Home Blog Page 64

Best Saving Scheme for Women మహిళల కోసం కేంద్రం బెస్ట్ స్కీమ్! ఇలా చేస్తే ఏకంగా రూ.32 వేలు లాభం!

0

Best Saving Scheme for Women కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజలు అర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఎప్పటికప్పుడు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంటుంది. ముఖ్యంగా ఈ పథకాల్లో పేద ప్రజల దగ్గర నుంచి చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగస్తులు, రైతులు ఇలా అన్ని వర్గాలకు చెందినవారి కోసం ప్రత్యేకంగా ఎన్నో స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశంలోని ఆడ పిల్లలు , మహిళలు ఆర్థిక భద్రత మేరకు మరో కొత్త పథకంను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపోతే ఈ పథకం పోస్టాఫీసులతో పాటు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, అర్హత కలిగిన ప్రైవేట్ రంగ బ్యాంకులలో అమలు చేస్తుంది. ఇంతకీ ఆ పథకం వివరాలేంటో తెలుసుకుందాం.

Best Saving Scheme for Women

దేశంలోని ఆడ పిల్లలు, మహిళల ఆర్థిక భద్రత కొరకు కేంద్ర ప్రభుత్వం ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‘ అనే పథకంను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ పథకం పై  కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ జూన్ 27, 2023న ఈ-గెజిట్ జారీ చేసింది.  ఇక ఈ పథకాన్ని పోస్టాఫీసుతో పాటు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, అర్హత కలిగిన ప్రైవేట్ రంగ బ్యాంకులలో అమలు చేస్తుంది. అలాగే ఈ పథకం పోస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులో ఉంది. కాగా, ఇది మార్చి 31, 2025 వరకు రెండేళ్ల కాలానికి సేవింగ్స్ సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుంది.

Best Saving Scheme for Women అయితే బాలికలు, మహిళలకు  సురక్షితమైన పెట్టుబడి పథకంగా ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తుంది. ఇకపోతే ఈ పథకం మార్చి 31, 2025న లేదా అంతకంటే రెండు సంవత్సరాల పరిమితితో ఖాతాను తెరవచ్చు. కాగా, ఈ పథకంలో పెట్టుబడికి సంవత్సరానికి 7.5 శాతం చొప్పున వడ్డీ వస్తుంది.  అలాగే ప్రతి త్రైమాసికానికి కాంపాండ్ వడ్డీ లెక్కగడతారు. ఇందులో కనిష్టంగా రూ.1,000, గరిష్టంగా రూ.2,00,000 డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసిన నగదు మెచ్యూరిటీ ప్రారంభించిన తేదీ నుంచి రెండేళ్లు ఉంటుంది. అయితే అత్యవసర సమయంలో పాక్షికంగా నగదు విత్ డ్రాకు అవకాశం కల్పిస్తారు. ఇక స్కీమ్ ఖాతాలో అర్హతను బట్టి బ్యాలెన్స్‌లో గరిష్టంగా 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే రెండేళ్ల తర్వాత రూ.32044 వడ్డీ అందుకోవచ్చు.

ఎమ్ఎస్ఎస్ఎస్ స్కీమ్ అర్హతలు

  • ఈ స్కీమ్ దరఖాస్తుదారులు కచ్చితంగా భారతీయులై ఉండాలి.
  • ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు మాత్రమే ఈ స్కీమ్ కు అర్హులు.
  • అలాగే వ్యక్తిగత మహిళ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఇక మైనర్ ఖాతాను తండ్రి, సంరక్షుడు ద్వార తెరవవ్చు.
  • ఇక ఇందులో గరిష్ట వయోపరిమితి లేదు, అన్ని వయసుల మహిళలు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ(ఆఫ్‌లైన్)

  • ముందుగా దరఖాస్తుదారులు  సమీపంలోని పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్, షెడ్యూల్ బ్యాంకులో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఇక దరఖాస్తుదారులు ఈ ఫామ్ ను అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత దరఖాస్తు ఫామ్‌ను పూర్తి చేసి, అవసరమైన అన్ని పత్రాలను జత చేయాలి.
  • ఇక డిక్లరేషన్, నామినేషణ్ అనే వివరాలను కూడా అందించి ఎంత డిపాజిట చేస్తున్నారో ధరఖాస్తులో తెలియజేయాలి.
  • చివరిగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్’ పథకంలో మీరు పెట్టుబడి పెట్టినట్లు రుజువుగా సర్టిఫికేట్‌ను పొందాలి.

