Home Blog Page 393

మీరు డ్రై రేషన్‌ తీసుకున్నారా?

    0
    • మధ్యాహ్న భోజన పథకం అవకతవకలపై సోషల్‌ ఆడిట్‌
    • విద్యా శాఖ నిర్ణయం

    ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 1 : కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలుస్థానే సరుకుల పంపిణీలో జరిగిన అక్ర మాలపై కాగ్‌ బృందాల ఆకస్మిక తనిఖీలతోపాటు, క్షేత్ర స్థాయిలో సోషల్‌ ఆడిట్‌ చేపట్టాలని విద్యా శాఖ నిర్ణయిం చింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదువుతున్న 2,91,862 మంది బాల బాలిక లకు ఈ ఏడాది మార్చి నుంచి నెల నెలా డ్రై రేషన్‌లో భాగంగా బియ్యం, కోడి గుడ్లు, చిక్కీ పంపిణీ చేస్తున్నారు. గరిష్టంగా ఈ సరుకులను పది శాతం మంది విద్యార్థులకు పంపిణీ కాలేదని విద్యా శాఖ అనుమానిస్తోంది. డ్రైరేషన్‌ పంపిణీ చేసినట్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రశీదులు లేకపోవడం, పలుచోట్ల గ్రామ / వార్డు వలంటీర్ల అవకత వకలు, కొన్నిచోట్ల చిక్కీల పంపిణీ లేకపోవడం మరికొన్ని చోట్ల గుడ్లు సగం మాత్రమే ఇవ్వడంపై విద్యాశాఖకు సమా చారం అందింది.  డ్రై రేషన్‌ లబ్ధిదారుల వివరాల జాబితా ను స్కూలు నోటీసు బోర్డుల్లోను ప్రదర్శించలేదు. ఈ నేపథ్యంలో డ్రై రేషన్‌ సరుకుల పంపిణీపై సమగ్ర పరిశీలన చేపట్టాలని నిర్ణయించారు. ఆడిట్‌లో భాగంగా ఆయా తరగతులు, కేటగిరీల వారీగా విద్యార్థులకు పంపిణీ అయిన డ్రై రేషన్‌ సరుకుల వివరాలు, వాటి పరిమాణం, ఎంఈవో లు, హెచ్‌ఎంలు, వలంటీర్ల భాగస్వామ్యం, వారి పాత్ర, రికా ర్డులు, రిజిష్టర్ల నిర్వహణ, స్కూలు పేరెంట్‌ కమిటీ చొరవ, సరుకుల పంపిణీపై విద్యార్థులు, పేరెంట్స్‌ సంతృప్తి స్థాయి లు, వంటి అంశాలపై పాఠశాల స్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి నివేదికలు రూపొందిస్తారు. దీంతోపాటు కాగ్‌కు చెందిన ఆడిట్‌ టీమ్‌ జిల్లాలో ముందస్తు సమాచారం ఇవ్వ కుండా పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి స్పెషల్‌ ఆడిట్‌ ను చేయనుంది. డ్రై రేషన్‌ సరుకులు ఏ ఒక్క విద్యార్థికి అందలేదన్న పరిస్థితి ఉత్పన్నం కాకూడదని, దీనికోసమే ఇప్పటి వరకూ జరిగిన పంపిణీపై సోషల్‌ ఆడిట్‌ను నిర్వహిస్తున్నట్లు విద్యా శాఖ అధికారులు స్పష్టం చేశారు.

