్తిగత ప్రతినెల శాలరీ వివరాలు, శాలరీ సిప్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు .
  • అలాగే ఏపీజిఎల్ఐ వివరాలు మరియు యాన్యువల్ అకౌంట్ స్టేట్మెంట్, లోన్ స్టేటస్, లోన్ వివరాలు అన్ని సులభంగా తెలుసుకోవచ్చు.
  • Pay Slip Option తో పాటుగా అందరికి EMPLOYEE Self Services ESS Tile, APGLI Tile ఇవ్వడం జరిగింది.
  • Personal Details Tile ఉపయోగించి Personal, Mobile, email PAN, PF, PRAN, Bank Details etc… ఈ యాప్ ద్వారానే ఎడిట్ లేదా మార్పు చేయవచ్చు.
  • యూజర్ ఐడి గా మీ సి ఎఫ్ ఎం ఎస్ ఐ డి ని ఎంటర్ చేసి డిఫాల్ట్ పాస్వర్డ్ cfss@123 ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓటిపి వస్తుంది. 
  • ఓటీపీని ఎంటర్ చేస్తే ఆప్ మనం వినియోగించుకోవచ్చు.

To download mobile app Click on below link 🖇️

Download NIDHI Pay Slip App

Sri Leela Conditions శ్రీలీల కొత్త కండీషన్.. స్టార్ హీరోకైనా నో చెప్పేస్తుందట!

Sri Leela Conditions  టాలీవుడ్ లోకి రాకెట్ వేగంతో దూసుకొచ్చింది ఈ యంగ్ బ్యూటీ. శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు కొట్టేసింది. మాస్ మహరాజ రవితేజతో ‘ధమాకా’ లాంటి బ్లాక్ బస్టర్  అందించింది. ఆ తర్వాత కూడా ఎక్కడా ఆగకుండా వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ పరిశ్రమలో ఛార్మింగ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అయితే గుంటూరు కారం తర్వాత మాత్రం ఈ అమ్మడు కాస్త దూకుడు తగ్గించిందనే చెప్పాలి. పైగా ఇప్పుడు కొత్త కండీషన్ కూడా పెడుతున్నట్లు టాక్. ఆ కండీషన్ కు ఒప్పుకోకపోతే.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా రిజెక్ట్ చేస్తుందట.

Sri Leela Conditions

శ్రీలీల.. అందం, అభినయం, డ్యాన్స్ ఈ మూడు విషయాల్లో బెస్ట్. ధమాకాలో ఆమె చేసిన డ్యాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా విడుదల కాకముందే ఈ అమ్మడి చేతుల్లో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఆదికేశవ, ఎక్స్ ట్రార్డినరీ మెన్, భగవంత్ కేసరి, గుంటూరు కారం లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం నితిన్ తో ఓ మూవీ చేస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ లో చేస్తోంది. ఈ రెండు చిత్రాలు తప్పితే.. మరే సినిమాలు ఆమె చేతుల్లో లేవు. దానికి ఓ బలమైన కారణం ఉంది.

కొత్త సినిమాలను ఒప్పుకునే క్రమంలో ఓ కండీషన్ పెడుతోందట శ్రీలీల. అదేంటంటే? సినిమాలో సోలో హీరోయిన్ అయితేనే ఆ ప్రాజెక్ట్ కు ఒకే చెబుతోందట. లేకుంటే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా రిజెక్ట్ చేస్తోందట. తాజాగా కార్తీ సర్దార్ 2లో నటించనని సున్నితంగా చెప్పేసిందట ఈ బ్యూటీ. దీంతో పాటుగా ఓ బాలీవుడ్ మూవీని కూడా రిజెక్ట్ చేసిందని టాక్. సోలో హీరోయిన్ అయితేనే చేస్తానని మేకర్స్ కు సరికొత్త కండీషన్ పెట్టిందట ఈ చిన్నది. అందుకే ఈ బ్యూటీ చేతుల్లో మునపటిలా సినిమాలు ఉండటం లేదు. మరి ఈ కండీషన్ తో ఇండస్ట్రీలో ఎలా నెట్టుకొస్తుందా? అని అభిమానులు, సినీ పండితులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి శ్రీలీల కండీషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Puri Temple Treasury : రత్న భాండాగారాల్లో అమూల్య సంపద.. స్వర్ణ సింహాసనాలు, వడ్డాణాలు, పసిడి విగ్రహాలు లభ్యం