ఈ స్కీమ్ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు

  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  • బర్త్ సర్టిఫికేట్
  • ఆధార్ కార్డ్
  • పాన్ కార్డ్
  •  డిపాజిట్ మొత్తం, చెక్‌తో పాటు పే-ఇన్-స్లిప్
  •  గుర్తింపు, చిరునామా రుజువు పత్రాలు : పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీ, ప్రభుత్వ అధికారి సంతకంతో NREGA జాబ్ కార్డ్ కూడా ఉండాలి

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Cyber Crime వృద్ధులే టార్గెట్, అందమైన అమ్మాయిలతో వాట్సాప్ వీడియో కాల్స్.. రూట్ మార్చిన సైబర్ నేరగాళ్లు

0

Cyber Crime : సైబర్ నేరగాళ్లు తమ రూట్ మార్చారు. కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఈసారి సైబర్ క్రిమినల్స్ కన్ను వృద్ధులపై పడింది. అమ్మాయిలతో వాట్సాప్ వీడియో కాల్స్ చేయిస్తారు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తారు. బాధితుల నుంచి లక్షలు దండుకుంటున్నారు. కొత్త తరహా సైబర్ మోసాల గురించి కృష్ణా జిల్లా పెనమలూరు సీఐ రామారావు వివరాలు వెల్లడించారు.

Cyber Crime

రాజస్థాన్, మహారాష్ట్రలకు చెందిన సైబర్ నేరగాళ్లు వృద్ధులను టార్గెట్ చేసుకుని లక్షలు దండుకుంటున్నారని ఆయన తెలిపారు. తొలుత వాట్సప్ వీడియో కాల్ చేస్తారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ కాల్ ఎత్తిన వెంటనే అమ్మాయిలు కనిపిస్తారు. వారు నగ్నంగా ఉంటారు. వారి ఒంటి మీద నూలుపోగు కూడా ఉండదు. అమ్మాయిలు మూడు, నాలుగు నిమిషాలు వృద్ధులతో చాటింగ్ చేస్తారు. సీన్ కట్ చేస్తే వాట్సాప్ కు ఆ వీడియోని పంపిస్తారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది.

Cyber Crime మేము పోలీసులం అంటూ వృద్ధులకు ఫోన్ కాల్స్ వస్తాయి. వీడియో చూపి బ్లాక్ మెయిల్ చేస్తారు. 10 లక్షలు నుండి 20 లక్షల వరకు డిమాండ్ చేస్తారు సైబర్ నేరగాళ్లు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోని సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తారు. వారి మాటలకు భయపడి బాధితులు అడిగినంత డబ్బు ఇచ్చుకుంటున్నారు. కాగా, రిటైర్ అయిన ఉద్యోగులని సైబర్ గ్యాంగ్ టార్గెట్ చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం గురించి బయటికి చెప్పుకుంటే పరువు పోతుందనే భయంతో డబ్బు పోగొట్టుకున్నా బాధితులు మిన్నకుండిపోతున్నారు.

కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తరహా ఘటనలు వెలుగు చూసినట్లు పోలీసులు వెల్లడించారు. మాకు వచ్చి చెబుతున్నారు కాని ఫిర్యాదు మాత్రం చేయడం లేదని పోలీసులు తెలిపారు. బాధితులు తమకు ఫిర్యాదు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ సీఐ రామరావు పేర్కొన్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Amazon Order Fails : రూ. 55,000 మొబైల్ ఫోన్ ఆర్డర్.. పార్సిల్ తెరిచి చూస్తే షాక్..