    నవంబరుకు డ్రై రేషన్‌ విడుదల

    నవంబర్‌ నెల డ్రై రేషన్‌ సరుకులను విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఒక్కొక్కరికి 2.4 కిలోలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఒక్కొక్క రికి 3.6 కిలోల ఆహార ధాన్యాలను / బియ్యం ఇవ్వను న్నారు. వీటితోపాటు కంది పప్పు, ఒక్కొక్కరికి 13 చొప్పున గుడ్లు, 13 చొప్పున చిక్కీలు పంపిణీ చేస్తారు. కొత్తగా అడ్మిషన్లు తీసు కున్న విద్యార్థులకు డ్రైరేషన్‌ సరుకులు ఇస్తారు. ప్రస్తుతం 8, 9, 10 తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో తరగతులకు హాజరై మధ్యాహ్న భోజన పథకం ఆహార పదార్థాలను తీసుకుంటున్న విద్యార్థులకు మాత్రం డ్రై రేషన్‌ సరుకులు ఇవ్వరు. ఒకవేళ భోజన పథకాన్ని వినియోగించుకోకపోతే సంబంధిత విద్యార్థులకు డ్రైరేషన్‌ సరుకులు ఇస్తారు. ఆ ప్రకారం జిల్లాలో 8, 9, 10 తరగ తులు చదువుతున్న విద్యా ర్థులు 93,158 మంది ఉండగా, వీరిలో భోజన పథకాన్ని ఎంత మంది వినియోగించుకుం టున్నదీ, లేనిదీ లెక్కలు తేల్చే పనిని ప్రారంభించారు. కంది పప్పు ఇవ్వని పక్షంలో కుకింగ్‌ ఛార్జీలను చెల్లిస్తారు. జిల్లాలో వచ్చే వారం నుంచి నవంబర్‌ డ్రై రేషన్‌ సరుకుల ను పంపిణీ చేయనున్నారు.

    SOCIAL AUDIT ON MDM DRY RATION

    ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

      0
      •  తగ్గించిన వేతనాలు చెల్లింపుకు కీలక ఉత్తర్వులు
      • మార్చి వేతనాలు డిశంబర్ లో, ఏప్రిల్ వేతనాలు జనవరి లో

      అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్
      కారణంగా మార్చి నెలలో వాయిదా వేసిన పెన్షన్లు, వేతనాలను డిసెంబర్ నెలలో
      చెల్లించనున్నట్లు ప్రకటిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు
      ఏప్రిల్ నెల బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య
      కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ ఆదేశించారు. కాగా, ఏప్రిల్ నెలలో తగ్గించిన
      వేతనాలను కూడా డిసెంబర్ లేదా 2021 జనవరి నెలలో చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం
      స్పష్టం చేసింది. అటు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష
      టీడీపీ మధ్య వాడీవేడి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. 

      PENDING SALARIES TO EMPLOYEES

      నేటి నుంచి అందుబాటులోకి బదిలీల సీనియారిటీ జాబితాలు

        0
        • షెడ్యూల్ ప్రకారం నిన్ననే ప్రకటించాల్సి ఉంది
        • సీనియారిటీ జాబితాలు ఈ రోజు విడుదల
        • అంతర్జాలం లో అందుబాటు
        • దరఖాస్తుల స్వీకరణ ముగింపు మినహా ఏదీ షెడ్యూల్ ప్రకారం జరగడం లేదు: ఉపాధ్యాయులు
        •  వెబ్ కౌన్సెలింగ్ డెమో వాయిదా

        అమరావతి, న్యూస్ టోన్: షెడ్యూల్ ప్రకారం నిన్ననే ప్రకటించాల్సిన ఉపాధ్యాయుల బదిలీల సీనియారిటీ జాబితాలు ఈ రోజు నుండి అంతర్జాలం లో అందుబాటు లోకి రానున్నాయి. బదిలీల వెబ్సైట్ https://teacherinfo.ap.gov.in/  లో ఈ సీనియారిటీ జాబితాలు అందుబాటు లో ఉంచుతారు. సాంకేతిక కారణాలు తలెత్తితే జాబితాల విడుదల రేపటికి వాయిదా పడుతుంది. సీనియారిటీ జాబితాల ను రూపొందించే కార్యక్రమం కూడా బదిలీల సాఫ్ట్ వేర్ చేస్తుంది. ఇప్పటికే డిఈఓ లకు సీనియారిటీ జాబితాలను రూపొందించే ఆప్షన్ కూడా ఇచ్చారు. అయితే నిన్న సీనియారిటీ జాబితాలు విడుదల కాక పోవడం తో ఆశక్తి గా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులు ఒకింత నిరాశ కు గురి అయ్యారు. దరఖాస్తుల స్వీకరణ ముగింపు మినహా ఏదీ షెడ్యూల్ ప్రకారం జరగడం లేదు అని ఉపాధ్యాయులు వాపోతున్నారు. షెడ్యూల్ ప్రకారం బదిలీలు నిర్వహించాలి అని కోరుతున్నారు. అటు వెబ్ కౌన్సెలింగ్ మీద ఉపాధ్యాయ సంఘాలకు నిన్న నిర్వహించాల్సిన డెమో సైతం వాయిదా పడింది. ఈ మేరకు అధికారులు ఉపాధ్యాయ సంఘాలకు సమాచారం పంపారు.

