Home Blog Page 394

ట్రెజరీ బిల్లుల చెల్లింపులకు బ్రేక్‌

    0

    చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 29: పలురకాల ట్రెజరీ బిల్లుల చెల్లింపులకు బ్రేక్‌పడింది. జీపీఎఫ్‌, పీఎఫ్‌, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ తదితర బిల్లులకు ట్రెజరీలో ఆమోదముద్ర పడుతున్నా, సీఎ్‌ఫఎంఎ్‌సలో చెల్లింపులు జరగడం లేదు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ అవసరాల నిమిత్తం జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(జీపీఎ్‌ఫ)ను డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ నగదు కోసం జిల్లాలో అనేక మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రెండునెలలుగా జీపీఎఫ్‌ చెల్లింపులు, అటు లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ బిల్లుల చెల్లింపులూ ఆగిపోయాయి. దీంతో అత్యవసర పనుల నిమిత్తం దాచుకున్న సొమ్మునూ ప్రభుత్వం విడుదల చేయక పోవడం శోచనీయమని ఉద్యోగులు వాపోతున్నారు.

    BREAK FOR TREASURY PAYMENTS

    డీఎస్సీ అభ్యర్థుల తరఫున పోరాటం చేస్తాం

      0
      • రిలే నిరాహార దీక్షలో  ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

      అలంకార్‌కూడలి(విజయవాడ), న్యూస్‌ టోన్ : డీఎస్సీ-2008 అభ్యర్థుల తరఫున పోరాటం కొనసాగిస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. నగరంలోని ధర్నాచౌక్‌లో ఏపీ బీఈడీ విద్యార్థుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘జగనన్న మీద అలక’ రిలే నిరాహార దీక్షలు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. ఎమ్మెల్సీ నరసింహారెడ్డి వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ-2008 విల్లింగ్‌ ఇచ్చిన 2193 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీకి దిక్కు లేకుండా పోయిందన్నారు. ఆర్థికశాఖ అనుమతి ఇచ్చినా ఎందుకు ఆలస్యమవుతుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉండి పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఏపీ బీఈడీ విద్యార్థులు అసోసియేషన్‌ కార్యదర్శి బి.ఎన్‌.సత్యనారాయణ, సభ్యులు శ్రీనివాసరావు, తిరుపతిరావు, అరుణ, తదితరులు పాల్గొన్నారు. 

      AGITATION FOR DSC 2008 WILLING CANDIDATES

      తెలుగు ,హిందీ ఎస్‌ఏల ఉద్యోగోన్నతులు రద్దు

        0

        ఒంగోలువిద్య, నవంబరు 29 : జిల్లాలో ఇటీవల నిర్వహించిన తెలుగు, హిందీ స్కూలు అసిస్టెంట్‌ ఉద్యోగోన్నతులను రద్దు చేస్తూ డీఈవో వీఎస్‌. సుబ్బారావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 21న నిర్వహిం చిన ఉద్యోగోన్నతుల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను పూర్తిగా పాటించలే దని పాఠశాల విద్యడైరెక్టర్‌ అభ్యంతరం తెలపడంతో వాటిని రద్దు చేశారు. డిగ్రీలో స్పెషల్‌ తెలుగు, థర్డ్‌ మెధడాలజీ ఉన్నవారు, సింగల్‌ సబ్జెక్టు ఉత్తీ ర్ణులైన వారికి కూడా ఉద్యోగోన్నతి ఇవ్వాల్సి ఉన్నా అవకాశం కల్పించలేదు. ప్రస్తుతం వారిని కూడా పరిగణలోకి తీసుకుని సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశారు. స్కూలు అసిస్టెంటు తెలుగు సబ్జెక్టుకు 81 మంది, హిందీ స బ్జెక్టుకు 51 మందిని అర్హులుగా గుర్తించారు. బదిలీల ప్రక్రియ ముగిసిన తరువాత వీరికి స్థానాలు కేటాయిస్తారు.  

        TELUGU HINDI SA PROMOTIONS CANCELLED

        నేడు బదిలీల కౌన్సెలింగ్ డెమో

          0
          • వెబెక్స్ ద్వారా నిర్వహణకు ఏర్పాట్లు
          • వెబెక్స్ ద్వారా డెమో కు ఒప్పుకోము
          • ప్రత్యక్ష పద్ధతి లో డెమో ఇవ్వాలి – ఫ్యాప్టో