Amazon Order Fails ఆన్‌లైన్‌లో బ్రాండ్ న్యూ మొబైల్ ఆర్డర్ చేస్తే, అరడజన్ టీ కప్పుల్ని డెలివరీ చేశారంటూ ఆరోపిస్తూ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) అండర్‌టేకింగ్‌లో డిప్యూటీ ఇంజనీర్ అయిన అమర్ చవాన్, అమెజాన్‌లో రూ. 54,999 విలువైన టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ మొబైల్ ఫోన్‌ని ఆర్డర్ చేసినట్లు పోలీసులకు చెప్పాడు. ఇందుకోసం జూలై 13న ఆన్‌లైన్‌లో డబ్బులు పూర్తిగా చెల్లించినట్లు పేర్కొన్నాడు.

Amazon Order Fails

రెండు రోజుల తర్వాత పార్సిల్ వచ్చిందని, దాన్ని ఓపెన్ చేసి చూడగా ఆరు టీ కప్పులు కనిపించడంతో షాక్‌కి గురైనట్లు ఫిర్యాదులో తెలిపాడు. ఈ విషయంపై తాను అమెజాన్‌ని సంప్రదించానని, అయితే వారి నుంచి సంతృప్తికర సమాధానం రాలేదని వెల్లడించారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అమెజాన్‌ అధికారులపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని మాహిమ్ పోలీస్ అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటపై ఇప్పటి వరకు అమెజాన్ నుంచి ఎలాంటి వ్యాఖ్యల రాలేదు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Sunflower Seeds : పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే.. పుట్టెడు లాభాలు

0

Sunflower Seeds పొద్దుతిరుగుదు విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది చెడు కొవ్వును కరిగించి గుండెకు మేలు చేకూర్చుతుంది. విటమిన్‌ ఈ అనేది ఒక పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్‌. ఇది ఫ్రీ రాడికల్స్‌ నుంచి కణాలు పాడుకాకుండా చూస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూస్తుంది.

Sunflower Seeds

రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడంలో సన్‌ఫ్లవర్‌ విత్తనాలు చక్కగా పని చేస్తాయి. ఇందులోని సెలీనియం రోగనిరోధకశక్తిని పెంచుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు దరి చేరవు. చర్మ ఆరోగ్యం
సన్‌ఫ్లవర్‌ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సన్‌ఫ్లవర్‌ విత్తనాలు లోపలి నుంచి మాయిశ్చరైజింగ్‌ను అందిస్తాయి.

సన్‌ఫ్లవర్‌ విత్తనాల్లో ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణం వేగంగా అవుతుంది. మలబద్ధకం సమస్య దరి చేరకుండా ఉంటుంది. డయాబెటిస్‌ కంట్రోల్‌డయాబెటిస్‌ కంట్రోల్‌ చేస్తుంది. సన్‌ఫ్లవర్‌ విత్తనాలను తీసుకోవడంతో రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంటాయి. ఫైబర్‌ అధికంగా ఉండటంతో మధుమేహం సమస్య రాదు.

Sunflower Seeds మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చుతుంది. సన్‌ఫ్లవర్‌ విత్తనాలు తింటే ఎముకల బలహీనత వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటుంది. పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే విటమిన్ బి6… మానసిక స్థితి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

Sunflower Seeds విత్తనాలలో నియాసిన్, విటమిన్ ఇ, బి 1, బి 6, ఇనుము, రాగి, మాంగనీస్, జింక్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలో కనిపించే బీటా-సిటోస్టెరాస్, బలమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రొమ్ము క్యాన్సర్ తో సహా వివిధ క్యాన్సర్లను రాకుండా నిరోధిస్తాయి.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Horror Love Story OTT లో భయపెట్టే లవ్ స్టోరీ.. ఇక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే వణికిపోతారు!

Horror Love Story OTT ఓటీటీలో ఒక మంచి ప్రేమకథ చూడాలి అనుకుంటే మాత్రం ఈ మూవీని చూడకండి. ఒక ఇంట్రెస్టింగ్.. ఇన్టెన్స్ ప్రేమకథని చూడాలి అనుకుంటే మాత్రం దీనిని చూడండి. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రేమ ముసుగులో ఒక భయంకరమైన ప్రియుడిని కూడా పరిచయం చేస్తుంది. మొదట్లో ఈ సినిమా అందమైన కావ్యంగా ఉంటుంది. చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయితే కాసేపటికే మీ అభిప్రాయం మారిపోతుంది. ఒక భయానక ప్రేమకథను చూస్తున్నాం అనే విషయం చాలా త్వరగానే అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ మిమ్మల్ని కాస్త కంగారు పెడుతుంది. మరి.. ఆ మూవీ కథ ఏంటో చూద్దాం.

