Home Blog Page 392

సీనియార్టీ జాబితాలపై అప్పీళ్లకు నేటితో గడువు ముగింపు

    0

    ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 3 : టీచర్ల బదిలీలపై జిల్లా విద్యాశాఖ విడుదల చేసిన సీనియార్టీ జాబితాలపై ఆన్‌లైన్‌లో అభ్యంతరాల స్వీకరణ శుక్రవారంతో ముగియ నుంది. వీటిని ఈ నెల ఏడో తేదీలోగా పరిష్కరించి జాయిం ట్‌ కలెక్టర్‌(అభివృద్ధి) అనుమతితో 8న తుది జాబితాలను ప్రకటించనున్నారు. సబ్జెక్టుల వారీగా వేకెన్సీల జాబితాలు గు రువారం విడుదల చేశారు. తప్పనిసరి బదిలీ కింద గుర్తిం చిన 1,807 స్థానాలకు అదనంగా స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో 10 శాతం, ఎస్‌జీటీ కేడర్‌లో ఐదు శాతం స్థానాలను అద నంగా చేర్చి వేకెన్సీ జాబితాలను విడుదల చేయాలని విద్యా శాఖ ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. 

    LAST DAY FOR APPEALS ON SENIORITY

    39మంది ఎంఈవోలకు మెమోలు

      0

      ఒంగోలువిద్య, డిసెంబరు 2 : జిల్లాలోని 39 మంది ఎంఈవోలకు మెమో లు జారీ చేస్తూ డీఈవో వీఎస్.సుబ్బారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశా రు. జగనన్న విద్యా కానుక పంపిణీకి సంబంధించి బయోమెట్రిక్ అంధంటి కేషన్లో వెనుకబడినందుకు వారికి మెమోలు జారీ చేశారు. జిల్లాలో 3,15,171 మంది బాలబాలికలకు విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు. కిట్లు అందుకున్న విద్యార్థుల తల్లులు, బయోమెట్రిక్ లేదా ఐరిస్ అంథటికేషన్ ఉంటేనే విద్యార్థు ల యూని ఫారాలకు కుట్టుకూలీ చార్జిని తల్లుల ఖాతాకు జమ చేస్తారు. ఇ పృపటివరకు 67 శాతం మాత్రమే బయోమెట్రిక్ పూర్తయింది. 39 మండలాల్లోని కొన్ని పాఠశా లల్లో విద్యాకానుక కిట్లు పంపిణీ చేసినప్పటికి ఇప్పటి వరకు ఒ క్కరి బయోమెట్రిక్ అథంటికేషన్ నమోదు కాలేదని డీఈవో పేర్కొన్నారు.

      MEMOS TO 39 MEO’S

      మార్చిలో ఇంటర్‌ ఫైనల్‌ పరీక్షలు

        0

        ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 2 :ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు   ఈ నెలలో రెండో యూనిట్‌ పరీక్షలు, జనవరిలో అర్ధ సంవత్సర పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు  జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి మణేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఇంటర్‌ విద్య బోర్డు వార్షిక తాత్కాలిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. కళాశాలల వెసులుబాటును బట్టి మూడు, నాలుగు యూనిట్‌ పరీక్షలు నిర్వహించు కోవచ్చు. ప్రీ ఫైనల్‌ పరీక్షలు ఫిబ్రవరి చివరి వారంలో జరుగుతాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెండో శనివారం సెలవులు ఉండవు. సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు మార్చి మొదటి వారంలో ప్రాక్టికల్‌  పరీక్షలు, చివరి వారంలో పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రథమ సంవత్సరం ఇంటర్‌ అడ్మిషన్లు, తరగతుల నిర్వహణపై ఇంత వరకూ స్పష్టత లేదు. తరగతికి అనుమతించిన అడ్మిషన్ల సంఖ్యపై ప్రభుత్వం, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో ఈ న్యాయ వివాదం తేలే వరకూ అడ్మిషన్లు, తరగతుల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశాలు లేవు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో తరగతులు జరుగుతుండగా వీలైనంత మేర ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

        INTER PUBLIC EXAMS IN MARCH

        మధ్యాహ్న భోజనం నాణ్యతపై తనిఖీలు

          0
          • విద్యార్థులకు పౌష్టికాహార పంపిణీని పరిశీలించిన పాఠశాల విద్య (ఎండీఎం, స్కూల్‌ శానిటేషన్‌) రాష్ట్ర డైరెక్టర్‌ దివాన్‌ మై దీన్‌

          ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెం బరు 2 : జిల్లాలోని ప్రభుత్వ పా ఠశాలల్లో అమలవుతున్న మధ్యా హ్న భోజన పథకం ఆహార పదా ర్థాల నాణ్యతను పాఠశాల విద్య (ఎండీఎం, స్కూల్‌ శానిటేషన్‌) రాష్ట్ర డైరెక్టర్‌ దివాన్‌ మై దీన్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్పనవీడు, కలపర్రు, గోపన్నపాలెం, కొవ్వ లిలలోని హైస్కూళ్లను సందర్శించి భోజనపఽథకం అమలుతీరు, డ్రైరేషన్‌ సరుకుల పంపిణీని పరిశీలించారని డీఈవో సీవీ రేణుక తెలిపారు. పాఠశాలల్లోని టాయి లెట్లను పరిశీలించారని, విద్యార్థులతో మాట్లాడి ఆహారపదార్థాల నాణ్యత గురించి తెలుసుకున్నారన్నారు. బాలిబాలికలతో కలిసి భోజనం చేశారు. నాడు – నేడు నిర్మా ణ పనుల ప్రగతిని పరిశీలించారు. డైరెక్టర్‌ వెంట మధ్యాహ్న భోజన పథకం అసి స్టెంట్‌ డైరెక్టర్‌ వరదాచార్యులు, ఎంఈవో నరసింహమూర్తి, సూపరింటెండెంట్‌ మోహన్‌, పాఠశాల హెచ్‌ఎంలు, టీచర్లు ఉన్నారు.

          MDM INSPECTION

          బదిలీల సీనియారిటీ జాబితాలు విడుదలలో జాప్యం

            0

            • రాయలసీమ లోని ఒక్క జిల్లాలో కూడా విడుదల కాని వైనం
            • కోస్తాలో శ్రీకాకుళం, ప.గో, విశాఖపట్నం మినహా మిగిలిన జిల్లాల జాబితాలు విడుదల

            అమరావతి, న్యూస్ టోన్: బదిలీల సీనియారిటీ జాబితాలు విడుదలలో ఇంకా జాప్యం జరుగుతుంది. షెడ్యూల్ తేదీ ముగిసినప్పటికీ ఇంకా ఏడు జిల్లాల్లో జాబితాలు విడుదల కాక పోవడం గమనార్హం. ఇప్పటికి ఆరు జిల్లాల సీనియారిటీ జాబితాలు విడుదల అయ్యాయి. ఈ జాబితాలు https://teacherinfo.ap.gov.in/TEACHERTRANSFER20APPL/downloadSeniorityListService.apt వెబ్ లింక్ లో అందుబాటు లో ఉన్నట్లు ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులు తెలిపారు. సదరు జాబితాల పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 3,4 తేదీలలో https://teacherinfo.ap.gov.in/TEACHERTRANSFER20APPL/registerGrievances.apt నందు ఉపాధ్యాయులు తమ అభ్యంతరాలు పంపాలని ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులు తెలిపారు. కేవలం ఆన్లైన్ ద్వారా పంపిన అభ్యంతరాలు మాత్రమే పరిశీలిస్తామనీ, ఆఫ్లైన్ ద్వారా తెలిపే అభ్యంతరాలు స్వీకరించమని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఉపాధ్యాయులు తెలిపైన అభ్యంతరాలని జాయింట్ కలెక్టర్ 5 నుండి 7 తేదీలలో అప్రూవ్ చేస్తారు. తదుపరి పాయింట్లు ఆధారంగా తుది సీనియారిటీ జాబితాలను 8 నుండి 10 తేదీలలో విడుదల చేస్తారు. ఈ జాబితాల ఆధారంగా ఉపాధ్యాయులు 11 నుండి 15 తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ ను నమోదు చేయటకు అవకాశం ఇస్తారు.