          అమరావతి, న్యూస్ టోన్: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ప్రారంభ మైన నేపథ్యంలో ఆన్ లైన్ లో కౌన్సెలింగ్ డెమోను సోమవారం నిర్వహించనున్నా రు. ఈ నెల 28న ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలనతో ప్రారంభించి 27 రోజుల్లో బదిలీ ల ప్రక్రియను పూర్తి చేసేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీర భద్రుడు గతంలోనే షెడ్యూల్ విడుదల చేశారు. బదిలీల అంశంపై ఉపాధ్యాయ సంఘాలు చేసిన అనేకానేక విజ్ఞప్తులను పరిశీలించి షెడ్యూల్ ప్రకటించారు. అందులో భాగంగా 28, 29 తేదీల్లో దరఖాస్తుల పరిశీలన నిర్వహించారు. అయితే కౌన్సెలింగ్ కు సంబంధించి ఉపాధ్యాయుల్లో ఉన్న సందేహాల నివృత్తి కోసం వెబెక్స్ ద్వారా సోమవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు డెమోను నిర్వ హించనున్నట్లు జాయింట్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు ఐటీసెల్ సహకారంతో నిర్వహించేడెమోలో అన్ని ఉపాధ్యాయ సంఘాలను భాగ స్వాములను చేయనున్నారు.షెడ్యూల్ ప్రకారం 30వ తేదీ నుంచి డిసెంబర్ రెండో తేదీ వరకు పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శించ నున్నారు. అనంతరం 3,4 తేదీల్లో అభ్యంతరాలు నమోదు చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. 5, 7 తేదీల్లో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు. 8 నుంచి పదో తేదీ వరకు పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శిస్తారు. 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆపన్స్ నమోదుకు అవకాశం కల్పించి, 16 నుంచి 21వ తేదీ వరకు బదిలీల ఆర్డర్లను ప్రదర్శించనున్నారు. బదిలీల ఆర్డర్ లో సాంకేతిక సమస్యల స్వీకరణ, పరిష్కారం తేదీల్లో చేపట్టనున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత డిసెంబర్ 24వ తేదీ నుంచి బదిలీల ఆర్డర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

          టీచర్ల సాధారణ బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్‌ను మాన్యువల్‌ విధానంలో నిర్వహించాలా లేక వెబ్‌ ఆధారిత విధానంలో నిర్వహించాల అనే అంశంపై ఒకింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్పౌజ్‌ దంపతులకు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు మాన్యువల్‌ విధానంలోనే కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తుండగా, వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ సులభరీతి లోనే ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. దీనిపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరించి కౌన్సెలింగ్‌ విధానంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రత్యక్ష పద్ధతి లో డెమో ఇవ్వాలి అని ఫ్యాప్టో సి.ఎస్.ఈ కి ఫ్యాప్టో లేఖ రాసింది.

           
          TODAY DEMO ON WEB COUNSELING

          పెరిగిన సర్వీసు పాయింట్లు

            0
            • బదిలీల్లో పలువురు ఉపాధ్యాయులకు మినహాయింపు

            న్యూస్‌ టోన్-కర్నూలు విద్య: బదిలీల షెడ్యూలులో ప్రభుత్వం మార్పులు చేయడంతో కొందరు ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. షెడ్యూలులో ఇటీవల విద్యాశాఖ చేసిన సవరణలు కొందరికి ప్రయోజనం చేకూర్చింది. ఈనెల 30 నుంచి డిసెంబరు 24వ తేదీ వరకు 25 రోజులపాటు బదిలీలకు వివిధ దశలను నిర్దేశించారు. సవరణ షెడ్యూలు ప్రకారం ప్రొవిజనల్‌ సీనియారిటీ జాబితా ప్రదర్శనకు సంబంధించి సోమవారం నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 

            జిల్లావ్యాప్తంగా 11,427 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా అందులో తప్పనిసరిగా బదిలీకి సంబంధించి 2,198 మంది, విన్నపం 4,087 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల విద్యాశాఖ 2020 బదిలీలకు సవరణ షెడ్యూలును విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో స్టేషన్‌ సర్వీసుకు పూర్తి పాయింట్లు (ఎనిమిదేళ్ల నిబంధనల తొలగింపు), గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులకు అయిదేళ్ల స్టేషన్‌ సర్వీసు పూర్తైతేనే కచ్చితంగా బదిలీ వంటి నిబంధనల మార్పుతో జాబితాలో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా 2,132 మంది ఉపాధ్యాయులకు తమ సర్వీసుకు అనుగుణంగా పాయింట్లు పెరగనుండగా మిగిలిన 66 మందికి ఎలాంటి పాయింట్లు పెరగటం లేదు. 2015లో జరిగిన బదిలీల్లో భాగంగా నవంబరు 3, 4 తేదీల్లో చేరిన 51 మంది ప్రధానోపాధ్యాయులు తప్పనిసరి బదిలీల నుంచి మినహాయింపు పొందగా మిగిలిన 14 మంది తప్పనిసరి బదిలీలు పొందనున్నారు. ఇప్పటికే సవరించిన జాబితా ప్రకారం జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