Puri Temple Treasury రహస్య గది నుంచి పూరీ జగన్నాథుడి అంతు లేని సంపదను వెలికి తీశారు. అయితే రత్న భాండాగారంలోని మిస్టరీ పూర్తిగా వీడలేదు. దానిని ఛేదించడానికి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీనే నమ్ముకున్నారు ఆలయ అధికారులు. ఇంతకీ రత్న భాండాగారంలో రహస్య సొరంగాలు దాగున్నాయా? ఏ టెక్నాలజీ సాయంతో వాటి గుట్టు రట్టు చేయబోతున్నారా..

Puri Temple Treasury

పూరీ జగన్నాథుని ఆలయంలో అంతుచిక్కని సంపద ఉందని అక్కడి ప్రజలు ఆనోటా ఈనోటా చెప్పుకోవడమే కాదు.. చరిత్రకారులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అధికారులు సైతం అది పుకార్లు కాదు.. నిజమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం రహస్య గది తెరిచిన తరువాత.. అక్కడ సంపద ఉందన్నది నిజమని తేలిపోయింది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే… ఆ రత్నభాండాగారంలో వెలకట్టలేని పురాతన విగ్రహాలు దొరికాయని అధికారులే స్వయంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

Puri Temple Treasury రత్న భాండాగారం రహస్యగదిలో 34 కిరీటాలు, రత్నఖచిత స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డాణాలు, దేవతల పసిడి విగ్రహాలు ఉన్నట్టు చెబుతున్నారు. గతంలో రత్నభాండాగారంలోని ఆభరణాలను లెక్కపెట్టినప్పుడు.. కొన్నింటిని జాబితాలో పొందుపరచలేదు. అలా జాబితాలో లేని 7 విగ్రహాలు దొరికాయని చెబుతున్నారు. కాకపోతే, 46 ఏళ్లుగా లోపలే ఉండడంతో కాస్త నల్లగా మారాయని చెబుతున్నారు. రెండోసారి రత్న భాండాగారాన్ని తెరిచినప్పుడు ఈ అమూల్య సంపద గురించి బయటి ప్రపంచానికి తెలిసింది.

అయితే ప్రపంచానికి తెలియాల్సిన విషయం ఇంకొకటుంది. శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు, సొరంగ మార్గాలు చాలా ఉన్నాయని దేవాలయ చరిత్ర చెబుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. రహస్య గది తెరిచినప్పుడు పూరీ జగన్నాథ ఆలయంలోని సొరంగ మార్గాలపై స్పష్టత రాలేదని పూరీ రాజు గజపతి మహారాజ్ కూడా తెలిపారు. అయితే రహస్య గదిలోనే వెల కట్టలేనంత సంపద ఉంది. ఇక వందల ఏళ్ల నుంచి మహారాజులు, చక్రవర్తులు స్వామికి సమర్పించిన నవరత్న ఖచిత ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు…వీటన్నింటిని రహస్య నేల మాళిగల్లో, సొరంగాల్లో భద్రపరిచారని చరిత్ర చెబుతోంది. రహస్య గది కింద మరో రహస్య గది, సొరంగాలు, చాలా పెద్ద అండర్‌ గ్రౌండ్ నెట్‌వర్క్‌ ఉందని స్థానికులు బలంగా నమ్ముతారు. ఆ గదిలో అత్యంత విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. 1902లో బ్రిటిషర్లు ఈ సొరంగ మార్గాన్ని కనిపెట్టాలని చూసినా.. వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదంటున్నారు.