            DELAY IN RELEASING SENIORITY LISTS

            ఉద్యోగులకు వాయిదాల్లోనే బకాయిలు చెల్లింపు

              0

              అమరావతి, న్యూస్ టోన్: ఉద్యోగులు, పెన్షనర్లకు కరోనా లాక్ డౌన్లో విధించిన 50 శాతం బకాయిలను రెండు విడతల్లోనే చెల్లించేందుకు ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులకు 50 శాతం, పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతంలో 50 శాతం ప్రభుత్వం తగ్గించింది. దీన్ని మూడు విడతలుగా డిసెంబర్ నెల జీతాలతో కలిపి చెల్లిస్తామని ఇంతకు ముందు ప్రకటించింది. అయితే తాజా ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులకు రెండు వాయిదాలు, పెన్షనర్లకు ఒకే విడత చెల్లించేందుకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రకారం 50 శాతం బకాయిలు డిసెంబర్ నెల్లో, మరో 50 శాతం వచ్చే జనవరిలో చెల్లించనున్నారు. అదే విధంగా ఉద్యోగుల కరవు బత్యంను పెంచేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది ప్రస్తుతం చెల్లిస్తున్న కరవు బత్యం 27.248 కాగా దీన్ని 30.392 అంటే 3.144 శాతం పెంపుతో అందించాలని నిర్ణయించింది. నెల ముందుగానే బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం పట్ల ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి వైవీ రావు హర్షం వ్యక్తం చేశారు ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై సత్వరమే స్పందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

              DIFFERED SALARIES IN 2 INSTALLMENTS

              ఈ రోజైనా సీనియారిటీ జాబితాలు విడుదలయ్యేనా ..?!

                0
                • షెడ్యూల్ తేదీ దాటి 2 రోజులైనా విడుదల కాని వైనం
                • కొన్ని జిల్లాల్లో ఇంకా పూర్తి కాని దరఖాస్తుల ధ్రువీకరణ
                • షెడ్యూల్ ప్రకారం సీనియారిటీ జాబితా విడుదలకి ఈ రోజు చివరి తేదీ.

                అమరావతి, న్యూస్ టోన్: ఉపాధ్యాయ బదిలీల సీనియారిటీ జాబితాలు నేటికీ విడుదల కాలేదు. దీనికి సాంకేతిక అంశాల తో పాటు దరఖాస్తుల ధ్రువీకరణ పూర్తి కాక పోవడం కారణాలుగా తెలియ వచ్చింది. కొన్ని జిల్లాల్లో బదిలీ దరఖాస్తుల ధ్రువీకరణ ఇంకా పూర్తి కానందున ఆయా జిల్లాల్లో బదిలీల జాబితా విడుదల ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర కార్యాలయపు ఐటి విభాగం ధ్రువీకరణ ఇంకా ఎందుకు పూర్తి కాలేదు అనే విషయం పై ద్రుష్ఱి సారించింది. ధ్రువీకరణ పూర్తి కాని ఉపాధ్యాయుల దరఖాస్తులు ఎందుకు పూర్తి కాలేదో రిమార్కులు పంపాలని అధికారులని కోరింది. బదిలీ దరఖాస్తుల ధ్రువీకరణ పూర్తి అయిన జిల్లాల్లో సీనియారిటీ జాబితాల విడుదల సాంకేతిక కారణాల వల్ల కావడం లేదు. రేపటి నుండి సీనియారిటీ జాబితాల పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాల్సి ఉన్నందున సాధ్యమైనంత త్వరగా సీనియారిటీ జాబితాలు విడుదల చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

                WHEN WILL RELEASE SENIORITY LISTS

                డిఎస్సి 2008 అభ్యర్థులకు న్యాయం చేయాలి

                  0
                  •  ధర్నాకు పిడిఎఫ్ మద్దతు

                  ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: డిఎస్సి -2008 అభ్యర్థులకు న్యాయం చేయాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విజయవాడలోని ధర్నాచౌక్ లో ‘జగనన్న మీద అలక’ పేరుతో 2008 అభ్యర్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనకు పిడి ఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, రాము సూర్యారావు స్వతంత్ర ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, పి రఘువర్మ మంగళవారం మద్దతు తెలిపారు వీరికి న్యాయం చేయాలని శాసనమండలిలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి కోరారు. న్యాయ సలహా తీసుకుని త్వరలో నియామక ఉత్తర్వులు ఇస్తామని మంత్రి ఎమ్మెల్సీలు తెలిపారు.

                  పాలిటెక్నికల్ లెక్చరర్లకు బదిలీలు నిర్వహించాలి

                  పాలిటెక్నికల్ లెక్చరర్లకు బదిలీల ఉత్తర్వులు త్వరగా జారీచేయాలని స్కిల్ డెవలప్మెంట్ మంత్రి మేకపాటి గౌతంరెడ్డిని పిడిఎఫ్ సభ్యులు మండలిలో కోరారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ నియామకాలు నూతన లెక్చరర్లకు పోస్టింగులు ఇచ్చేలోపే బదిలీలు చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే పనిచేస్తున్నవారికి తొలగించొద్దని, వృత్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కమిషనర్ లో మాట్లాడి ఉత్తర్వులు ఇప్పిస్తామని మంత్రి ఎమ్మెల్సీలకు హామీనిచ్చారు.