            ప్రత్యేక పాయింట్ల కేటాయింపు

            ఉపాధ్యాయుల ప్రతిభ ఆధారంగా పాయింట్లు కేటాయిస్తున్నారు. అంతేకాక భార్యాభర్తలు ఒకే మండలంలో పనిచేసేలా ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నారు. హెచ్‌ఎం, టీచర్లు పనిచేస్తున్నప్పటి నుంచి బదిలీకి అర్హులైన వారి జాబితాను విద్యాధికారులు రూపొందించారు. ప్రత్యేక పాయింట్ల పొందినవారికి ఆశించిన స్థానం పొందే అవకాశం ఉంది. బదిలీలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు సమయంలో ప్రత్యేక కేటగిరీలను నమోదు చేసుకున్నారు. అందులో ప్రిపరెన్షియల్‌ కేటగిరీలో హెచ్‌ఎంలు నలుగురు, టీచర్లు 262 మంది ఉండగా, స్పౌజ్‌ కేటగిరీలో హెచ్‌ఎంలు 8 మంది, టీచర్లు 715 మంది, స్కూల్‌ పునర్విభజనలో మిగిలినవారు-67 మంది, పెళ్లికాని మహిళా టీచర్లు-76 మంది ప్రత్యేక పాయింట్లు పొందనున్నారు. వీరందరికి పత్రాల పరిశీలన కోసం జేసీ వద్దకు దస్త్రాలు పంపారు. బదిలీకి అర్హులైన టీచర్ల సీనియారిటీ జాబితాను సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో పొందుపరిచాల్సి ఉంది. ఆ తరువాత అభ్యంతరాల కోసం సమయం కేటాయించనున్నారు.

            TRANSFER POINTS INCREASED

            వెబ్ కౌన్సెలింగ్ పై రేపు సంఘాలకు డెమో

              0

              • ఉపాధ్యాయ సంఘాలకు ఆహ్వానం
              • పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు
              • వెబెక్స్ లింక్, ఐడి కొరకు ఐటి విభాగం ను సంప్రదించాలి

              న్యూస్ టోన్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగు ఎలా ఉంటుందో సోమవారం డెమో (నవంబరు 30న) నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అన్ని ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానిస్తోంది. వెబ్ ఎక్స్ ద్వారా ఈ డెమో  నిర్వహించి కౌన్సెలింగు ఎలా నిర్వహించనున్నారో ఐటీ విభాగం వారు తెలియజేస్తారు. బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగు వద్దని,  సెకండరీ గ్రేడ్ టీచర్లు వేల సంఖ్యలో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  వెబ్ కౌన్సెలింగుపై డెమో నిర్వహిస్తామని , ప్రదర్శన చూసిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు  ఉంటే  ఉపాధ్యాయ సంఘాలు తెలియజేయవచ్చని డైరక్టర్ గతంలోనే తెలియజేశారు.  డెమో తర్వాత వెబ్ కౌన్సెలింగా, మాన్యువల్ కౌన్సెలింగా అన్న నిర్ణయం తీసకుందామని డైరక్టర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

              ఉపాధ్యాయ సంఘం నాయకులు వెబెక్స్ మీటింగ్ లింక్ మరియు ఐడి ల కొరకు ఐటి విభాగం ను 7659966222, 9866156611 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

              4 శలవులే వాడుకోవాలి

                0
                • ఈ విద్యా సంవత్సరానికి 4 మాత్రమే
                • ఐచ్చికం, లోకల్, విచక్షణ శలవులకి వర్తింపు

                అమరావతి, న్యూస్ టోన్: 2020-21 విద్యా సంవత్సరానికి 4 మాత్రమే ఐచ్చిక, లోకల్, విచక్షణ శలవులను వాడుకోవాలని ఎస్.సీ.ఆర్.టి డైరెక్టర్ శ్రీ ప్రతాపరెడ్డి తెలిపారు. ఇది వరకే విడుదల చేసిన అకడమిక్ కాలెండర్ లో ఈ విషయం స్పష్టంగా ఇచ్చినట్ట్లు తెలిపారు. సోమవారం కార్తీక పౌర్ణమి ఐచ్చిక శలవు విషయం లో పలువురు అధికారులకు వచ్చిన సందేహాలను నివ్రుత్తి చేస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

                లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ గడువు పెంపు

                  0

                  న్యూస్ టోన్, న్యూఢిల్లీ: పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్(జీవన్ ప్రమాణ్ పత్ర-జేపీపీ) సమర్పించే తుది గడువును వచ్చే ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించినట్లు ఈపీఎఫ్ వో తెలిపింది. ఆలోగా ఎప్పుడైనా ఇవ్వవచ్చని పేర్కొంది. కోవిడ్-19 కారణంగా జేపీపీ అందజేయలేకపోయిన సుమారు లక్షల పింఛనుదారులకు ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. నవంబర్ 30వ తేదీలోగా జేపీపీ సమర్పించని వారికి ఫిబ్రవరి వరకు పింఛను యథా ప్రకారం అందుతుందని స్పష్టం చేసింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం-1995 ప్రకారం పింఛను పొందుతున్న వారికి ఈ వెసులుబాటు వర్తిస్తుందని వివ రించింది. జేపీపీ ఏడాదిపాటు అమల్లో ఉంటుందని తెలిపింది.