        SENIORITY LISTS TODAY

        విద్యా సంస్థల్లో హాజరు నమోదు: సీఎస్

          0

          అమరావతి ఆంధ్రజ్యోతి: కొవిడ్ పరిస్థితుల రీత్యా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలను తెరుస్తుండ టంతో వాటిలో విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ఆటానమస్ విద్యా సంస్థలు ప్రతివారం పట్టిక ఆధారంగా విద్యార్థుల హాజరు, ఇతర వివరాలను ప్రతి శనివారం వైద్య. ఆరోగ్యశాఖ కమిషనర్ కు పంపాలని ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.

          ATTENDANCE CAPUTRE IN EDUCATIONAL INSTITUTIONS

          జగనన్న వసతి దీవెన రెన్యూవల్ చేయించుకోవాలి

            0

            మచిలీపట్నం టౌన్: జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన పథకాలకు విద్యార్థులు రెన్యూవల్ చేయించుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కె.సరస్వతి పేర్కొన్నారు. రెన్యువల్ చేసే సమయంలో హాల్ టికెట్ నెంబర్ తో సంబంధం లేకుండా విద్యార్థులు రెన్యువల్ చేసుకోవచ్చన్నారు.

            JAGANANNA VASATHI RENEWAL

            నేడు మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్ పోస్టులకు కౌన్సెలింగ్

              0

              అమరావతి: మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్ పోస్టులకు మంగళవారం కౌన్సెలింగ్ జరుగుతుందని పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ డి.మధుసూదనరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్సిపాల్ నియామకాలకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టులకు ప్రాథమికంగా ఎంపికై సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు డిసెంబరు ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు ఇబ్రహీం పట్నంలోని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ కార్యాల యంలో జరిగే కౌన్సెలింగ్ కు హాజరు కావాలని ఆయన కోరారు.

              MODEL SCHOOL PRINCIPAL POSTS COUNSELING TODAY

              బదిలీలకు వేళాయె

                0
                • పరిశీలన పూర్తి… వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌

                నెల్లూరు (విద్య): ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాల్లో కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇంకోవైపు బదిలీల కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అన్ని కేటగిరీల్లో 5054 మంది దరఖాస్తు చేసుకోగా- వారిలో 4997 మంది మిగిలారు. వీరిలో 1638 మంది నిర్దుష్ట కాలపరిమితి సర్వీసు పూర్తయి.. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారే. షెడ్యూల్‌ ప్రకారం దరఖాస్తుల ప్రక్రియ శనివారం వరకు ఉండగా- జిల్లా విద్యాశాఖాధికారులు పూర్తి చేశారు. ఆ జాబితాను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులకు అయిదేళ్లు పనిచేసిన స్థానం నుంచి బదిలీ తప్పనిసరి. అయిదేళ్లు దాటాక, ఎన్నేళ్ల సర్వీసు అయినా 15 పాయింట్లు మాత్రమే ఇచ్చేలా సీలింగ్‌ పెట్టారు. దీనిపై స్టేషన్‌ సీనియర్లు అభ్యంతరం తెలపగా.. పని చేస్తున్న ఏడాది నుంచే అన్ని పాయింట్లు లెక్కించాలని నిర్ణయించారు. దీంతో బదిలీ అయ్యే ప్రధానోపాధ్యాయులు తగ్గనున్నారు. మిగిలిన కేటగిరీలనూ కలిపితే సుమారు 300 మందికి ప్రయోజనం కలగనుందని జిల్లా అధికారులు చెబుతున్నారు. వ్యక్తిగత, ప్రతిభ, వైకల్యం, అనారోగ్యం, వితంతువులు, అవివాహితులు.. కేటగిరీలకు పాయింట్లు కేటాయించారు. ఇలా 250 మంది కోరుకున్న చోటకు వెళ్లే అవకాశం ఉంది. వెబ్‌ కౌన్సెలింగ్‌ డెమో గురించి ఏమీ తెలపలేదని ఉపాధ్యాయులు అంటున్నారు.