                  GIVE POSTINGS TO DSC 2008 CANDIDATES

                  నేడు టీచర్ల సీనియారిటీ జాబితాల ప్రకటన

                    0

                    మచిలీపట్నం టౌన్, డిసెంబరు 1: టీచర్ల బదిలీల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే ప్రక్రియ పూర్తయింది. ఆన్లైన్ లో 4571 మంది టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉపాధ్యాయులు ఖాళీలు, సీనియారిటీ లిస్టులు ప్రకటించిన అనంతరం తమకు నచ్చిన పాఠశాలను ఆప్షన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ విడుదల చేసిన నూతన షెడ్యూల్ ప్రకారం 27 రోజుల్లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంది ఈ నేపథ్యంలో సీనియారిటీ జాబితాలను బుధవారం ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. వీటిపై ఈనెల3,4 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు. 5 నుంచి 7వ తేదీ వరకు అభ్యంతరాలు పరిశీలిస్తారు. తుది సీనియారిటీ జాబితాను ఈనెల 8 నుంచి 10వ తేదీలోగా ప్రకటిస్తారు. వెబ్ సైట్లో టీచర్లు తమకు కావలసిన పాఠశాలల ఐచ్చికాలను ఈనెల 11 నుంచి 15 వరకు నమోదు చేసుకుంటారు. ఈనెల 16 నుంచి 21 వరకు బదిలీల ఉత్తర్వులపై దృష్టి సారిస్తారు. 22, 23 తేదీల్లో ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న టీచర్లకు 24న బదిలీల ఉత్తర్వులు ఇస్తారు. దరఖాస్తు చేసుకున్న టీచర్లు ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకుంటారు. జిల్లా వ్యాప్తంగా 11,500 మంది టీచర్లు పనిచేస్తుండగా, విధిగా బదిలీ కావలసిన వారు 1165మంది ఉన్నారు. రిక్వెస్ట్ పై బదిలీకి దరఖాస్తు చేసుకున్న వారు 3406 మంది ఉన్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న టీచర్ల సీనియారిటీ జాబితాలనూ, భాళీలనూ ప్రదర్శించేందుకు విద్యాశాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు.

                     KRISHNA SENIORITY LISTS TODAY

                    నవంబరుకు డ్రై రేషన్ విడుదల

                      0

                      అమరావతి ఆంధ్రజ్యోతి: నవంబర్ నెల డ్రై రేషన్ సరుకులను విడుదల చేశారు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఒక్కొక్కరికి 2.4 కిలోలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఒక్కొక్క రికి 3.6 కిలోల ఆహార ధాన్యాలను / బియ్యం ఇవ్వను న్నారు. వీటితోపాటు కంది పప్పు, ఒక్కొక్కరికి 18 చొప్పున గుడ్లు, 18 చొప్పున చిక్కీలు పంపిణీ చేస్తారు. కొత్తగా అడ్మిషన్లు తీసు కున్న విద్యార్థులకు డైరేషన్ సరుకులు ఇస్తారు. ప్రస్తుతం 8, 9, 10 తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో తరగతులకు హాజరై మధ్యాహ్న భోజన పథకం ఆహార పదార్థాలను తీసుకుంటున్న విద్యార్థులకు మాత్రం డ్రై రేషన్ సరుకులు ఇవ్వరు. ఒకవేళ భోజన పథకాన్ని వినియోగించుకోకపోతే సంబంధిత విద్యార్థులకు డ్రైరేషన్ సరుకులు ఇస్తారు. ఆ ప్రకారం జిల్లాలో 8, 9, 10 తరగ తులు చదువుతున్న విద్యార్థులు 93,158 మంది ఉండగా వీరిలో భోజన పథకాన్ని ఎంత మంది వినియోగించుకుం టున్నదీ, లేనిదీ లెక్కలు తేల్చే పనిని ప్రారంభించారు కంది పప్పు ఇవ్వని పక్షంలో కుకింగ్ ఛార్జీలను చెల్లిస్తారు. జిల్లాలో వచ్చే వారం నుంచి నవంబర్ డ్రై రేషన్ సరుకుల ను పంపిణీ చేయనున్నారు.

                      DRY RATION FOR NOVEMBER