Puri Temple Treasury లో ఉన్న రహస్య గదులు, సొరంగాల మిస్టరీని ఛేదించడానికి ఒడిశా సర్కార్‌ నియమించిన బిశ్వనాథ్‌ రథ్‌ కమిటీ నడుం బిగించింది. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ఉపయోగించి రహస్య గదిని స్కానింగ్‌ చేయాలని కమిటీ ప్రతిపాదించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రహస్య గదిని సమగ్రంగా స్కాన్‌ చేస్తే, దాని కింద దాగి ఉన్న రహస్య సొరంగాలు బయటపడతాయని కమిటీ భావిస్తోంది. ఒకవేళ రత్న భాండాగారంలో ఇంకా రహస్య సొరంగాలు, గదులు ఉంటే బయటపడతాయని, లేకపోతే ప్రజల్లో ఉన్న అపోహలు, ప్రచారాలు, అనుమానాలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందని కమిటీ అనుకుంటోంది. దీంతో పాటు రత్న భాండాగారానికి మరమ్మతులు చేసేందుకు కూడా ఈ స్కానింగ్‌ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

అయితే రత్న భాండాగారం కింద రహస్య గదులు, సొరంగాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సాయంతో చేసే స్కానింగ్‌తో రహస్య గది రహస్యాలు త్వరలోనే బయటపడే అవకాశం ఉంది. అలా బయటపడితే ఆలయ మేనేజింగ్‌ కమిటీ, ఒడిశా సర్కార్‌..మరిన్ని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Love Story India Pakistan : భర్త కోసం సరిహద్దులు దాటి వచ్చిన పాకిస్థాన్ యువతి

0

Love Story India Pakistan ఖండాంతర, దేశాంతర ప్రేమ కథలు కొత్తేమీ కాదు. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ స్పర్ధలు ఉన్నప్పటికీ… ఇరు దేశాలకు చెందిన యువతీయువకుల మధ్య ప్రేమ వ్యవహారాలు ఎప్పటి నుంచో ఉన్నాయి.

Love Story India Pakistan

తాజాగా, పాకిస్థాన్ కు చెందిన ఓ యువతి భారత్ లో ఉన్న తన ప్రియుడి కోసం సరిహద్దులు దాటి వచ్చేసింది. ఆమె పేరు మెహ్విష్ (25). పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ కు చెందిన మెహ్విష్ కు గతంలోనే పెళ్లి జరగ్గా, 2018లో భర్త నుంచి విడిపోయింది. అప్పటికే ఆమెకు 12, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు.

భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కువైట్ లో రవాణా రంగంలో పనిచేస్తున్న రెహ్మాన్ అనే యువకుడితో ఆమెకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. రెహ్మాన్ స్వస్థలం రాజస్థాన్ లోని బికనీర్. ఇద్దరూ తరచుగా చాటింగ్ చేసుకునేవారు. దాంతో ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

దాంతో పెళ్లి చేసుకోవాలని 2022లో నిర్ణయించుకున్నారు. మొదట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. మెహ్విష్ 2023లో మక్కా యాత్రకు రాగా… రెహ్మాన్ కూడా మక్కా వచ్చి ఆమెను శాస్త్ర ప్రకారం పెళ్లాడాడు. ఆ తర్వాత మెహ్విష్ పాకిస్థాన్ వెళ్లిపోయింది.

ఇటీవలే ఆమె ఇస్లామాబాద్ నుంచి లాహోర్ వెళ్లి… అక్కడ్నించి వాఘా సరిహద్దుల ద్వారా భారత్ లో ప్రవేశించింది. 45 రోజుల టూరిస్ట్ వీసాపై భారత్ వచ్చిన ఆమెకు రాజస్థాన్ లోని పిథిసార్ గ్రామంలో అత్తవారింట సాదర స్వాగతం లభించింది. సుదీర్ఘ విరామం తర్వాత భర్తను కలుసుకున్న మెహ్విష్ సంతోషం వ్యక్తం చేసింది.

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Horror OTT Movie అతని పేరు తల్చుకుంటే చంపేస్తాడు.. OTTలో వణికించే హారర్ మూవీ!