                పారదర్శకంగా చేపడుతున్నాం : డీఈవో పి.రమేష్‌

                పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా చేస్తున్నాం. సమస్యలను తగిన ఆధారాలతో విన్నవిస్తే.. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

                ఇదీ షెడ్యూల్‌

                నవంబరు 30 – డిసెంబరు 2: ప్రొవిజినల్‌ సీనియారిటీ జాబితా ప్రదర్శన

                డిసెంబరు 3, 4: అభ్యంతరాల స్వీకరణ

                5, 6, 7: జేసీ ఆధ్వర్యంలో పరిశీలన

                8, 9, 10: సీనియారిటీ తుది జాబితా ప్రకటన

                11-15: వెబ్‌ ఆప్షన్ల నమోదు

                16-21: బదిలీల ఉత్తర్వుల ప్రదర్శన

                22-23: సాంకేతిక ఇబ్బందుల స్వీకరణ

                24: బదిలీల ఉత్తర్వులు డౌన్లోడ్‌ చేసుకోవచ్చు

                TIME FOR TRANSFERS

                ఆశించిన ఫలితం ఏదీ ?

                  0
                  • 19 బృందాలు తనిఖీ చేసినా…ఫలితం శూన్యం
                  • నేటికీ అనర్హులకు స్పౌజ్‌ పాయింట్లు
                  • 2015 వెబ్‌ కౌన్సెలింగ్‌ తర్వాత ఎస్‌ఆర్‌లో  సీల్‌ వేయించుకోని చాలా మంది టీచర్లు
                  • ఇప్పుడు అవకాశం తీసుకుని అక్రమాలకు శ్రీకారం

                  అనంతపురం విద్య, నవంబరు 29:  ఉపాధ్యాయ బదిలీల్లో  అక్రమార్కులను ప ట్టడానికి 19 బృందాలను నియమించి, తనిఖీ చేయించినా…..ఆశించిన ఫలితం రాలేదన్న వి మర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నాటి అక్ర మాలకు 2015లోనే బీజాలు పడ్డాయన్న  వా దనలూ వ్యక్తమవుతున్నాయి. పైౖగా అనర్హులకు స్పౌజ్‌ పాయింట్లు వేసి తొలగించకుండా డీఈఓ లాగిన్‌ఉంచారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.   

                  2015లోనే అక్రమాలకు బీజాలు

                  ఉపాధ్యాయ బదిలీల్లో 2015 నవంబర్‌లో తొలిసారి వెబ్‌ కౌన్సెలింగ్‌ ని ర్వహించారు.  అప్పుడే చాలా మంది టీచర్లు ‘ఎస్కేప్‌’ అయినట్లు సమాచారం. స్పౌజ్‌ కేటగిరీలో వెబ్‌ కౌన్సెలింగ్‌కు హాజరైన వారు…..తాము కోరుకున్న ప్లేసుల కేటాయింపు (అలాట్‌మెంట్‌) జరిగిన తర్వా త  ఆర్డర్‌ కాపీలు సైతం ఆన్‌లైన్‌లో వస్తాయి. దీంతో ఆన్‌లైన్‌ లో వ చ్చిన బదిలీల ఆర్డర్‌ కాపీలను డౌన్‌లోడ్‌ చేసుకుని అటు నుంచి అటే చాలామంది టీచర్లు స్కూళ్లకు వెళ్లి చేరారు. తర్వాత అనేక మంది టీచర్లు స్పౌజ్‌ వాడుకున్నా తమ సర్వీసు రిజిస్టర్ల(ఎ్‌సఆర్‌)లో ముద్రలు(సీల్‌) వేయిం చుకోలేదు. దీంతో  చాలామంది టీచర్లకు ఇప్పుడు బదిలీ ల్లో స్పౌజ్‌  కేటగిరీలో దరఖాస్తు చేసుకుని లబ్ధిపొందడా నికి అవకాశం దొరికింది. 