Horror Love Story OTT

ఈ మూవీలో ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఒక అమ్మాయిని ఇష్ట పడతాడు. ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెకు తెలియకుండానే అన్ని వివరాలు సేకరిస్తాడు. సాధారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలోకి వెళ్తే ఎవరు ఏంటి అనేది ఇట్టే చెప్పేయచ్చు. అతను కూడా ఆమె సోషల్ ప్లాట్ ఫామ్స్ లోనే ఎక్కువ సమాచారం, పొటోలు సేకరిస్తాడు. ఆ తర్వాత నేరుగా ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఆమె ఎక్కడకు వెళ్తే అక్కడకు వెళ్తాడు. అలాగే ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఆమె అలవాట్లు, అభిరుచులు, ఆలోచన విధానం తెలుసు కాబట్టి.. ఇట్టే ఆమెను ముగ్గులోకి దించుతాడు.

Horror Love Story OTT

అతను ఒక మంచి వ్యక్తిగా ఆమె దగ్గరకు చేరతాడు. ఆ తర్వాత వాళ్లు ఇద్దరూ ప్రేమలో పడతారు. కలిసి తిరగడం, మాట్లాడుకోవడం.. దాదాపుగా ప్రేమలో పడిపోతారు. చట్టాపట్టాలేసుకు తిరుగుతూ ఉంటారు. అయితే ఆమె కేవలం అతనికి మాత్రమే సొంతం అనే ధోరణిలో అతని ప్రవర్తన ఉంటుంది. ఆమె ఎవరితో మాట్లాడుతోంది? ఎవరిని కలుస్తోంది? ఇలాంటి వాకబు చేస్తుంటాడు. ఆమె తన ఫ్రెండ్స్ తో మాట్లాడినా కూడా అది చాలా పెద్ద తప్పు అన్నట్లు ప్రవర్తిస్తాడు. కొన్నాళ్లకు ఆమెకు కూడా అతని ప్రవర్తనపై అనుమానం వస్తుంది. తీరా చూస్తే అతను ఒక మెంటల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు అని తెలుస్తుంది. అతను ఆమె ఫ్రెండ్స్ ని చంపడానికి కూడా వెనకాడడు. ఇలా ఈ ప్రేమకథ కాస్త కంగారు పెట్టించే విధంగానే ఉంటుంది. అక్కడక్కడ కాస్త బో*ల్డ్ సీన్స్ కూడా ఉంటాయి. ఈ సిరీస్ పేరు “YOU”. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఉంది. ఈ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Dreams are in Live OTT కలలో జరిగింది కళ్ళ ముందు కనిపిస్తే.. OTTలో ఇదో వెరైటీ సస్పెన్స్ థ్రిల్లర్

Dreams are in Live OTT కలలు అందరికి వస్తూ ఉంటాయి. కానీ అవి నిజమవుతాయా లేదా అనేది అప్పుడప్పుడు అందరికి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఈ సినిమా చూస్తే ఇలా కూడా జరుగుతుందా అని అనుకుంటూ ఉంటారు. ఇదొక కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటూ ఉంటాయి, ఈ సినిమాలో అయితే హీరోకు వచ్చే కలలు నిజం అవ్వడమే కాకుండా.. అతను దానిని ఉపయోగించుకుని.. ఓ కేసును కూడా సాల్వ్ చేస్తాడు. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చెక్ చేసేయండి.