Horror OTT Movie చూసే అలవాటు ఉందా? మీరు ఎంత భయపెట్టే చిత్రాలు చూస్తారు? హారర్ సినిమాలు చూడటంలో మీరు పీహెచ్ డీ చేసినా కూడా.. మీరు ఈ మూవీ చూడటానికి కాస్త ఆలోచించాలి. ఎందుకంటే ఇందులో ఉండే హారర్ ఎలిమెంట్స్ అలా ఉంటాయి. అదేదో పాత దెయ్యాల కథలు చెప్తున్నట్లుగా సినిమా స్టార్ట్ చేసి.. మోడ్రన్ దెయ్యాలతో వణికించేస్తారు. ఇది ఒక సూపర్ న్యాచురల్ హారర్ మూవీ. చిన్న పిల్లలను ఎత్తుకేళ్లే ఒక బూచోడి గురించి ఈ సినిమాలో కథ ఉంటుంది. అయితే ఆ తర్వాత అది పెద్దోళ్లను ఎత్తుకెళ్లే దెయ్యంలా మారిపోతుంది. మీరు ఈ మూవీని చూడాలి అంటే కాస్త హై వైలెన్స్ కి సిద్ధపడి చూడాల్సి ఉంటుంది.

Horror OTT Movie

ఓటీటీలో హారర్ సినిమాలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిందో లేదో.. చూసేస్తున్నారు. అందుకే ఓటీటీలో కొత్త హారర్ చిత్రాలు దొరకడం లేదు. అలాంటి వారికోసం ఒక క్రేజీ హారర్ మూవీ తీసుకొచ్చాం. ఇది హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక బెస్ట్ హారర్ మూవీ. ఇందులో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి. నిజానికి ఒక సూపర్ హీరో సినిమాలా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత తెలుస్తుంది ఇది ఒక వణికించే చిత్రం అని. ఇందులో ఒక వింటేజ్ బూచోడి గురించి కథలు చెప్తూ ఉంటారు. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి పిల్లలకు చాక్లెట్లు ఇస్తూ ఉంటాడు. అందరూ అతడిని మంచోడు అనుకుంటారు. కానీ, పోలీసులు వచ్చి అతడిని అరెస్టు చేసి కాల్చేస్తే గానీ తెలియలేదు అతను పిల్లలను చంపుతున్నాడు అని. అతనికి క్యాండీ మ్యాన్ అని పేరు పెడతారు.

Horror OTT Movie అయితే ఆ తర్వాత అతను ఒక దెయ్యంగా మారాడు అంటారు. ఎవరైతే అద్దంలో చూస్తూ.. అతని పేరును ఐదుసార్లు పలుకుతారో.. వాళ్లకి అతను కనిపిస్తాడు అంటారు. అలాగే కేవలం కనిపించడమే కాదు.. తాను గతంలో ఏం చేశాడో అదే చేస్తాడు. అదే హత్యలు చేయడం. ఆ కథలు విన్న కొందరు దానిని ప్రయత్నించాలి అనుకుంటారు. అద్దంలో చూస్తూ ఏకంగా ఐదుగురు ఒకేసారి క్యాండీ మ్యాన్ అంటూ పిలుస్తారు. అతను రావడమే కాదు.. విచక్షణారహితంగా అందరినీ చంపేస్తాడు. అలాగే మరో యువకుడు కూడా ఇదే పని చేస్తాడు. అతను జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? అసలు ఆ క్యాండీ మ్యాన్ ఎందుకు అలా చేస్తున్నాడు? ఇలాంటివి తెలియాలి అంటే మీరు ఈ ‘క్యాండీ మ్యాన్’ అనే మూవీ చూడాల్సిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. కానీ, ఇండియాలో చూడటం కుదరదు. అయితే మీరు ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో ఫ్రీగా ఈ మూవీ చూడచ్చు. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Top OTT movies ఈ వారం OTT లో అందరి చూపు ఆ 4 సినిమాల మీదే.. అవేంటంటే!