                  ఆ జాబితాలు ఎందుకు బయట పెట్టరు…?

                  బదిలీల్లో స్పౌజ్‌, ప్రిఫరెన్షియల్‌ కేటగిరీల్లో చాలా వరకూ బోగస్‌ సర్టిఫికెట్లుతో దరఖాస్తు చేశారు. దీంతో ‘ఆంరఽధజ్యోతి’లో వరుస కథనాలు వచ్చాయి. స్పందించిన జిల్లా విద్యాశాఖాధికారులు 19 ప్రత్యేక బృందాలను నియ మించి, మెడికల్‌ బోర్డుకు పంపా రు. కాగా 19 బృందాలను వేసి పరిశీలించినా…..అసలైన అక్రమార్కులు తప్పించు కున్నట్టు సమాచారం. 2015 బదిలీల్లో స్పౌజ్‌ వాడుకున్న వారు అనేక మంది సీళ్లు వేయించుకోకుండా ఎస్కేప్‌ అవ్వడమే కారణం. దరఖాస్తుల పరీశీలనలో  మునుపటి బదిలీల్లో స్పౌజ్‌, ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ వాడుకున్న వారి జాబితాలను ప్రదర్శించకపోవడం కూడా కారణంగా చెప్ప వచ్చు. ఇప్పుడు కూడా అసలైన అక్రమార్కులు బయట పడాలన్నా, బదిలీ ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నా, మునుపటి బదిలీల జాబితాలను నోటీసు బోర్డులో లేదా, డీఈఓ బ్లాగ్‌లో ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. 

                  అనర్హులకు ఇప్పటి కీ పాయింట్లు….

                   బదిలీల్లో స్పౌజ్‌ కేటగిరీలో అనర్హులకు ఇప్పటికే పా యింట్లు వేసి, వారి దరఖాస్తులను ఒకే చేశారని సమా చారం. డీఈఓ ఆఫీ్‌సలో గతంలో పరీక్షల విభాగంలో డెప్యూటేషన్‌పై పనిచేసిన ఓ టీచర్‌, బెళుగుప్ప మండలం లో మరో టీచర్‌కు సంబంధించిన స్పౌజ్‌ డ్వామాలో టెన్నికల్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి స్పౌజ్‌ పాయింట్లు రావు. అయితే జిల్లా విద్యాశాఖాధికా రులు ఆ కేటగిరీలో దరఖాస్తు చేసిన వారికి స్పౌజ్‌ పా యింట్లు వేసి దరఖాస్తులను ఆమోదించినట్టు సమాచారం. షోకాజ్‌ నోటీసు అందుకున్న మరో సంఘం నాయ కుడికి కూడా పాయింట్లు వేశారన్న విమర్శలు వ్యక్తమవు తున్నాయి. అక్రమార్కులపై డీఈఓ శామ్యూల్‌ కొరడా ఝుళిపిస్తున్నా విద్యాశాఖలోని కింది స్థాయి అధికారులు, సిబ్బంది సహకరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.  

                  NO RESULT AFTER SCRUTINY

                  ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత

                    0
                    • పెద్దఎత్తున బ్లాక్‌ చేయడంపై ఆందోళన

                    గుంటూరు: జిల్లాలో బదిలీలకు సంబంధించి పాఠశాలల వారీగా సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వచ్చింది. మండలాల వారీగా ఎంఈఓలు గతంలో పాఠశాలల నుంచి వచ్చిన ఖాళీల జాబితాను ఇంతకు ముందే ఒకసారి పరిశీలించగా అందులో కొన్ని తప్పిదాలు ఉండడంతో వాటిని సరిచేయడానికి కొంత సమయం తీసుకున్నారు. వాటిపై తుది పరిశీలన చేసి జిల్లా విద్యాశాఖ ఆ జాబితాను ధ్రువీకరిస్తూ అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు సంబంధించి 2415 ఖాళీలు ఉన్నాయని తేల్చింది. వాటిల్లో కౌన్సెలింగ్‌కు 1640 ఖాళీలు మాత్రమే చూపించేలా ఆ జాబితాకు తుది రూపమిచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 775 ఖాళీలను బ్లాక్‌ చేసింది. ఇది తెలుసుకుని ఉపాధ్యాయవర్గం లబోదిబోమంటోంది.