Dreams are in Live OTT

Dreams are in Live OTT ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓపెన్ చేస్తే మూవీలో హీరో శంకర్ కు కలలో ఏది కనిపిస్తే అది జరుగుతుంది. ఈ క్రమంలో ఓ రోజు వాళ్ళ అమ్మ చనిపోతుంది. అతనికి పోలీస్ అవ్వాలనే డ్రీం బాగా ఉంటుంది. అందుకని దాని కోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు. అంత చదువు చదువుకుని ఖాళీగా ఉన్నాడని.. తన తండ్రి అతనిపై కోప్పడి మాట్లాడడం మానేస్తాడు. దీనితో కొద్దీ రోజులకు హీరో తన తండ్రి కోసం జాబ్ లో జాయిన్ అవుతాడు. మరో వైపు తన తండ్రి కొడుకు పోలీస్ జాబ్ కోసం డబ్బులు అరేంజ్ చేసే పనిలో ఉంటాడు. ఈలోపు హీరోకు కలలో తన తండ్రికి యాక్సిండెంట్ అయినట్లు కథ వస్తుంది. తన కలలు నిజం అవుతాయి కాబట్టి.. తన కంగారుగా తన ఫాదర్ కు కాల్ చేస్తాడు.. తానూ అనుకున్నట్లుగానే ఆ యాక్సిడెంట్ జరుగుతుంది. దీనితో శంకర్ పోలీస్ లకు కంప్లైంట్ చేస్తాడు. ఓ వైపు ఈ కేసులో విచారణ కొనసాగుతూనే ఉంటుంది.

Dreams are in Live OTT మరో వైపు శంకర్ వాళ్ళ నాన్న కోమాలోకి వెళ్ళిపోతాడు. అతను బ్రతకాలంటే చాలా డబ్బు ఖర్చవుతుందని చెప్తారు. దీనితో శంకర్ అప్పటినుంచి ఓ వైపు వాళ్ళ నాన్నకు యాక్సిడెంట్ చేసిన వాళ్ళను వెతుకుతూనే.. మరోవైపు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరో వైపు వాళ్ళ నాన్న ఉన్న హాస్పిటల్ లో వార్డ్ బాయ్ గా పని చేసే.. అతనికి ఎవరో డబ్బులు వేసి.. అతనిని చంపేయమని చెప్తారు. ఇక శంకర్ పడుకున్నప్పుడు పదే పదే ఆ యాక్సిడెంట్ గురించే వస్తూ ఉంటుంది. ఆ కలలో ఆ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరో చూసేలోపు ఎవరో ఒకరు అతనిని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. అసలు వాళ్ళ నాన్న ను చంపింది ఎవరు ? అతనికి కలలో కనిపించినవి ఎందుకు నిజమౌతూ ఉంటాయి ? అసలు చివరకు ఏమై ఉంటుంది ? ఆ వార్డ్ బాయ్ కు డబ్బులు ఇచ్చింది ఎవరు ? ఇవన్నీ తెలియాలంటే “కార్బన్ ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Telangana High Court : అతడికి మరణశిక్షే సరైనది… తెలంగాణ హైకోర్టు తీర్పు

0

  • 2017లో హైదరాబాద్ లో చిన్నారిపై హత్యాచారం
  • ఓ సెంట్రింగ్ కూలీ ఘాతుకం
  • మరణశిక్ష విధించిన సెషన్స్ కోర్టు
  • తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసిన వైనం
  • పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు

Telangana High Court : అతడికి మరణశిక్షే సరైనది… తెలంగాణ హైకోర్టు తీర్పు హైదరాబాదులోని నార్సింగిలో ఐదేళ్ల పాపపై అత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తికి మరణశిక్షే సరైనదని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు దోషికి కింది కోర్టు విధించిన మరణశిక్షను తెలంగాణ హైకోర్టు సమర్థించింది.

Telangana High Court

2017లో మధ్యప్రదేశ్ కు చెందిన దినేశ్ కుమార్ ధర్నే అనే వలస కూలీ హైదరాబాదులో ఒక చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు. చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి ఆ చిన్నారిని కిడ్నాప్ చేశాడు. పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన అనంతరం, ఆ విషయం తల్లిదండ్రులకు చెబుతుందేమోనని భయపడి ఆ పాపను హత్య చేశాడు. ఆ పాప తల్లిదండ్రులు బీహార్ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చారు.

ఈ కేసు విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు దినేశ్ కుమార్ కు 2021లో ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును దినేశ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశాడు. అయితే తెలంగాణ హైకోర్టు అతడి విజ్ఞప్తిని తోసిపుచ్చి, మరణశిక్షను ఖరారు చేసింది.