Top OTT movies ప్రతి వారం చాలానే సినిమాలు ఓటీటీ లోకి వస్తున్నా కూడా.. వాటిలో చూడదగిన సినిమాలు మాత్రం కేవలం కొన్నే ఉంటాయి. పైగా ఆ సినిమాలే ఓటీటీ లో బెస్ట్ గా నిలుస్తాయి. అలా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు , సిరీస్ లు ఓటీటీ లో రాగా… వాటిలో ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు మాత్రం కొన్నే. పైగా థియేటర్ లో హిట్ కానీ సినిమాలు సైతం ఓటీటీ లోకి వచ్చిన తర్వాత మాత్రం పాజిటివ్ టాక్ తో ట్రేండింగ్ తో దూసుకుపోతున్నాయి. ఆల్రెడీ గత వారం రిలీజ్ అయినా సినిమాలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాలలో చూడదగిన సినిమాలేంటో .. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయనే విషయాలను చూసేద్దాం.

Top OTT movies బృందా వెబ్ సిరీస్

వెబ్ సిరీస్ లను ఇప్పుడు అందరు ఎంతో బాగా ఆదరించడంతో.. కనీసం వారంలో ఒక కొత్త వెబ్ సిరీస్ నైనా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. పైగా తెలుగు కంటెంట్ కు ఆదరణ బాగా పెరగడంతో.. వరుసగా ఈ మధ్య కాలంలో ఎక్కువ తెలుగు సిరీస్ లే రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు త్రిష నటించిన “బృందా” వెబ్ సిరీస్.. ఆగష్టు 2 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. అది కూడా తెలుగులో. కాబట్టి ఎంచక్కా ఈ సిరీస్ వీకెండ్ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసేసుకోండి.

మాడర్న్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి

this week ott special movies

దర్శక ధీరుడు రాజమౌళి పై డాక్యుమెంటరీ అంటే.. మాటలు కాదు. దీని గురించి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా .. ఇది ఎలా ఉంటుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ డాక్యుమెంటరీ కూడా ఆగష్టు 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. దీనిలో రాజమౌళి పై కొంతమంది టాలీవుడ్ , బాలీవుడ్ స్టార్స్ చెప్పే అభిప్రాయాలను కూడా చూడొచ్చు. కాబట్టి ఈ వారం ఈ డాక్యుమెంటరీ ని అసలు మిస్ చేయకుండా చూసేయండి.

డ్యూన్: పార్ట్ 2

this week ott special movies

హాలీవుడ్ మూవీ డ్యూన్ కు విశేష ఆదరణ లభించడంతో.. దానికి కంటిన్యుషన్ గా తెరకెక్కించిన సినిమా డ్యూన్ పార్ట్ 2. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా కాలమే అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. ఈ సినిమా ఆగష్టు 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.

కింగ్‌‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్

this week ott special movies

ఈ సినిమా 2024లో విడుదల అయింది. ఈ సినిమాకు.. వెస్ బాల్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ.. వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అనే సినిమాకు సిక్వెల్. కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమా ఆగష్టు 2 నుంచి తెలుగు, హిందీ , ఇంగ్లీష్ , తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది.

ప్రస్తుతానికైతే ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో అస్సలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలు ఇవే. ఇవి కాకుండా వీకెండ్ లోపు ఇంకా కొత్త సినిమాలు వచ్చే అవకాశలు లేకపోలేదు.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


August Horoscope ఈ 5 ఐదు రాశుల వారికి రాజయోగం! కారణమిదే!

August Horoscope హిందూశాస్త్రం, పురాణల ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు, రాశులకు సంబంధించి అనేక మార్పులు జరుగుతుంటాయి. గ్రహాలు కక్ష్యలు మారడం, వివిధ రాశుల్లోకి ప్రవేశించడం వంటివి జరుగుతుంటాయి. ఇలా గ్రహాలు, చంద్రుడు, సూర్యుడు వాటివాటి కక్ష్యలో మార్పులు జరిగినప్పుడు ఆయా రాశుల వారికి మంచిచెడులు జరుగుతుంటాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. ఈ క్రమంలో జూలై 31న ఒక ఘటన జరగనుంది. శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ క్రమంలోనే ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి..ఈ విషయం గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…