                    ప్రవేశాలు పెరిగినా టీచర్లు ఏరీ? : ప్రస్తుత విద్యా సంవత్సరంలో జగనన్న విద్యాకానుక, నాడు-నేడు పనులతో సర్కారీ పాఠశాలల స్వరూపం మారడంతో చాలా మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 26వేల మంది విద్యార్థులు ఈ ఏడాది కొత్తగా చేరారు. దీంతో అనేక పాఠశాలల్లో పిల్లల ప్రవేశాలు పెరిగాయి. హేతుబద్ధీకరణలో భాగంగా చాలా పాఠశాలల్లో పెరిగిన పిల్లల వల్ల పోస్టుల్లో కోతపడలేదనే అభిప్రాయం సాక్షాత్తు యంత్రాంగం నుంచే వచ్చింది. పిల్లల పెరుగుదల నేపథ్యంలో అవసరమైన పాఠశాలలకు అదనపు టీచర్లను ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా చాలా పాఠశాలల్లో బ్లాక్‌ చేసిన ఖాళీలు ఉన్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొల్లిపర మండలం చక్రాయపాలెం ఎలిమెంటరీ పాఠశాలలో ప్రస్తుతం 73 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులే ఉన్నారు. 60 మంది పిల్లల కన్నా ఎక్కువగా ఉంటే అదనంగా ఒక టీచర్‌ను ఇవ్వాలి. ఈ ప్రకారం చూస్తే సదరు పాఠశాలకు ఒక టీచర్‌ అదనంగా రావాలి. ప్రస్తుతం చూపిన జాబితాలో ఆ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా ఒక టీచర్‌కు 8 ఏళ్లు సర్వీసు ముగిసిందని చెప్పి తప్పనిసరి ఖాళీల జాబితాలో చూపారు. ఆ పాఠశాల నుంచి ఆ టీచర్‌ బదిలీపై వెళితే మిగిలేది ఒక్కరే. అదనంగా పిల్లలు చేరారని మరో టీచర్‌ను అదనంగా కేటాయించలేదు. ఉన్న ఇద్దరిలో ఒకరు లాంగ్‌ స్టాండింగ్‌ కింద బదిలీ అవుతారు. మిగిలిన ఒక్కరితో పాఠశాల ఎలా నడపాలని అక్కడి ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. ఇలాంటి సమస్య తెనాలి, నరసరావుపేట డివిజన్లలో బాగా ఉందని, ఇవన్నీ పరిశీలించి మరోసారి జాబితాను తిరిగి ప్రదర్శించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇంతకుముందే ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపి ఖాళీలను బ్లాక్‌ చేయడం లేదని స్పష్టం చేశారు. తీరా ఇప్పుడు ఒక్క గుంటూరు జిల్లాలోనే 775 ఖాళీలు బ్లాక్‌ చేసి చూపారని, ఇదేం విధానమని ఏపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం జిల్లా నేత బసవలింగారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఖాళీలను బ్లాక్‌ జాబితా నుంచి తొలిగించి కౌన్సెలింగ్‌ ఖాళీల్లో చూపాలని లేదంటే మిగిలిన సంఘాల నేతలతో కలిపి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

                    CLARITY ON VACANCIES

                    బదిలీ నిర్ణయాలు అమలుచేయాలి

                      0
                      •  జాక్టో చైర్మన్ కె. జాలిరెడ్డి డిమాండ్

                      అమరావతి, న్యూస్ టోన్: బదిలీల సమస్యలపై విద్యాశాఖ మంత్రి సమక్షంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడంలో సత్వర చర్యలు తీసుకోవాలని జాక్టో చైర్మన్ కె. జాలిరెడ్డి, వర్కింగ్ చైర్మన్ సీహెచ్. శ్రావణ్ కుమార్ సెక్రెటరీ జనరల్స్ ఎం. శ్రీధర్ రెడ్డి, ఎ. కొండయ్య ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. బదిలీలు పారదర్శకంగా నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని కనుక అధికారులు అవసరమైన మేరకు షెడ్యూల్ పొడిగించి.. ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.

                      IMPLEMENT TRANSFER DEMANDS