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Horror Movies in OTT దెయ్యాలు వాటి వింత కోరికలు ఎలా తీర్చుకుంటాయంటే! OTTలో రియల్ హర్రర్ స్టోరీ

Horror Movies in OTT దెయ్యాలు ఉన్నాయా… లేవా అనేది ఎప్పటికి అందరికి ఓ పెద్ద ప్రశ్న. అదంతా పక్కన పెట్టేస్తే.. దెయ్యాలపై ఇప్పటికే లెక్కలెన్నని సినిమాలు వచ్చాయి. అయినా కూడా ఇంకా చూడాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక ఏదైనా మూవీ సాధారణంగా దెయ్యాలు ఒకరిద్దరికి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఓ ఫ్యామిలీ మొత్తానికి ఆత్మలు కనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఎవరు ఊహించలేరు. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చెక్ చేసేయండి.

Horror Movies in OTT

ఈ సినిమా కథ విషయానికొస్తే.. లిసా అనే అమ్మాయి వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత కూడా.. ఆమెకు కనపడుతూ.. రోజు మాట్లాడుతూ ఉంటుంది. దీనితో లిసా ప్రతి రోజు భయపడుతూనే ఉంటుంది. కట్ చేస్తే లిసా వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడో అడవి చివర ఇల్లు కొనుక్కుని.. అక్కడ ఉంటారు. ఇక అక్కడకు వెళ్లిన లిసా వాళ్ళ అమ్మాయికి అక్కడ ఓ ముసలాయన దూరంగా కనిపిస్తాడు. ఇక అక్కడకు లిసా వాళ్ళ అక్క కూడా అక్కడికి వస్తుంది. కానీ అంత పెద్ద ఇల్లు ఉంచుకుని కూడా.. లిసా వాళ్ళ అక్క తానూ వచ్చిన వ్యాన్ లోనే ఉంటుంది. అది ఎందుకనేది ఎవరికీ తెలియదు. ఇక్కడ లిసా కు వాళ్ళ అమ్మ ఆత్మ ఎలా కనిపిస్తుందో.. లిసా కూతురుకి కూడా నాలుగు ఐదు ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. అయితే, లిసా వాళ్ళ సిస్టర్ వాళ్లకు ఆ పాపాకు.. మన ముగ్గురిలో ఓ అద్భుతమైన శక్తీ ఉంది. దాని వలనే మనకు ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్తుంది.

Horror Movies in OTT ఆ పాప కు మాత్రం లిసా వాళ్ళ సిస్టర్ చెప్పింది ఏమి అర్ధం కాదు. ఆ పాప కళ్ళు మూసుకుని కాన్సన్ట్రేట్ చేస్తే.. ఆ పాపకు చాలా ఆత్మలు కనిపిస్తాయి. ఆ ముసలి దెయ్యం మాత్రం పదే పదే వస్తూ ఉంటుంది. ఓ రోజు ఆ పాప ఆ అడవిలో తప్పిపోతోంది. దీనితో ఆమె కోసం అందరూ టెన్షన్ తో వెతుకుతూ ఉంటే. ఆ పాప మాత్రం తీరిగ్గా వచ్చి.. తనకు అక్కడ ఓ కొత్త ఫ్రెండ్ పరిచయం అయ్యాడని చెప్తుంది. కట్ చేస్తే లిసా దగ్గరకు ఓ కొత్త ఆత్మ వస్తుంది. కానీ లిసా ఏమో తన తల్లే మళ్ళీ వచ్చింది అనుకుని లైట్ తీసుకుంటుంది. అసలు లిసా దగ్గరకు వచ్చిన ఆ కొత్త ఆత్మ ఎవరిదీ ? లిసా వాళ్ళ పాపకు పదే పదే ఎందుకు ఆ ముసలాయన ఆత్మ కనిపిస్తుంది ? లిసా ఆ ఆత్మలు కనిపిస్తున్నాయని నమ్ముతుందా లేదా ? అసలు ఆ అడవిలో ఎందుకు అన్ని ఆత్మలు ఉన్నాయి? ఆ తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే .. “ది హాంటింగ్ ఇన్ కనెక్టికట్ ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా రెండు పార్ట్శ్ వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమ యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Happy Sleep Apps రాత్రుళ్ళు మనుషుల్ని త్వరగా నిద్రపుచ్చే యాప్‌లు! మీరు ట్రై చేయాల్సిందే!