August Horoscope

August Horoscope గ్రహాలకు రాజకుమారుడని బుధుడని అంటారు జ్యోతిష్యనిపుణులు. అలాంటి బుధుడు జూలై 16వ తేదీన సింహరాశిలోకి ప్రవేశించాడు. అదే రాశిలో ఆగష్టు 22వరకు సంచరిస్తాడు. ఇదే సమయంలో జూలై 31న శుక్రుడు తన దిశను మార్చుకుని బుధుడు ఉన్న సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల పాటు శుక్రుడు, బుధుడు సింహరాశిలోనే సంచరిస్తుంటారు. సింహం రాశిలో బుధుడు, శుక్రుడి కలయిక వల్ల  కొన్ని రాశుల వారికి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  సింహరాశి లో శుక్రుడి సంచారం వలన మేషరాశి, మిథునరాశి, మకర రాశి, తులారాశి, మీనరాశి వారు పట్టిందల్లా బంగారమేనని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

మేష రాశి:

August Horoscope శుక్రుడు, బుధుడు సింహరాశిలో కలసి సంచరించడంతో మేషరాశి వారికి అన్నిరంగాల్లో విజయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో ఈ రాశివారు పట్టిన ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. వివాహితులు తమ కుటుంబాలతో కలిసి యాత్రలు వెళ్లే అవకాశం ఉంది. వాహనాలు, ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన ప్రణాళికలు పూర్తి చేసుకుంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారాల్లో మంచి ప్రగతి సాధిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి మంచి సమయం.

వృషభ రాశి:

August Horoscope సింహరాశిలో శుక్రడు, బుధుడి సంచారం వలన లాభ పడే మరోసారి వృషభ రాశి. ఈ రాశి వాళ్లు ఇంటిపై పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం పరంగా మరో మెట్టుపైకి ఎక్కనున్నారు. మధ్యలో ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో భారీగా ఖర్చయ్యే అవకాశం కూడా ఉంటుంది.

మిథున రాశి:

August Horoscope శుక్రుడు, బుధుడు సింహరాశిలో సంచరించడం వలన  మిథున రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి రంగంలో విజయం సాధించడంతో పాటు కుటుంబ, వైవాహిక జీవితంలో సంతోషం లభిస్తుంది. ఈ రాశివారికి ఆఫీసుల్లో పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు కొత్తగా ఇన్వెస్ట్ చేసే పెట్టే అవకాశం ఉంది.

 తులారాశి:

August Horoscope సింహరాశిలో శుక్రుడు సంచారం వలన ఈ రాశికి చెందిన వారిలోని వ్యాపారస్తులు రానున్న రోజుల్లో మంచి లాభాలను పొందే ఛాన్స్ ఉంది. దీర్ఘ కాలంగా ఉన్న రుణాలను చెల్లించగలుగుతారు. అదే విధంగా వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. మానసిక, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారికి పరిష్కారం లభిస్తుంది. వస్తు సంపదలో పెరుగుదల ఉంటుంది. ఈ రాశివారు కోరికలన్నీ ఒక దాని తర్వాత మరొకటి తీరుతాయి.

మకరరాశి:

August Horoscope బుధ, శుక్రులు సింహరాశిలో సంచరించడం వల్ల ఈరాశి వారి కుటుంబ సంబంధాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశముంది. విదేశాల్లో వెళ్లాలని అనుకునే వారి కలలు కూడా నెరవేరుతాయి. వ్యాపార రంగంలో ఉండే వారు..వారికి ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఈ రాశి వారి సంసార జీవితం చాలా బాగుంటుందని పండితులు చెబుతున్నారు.

మీన రాశి:

August Horoscope బుధ, శుక్రులు సింహరాశిలో సంచరించడం వల్ల మీనరాశి వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. కొన్నిరోజులుగా ఆరోగ్యం బాధపడే వారికి.. వారి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వారికి  అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆ అనుకూలత కారణంగా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ ప్రపోజల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆగిపోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంది. మొత్తంగా ప్రధానంపై ఐదు రాశులక వారికి పట్టిందల్ల బంగారమే కానుందని జోతిష్య నిపుణలు చెబుతున్నారు

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.