                  కరోనా వైరస్ తో హెచ్ఎం దంపతుల మరణం

                    0

                    గుంటూరు, నవంబరు 28: గుంటూరుకు చెందిన ప్రధానోపాధ్యాయ దంపతులు కరోనాతో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. విను కొండ పట్టణానికి చెందిన జి.బ్రహ్మానందరాజు(53), దుర్గారాణి(50) దంపతులు. బ్రహ్మానందరాజు విను కొండలోని హనుమాన్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా, దుర్గారాణి వెంకుపాలెం పాఠశాలలో హెచ్ఎంగా ఉన్నారు. కొద్ది రోజుల నుంచి నాడు-నేడు పనుల పర్యవేక్షణ, ఎండీఎం లెక్కలు తదితర పనులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో వారికి కరోనా సోకడంతో దుర్గారాణి ఈ నెల 19న బ్రహ్మానందరాజు ఈ నెల 27న మృతి చెందారు. ఈ విషయంపై శనివారం జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకు మారు ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా.. హెచ్ఎంల మరణంపై తనకు సమాచారం లేదని చెప్పారు. ఇది లావుంటే, హెచ్ఎం దంపతుల మరణంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి విద్యా శాఖ ఒత్తిడి వల్లే వారు కరోనా బారిన పడ్డారని, వీరి మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారని సంఘాల నేతలు ప్రశ్నించారు. దంపతుల మరణాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారంటూ విద్యా శాఖ తీరుపై ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు జి. హృదయ రాజు, కె. వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ. ప్రభుత్వ తీరుని తప్పుట ట్టారు. కాగా, తూర్పుగోదావరిజిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్థంక యూపీ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా వైరస్ సోకింది. ఇటీవల పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయింది.

                    ఉపాధ్యాయ దంపతుల మరణానికి బాధ్యులెవరు?: ఏపీటీఎఫ్ 

                    కరోనా ప్రభావం ఉన్నప్పటికీ నాడు- నేడు, జేవీకే తదితర కార్యక్రమాల పేరుతో ఒత్తిడి తేవడం వల్ల ఉపాధ్యాయులు మరణాలకు గురవుతున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృదయరాజు, కె. వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో గుంటూరు జిల్లా వినుకొండ లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న దంపతులు జి. బ్రాహ్మనందరాజు, జి. దుర్గారాణి గత వారం మరణించారని, వీరునాడు-నేడు, ఎండీఎం తదితర కార్య క్రమాలపై ఒత్తిడి తేవడం వల్లే కరోనా సోకి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధ్యాయులకు సంబంధం లేని పనులు, ఒత్తిడి చేసే పనులు అప్పజెప్పవద్దనని ఏపీటీఎఫ్ డిమాండ్ చేస్తోందన్నారు. మృతి చెందిన ప్రధానోపాధ్యాయుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

                    నేడు, రేపు ఆన్‌లైన్‌లో జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష

                      0

                      అమలాపురం‌, నవంబరు 28: కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ పేరిట జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష ఆది,సోమవారాలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర కోఆర్డినేటర్‌ పీవీఎల్‌ఎన్‌.శ్రీరామ్‌ తెలిపారు. ఆరో తరగతి  నుంచి ఇంటర్‌ మొదటి  సంవత్సరం చదువుతున్న విద్యార్థు లకు ఓపెన్‌ బుక్‌ పద్ధతి ద్వారా ఇంటి వద్ద నుంచే ఈపరీక్ష రాసుకునే అవకాశాన్ని కల్పించారు. రిజిష్టర్‌ చేయించుకున్న విద్యార్థులు ఎంచుకున్న రోజున ఉదయం 10 గంటల నుంచి 8గంటల మధ్యలో 90 నిమిషాలు పరీక్ష నిర్వహిస్తామన్నారు. 6,7,8 తరగతుల విద్యార్థులకు జూనియర్‌ విభాగంలో, 9,10,11 తరగతులకు సీనియర్‌ విభాగంలో వంద బహుళైచ్ఛిక ప్రశ్నలకు వంద మార్కులు ఉంటాయని వివరించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఇతర భారతీయ భాషల్లో పరీక్ష రాసుకునే వెసులుబాటు కల్పించామన్నారు.