Happy Sleep Apps చిన్న పిల్లల్ని నిద్రపోకపోతే పెద్దలు ఎత్తుకుని జోలపాట పాడి నిద్రపుచ్చేవారు. కానీ పాతిక, ముప్పై ఏళ్ల వయసున్న వారికి నిద్ర పట్టకపోతే ఎవరు నిద్రపుచ్చుతారు? అంటే దీనికి సమాధానంగా కొన్ని స్లీపింగ్ యాప్స్ ఉన్నాయి. రాత్రుళ్ళు మనుషుల్ని త్వరగా నిద్రలోకి జారుకునేలా చేసే యాప్స్ ఇవి. ఇవి ట్రై చేస్తే మీరు ఖచ్చితంగా త్వరగా నిద్రలోకి జారుకుంటారు. టెక్నాలజీ పెరిగిపోవడం, పని ఒత్తిడి, డ్యూటీ సమయాలు, ప్రయాణ భారాలు ఇలా అనేక కారణాల వల్ల మనిషి నుంచి నిద్ర అనేది దూరమైపోయింది. ఒకప్పుడు 9 దాటినాక మెలకువగా ఉంటే పెద్దలు తిట్టేవారు. ఇప్పుడు 12, ఒంటి గంట అయినా నిద్రపోవడం లేదు. కొంతమంది అయితే తెల్లవారుజామున రెండు, మూడు గంటల వరకూ కూడా నిద్రపోవడం లేదు. దీని వల్ల మరుసటి రోజు ఉదయం పని సరిగా చేయలేకపోతున్నారు. లక్ష్యాలను చేధించలేకపోతున్నారు. నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. దీన్ని ఇన్సోమ్నియా అంటారు. దీని వల్ల భవిష్యత్తులో చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Happy Sleep Apps

కాబట్టి నిద్ర త్వరగా పట్టని వారి కోసమే కొన్ని ప్రత్యేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా మందికి ఫోన్ చూసే అలవాటు ఉంటుంది కాబట్టి ఫోన్ లోనే కొన్ని యాప్స్ తో త్వరగా నిద్రలోకి జారుకోవచ్చు. 2024లో బెస్ట్ స్లీపింగ్ యాప్స్ ని నిపుణులు పరిశోధన చేసి మరీ రికమండ్ చేస్తున్నారు. వాటిలో కామ్, స్లీప్ సౌండ్స్, స్లీప్ స్కోర్, స్లంబర్, పిల్లో, బెడ్ టైం స్టోరీస్, స్లీప్ సైకిల్, స్లీప్ సౌండ్స్ బై స్లీప్ పిల్లో ఇలా అనేక రకాల యాప్స్ ఉన్నాయి. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్లి స్లీపింగ్ యాప్స్ అని కొడితే మీకు చాలా యాప్స్ కనబడతాయి. వాటిలో ఎక్కువ రేటింగ్ ఉన్న యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ లో మంచి మంచి కథలు వినచ్చు. ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినచ్చు. ప్రకృతి శబ్దాలు, సముద్ర కెరటాల శబ్దాలు, అడవి తల్లి శబ్దాలు, వీచే గాలి శబ్దాలు ఇలా మనకి నచ్చినవి ఎంపిక చేసుకోవచ్చు. కథలతో మిమ్మల్ని నిద్రపుచ్చడానికి ఆడ, మగ వారి వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్ వింటే నిమిషాల్లోనే నిద్రలోకి జారుకోవచ్చు.

Happy Sleep Apps అయితే మీ కోసం ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఆ యాప్స్ ని నెల నెలా డబ్బు చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుంది. కొన్ని ఉచిత యాప్స్ ఉంటాయి. కానీ అవి అంత ఫీల్ ని ఇవ్వవు. మూడు రోజులు, ఏడు రోజుల పాటు ఉచితంగా వాడుకునే యాప్స్ ఉంటాయి. వాడిన తర్వాత నచ్చితే కొనసాగించవచ్చు. ఇవి నిపుణులు సూచించిన యాప్స్. నెల నెలా ఈ యాప్స్ కొనడాలు, వాడడాలు మనవల్ల కాదేహే అని అనుకుంటే పుస్తకాలు చదవచ్చు. పుస్తకాలైనా చదివిందే ఎన్ని సార్లు చదువుతాం. వాటికైనా డబ్బులు అయిపోతాయి అని అనుకుంటే కనుక వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ వస్తువులు ఉన్నాయి. వాటిని ఒకసారి కొంటే చాలు. నిద్రపోవడానికి కళ్ళకు మాస్క్ ఉంటుంది. ఇది పెట్టుకుంటే లైటింగ్ అనేది ఉండదు. త్వరగా నిద్రలోకి జారుకోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. దీని అసలు ధర రూ. 499 కాగా ఆఫర్ లో రూ. 199కే అందుబాటులో ఉంది. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

లేదు పై యాప్స్ లానే మంచి మ్యూజిక్ ప్లే చేసే గాడ్జెట్ కావాలంటే కనుక పోర్టబుల్ వైట్ నాయిస్ ప్లేయర్ ఉంది. ఇందులో 20 రకాల సౌండ్స్ ఉంటాయి. ఇవి వింటే ఒత్తిడి పోయి మైండ్ రిలాక్స్ అయిపోతుంది. దీనికి ఆటో టైమర్ ఆఫ్ ఆప్షన్ ఉంది. అంటే 15 నిమిషాలు, 30 నిమిషాలు, గంట తరువాత దానికదే ఆగిపోయేలా సెట్ చేసుకోవచ్చు. చిన్న సైజులో ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా ఈజీగా పట్టుకెళ్లవచు. దీని అసలు ధర రూ. 1990 కాగా ఆఫర్ లో రూ. 1190కే అందుబాటులో ఉంది. దీన్ని నెల నెలా కొనే పని లేదు.. జస్ట్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 





Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Curry Leaves Benefits : కరివేపాకుని ఇలా తింటే కలిగే బెనిఫిట్స్‌ మీరు ఊహించలేరు..

0

Curry Leaves Benefits కరివేపాకు తినడం వల్ల ఆరోగ్యం, అందానికి కలిగే ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. కరివేపాకు తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది. ఇందులో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని ఆహారంలో తీసుకుంటే చాలా లాభాలున్నాయి. పచ్చి కరివేపాకుని నమిలితే చాలా లాభాలున్నాయి.

Curry Leaves Benefits

కరివేపాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎలుకల ఆరోగ్యానికి మంచివి. వీటిని తినడం వల్ల కీళ్ళనొప్పులు, షుగర్ ఉన్నవారిలో ఎముకలని నొప్పిని తగ్గించి ఎముకల్ని బలంగా మారుస్తుంది. కరివేపాకులో ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, దీనిని తీసుకోవడం వల్ల డీటాక్సీఫైయర్‌లా పనిచేస్తుంది.

Curry Leaves Benefits ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకుని తింటే మూత్రపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు పూర్తిగా తొలిగిపోతాయి. మూత్ర పిండాల పనితీరు మెరుగవుతుంది. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి కరివేపాకు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. కరివేపాకులో ప్రోటీన్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ఇమ్యూనిటీ బలంగా మారుతుంది. ఇన్ఫెక్షన్లను దరి చేరకుండా చేస్తుంది.

కరివేపాకు తింటే LDL అనే చెడు కొలెస్ట్రరాల్ తగ్గుతుంది. దీంతో రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోదు. చెడు కొలెస్ట్రాల్ తగ్గితే బీపి కూడా కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె సంబంధ సమస్యలు తగ్గి హార్ట్ హెల్త్ బాగుంటుంది. కరివేపాకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య దూరమవుతుంది.

Curry Leaves Benefits జుట్టు రాలడానికి కారణం కుదుళ్ళు ఆరోగ్యంగా లేకపోవడమే.. ఇందుకు ప్రోటీన్ లోపం, ఐరన్ లోపం. ఈ రెండు లోపాల కారణంగా జుట్టు రాలుతుంది. అయితే, కరివేపాకు తింటే ఈ సమస్యలు దూరమవుతాయి. కరివేపాకులో విటమిన్ బి12, విటమిన్ ఇ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.