Home Blog Page 391

సిపిఎస్ రద్దు చేయండి

    0

    మండలిలో పిడిఎఫ్ డిమాండ్

    అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం(సిపిఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని పిడిఎఫ్ సభ్యులు డిమాండ్ చేశారు. ‘ఉద్యోగుల సంక్షేమం-ప్రభుత్వ విధానం’ పై శాసన మండలిలో గురువారం జరిగిన చర్చలో పిడిఎఫ్ పక్షనేత వి బాలసుబ్రహ్మణ్యం, సభ్యులు ఐ వెంకటేశ్వరరావు, యండపల్లి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. సిపిఎసను వారం రోజుల్లో రద్దు చేస్తామని వైసిపి ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా కమిటీలతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఢిల్లీ ప్రభుత్వం సిపిఎస్ అవసరం లేదని అసెంబ్లీలో తీర్మానించిందని, రాష్ట్రప్రభుత్వం కూడా ఇలాంటి తీర్మానం చేస్తుందా అని ప్రశ్నించారు. ఎప్పటిలోగా సిపిఎస్ రద్దు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2018 జులై 1 నుంచి 11వ పిఆర్సి ఉద్యోగులకు అమలు కావాల్సి ఉందని, దీనిని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలనికోరారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలతో ప్రభుత్వం చర్చించలేదని గుర్తుచేశారు. కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ విధానంపై ఒక పాలసీ ప్రకటించాలని కోరారు. కరోనా కాలంలో ప్రైవేట్ విద్యరంగంలో పనిచేసే 3లక్షల మంది సిబ్బందికి జీతాలు అందలేదని, వారిని ఆదుకోవాలని కోరారు ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సిపిఎస్ రద్దు రాష్ట్రప్రభుత్వం నియమించిన వర్కింగ్ కమిటీ పరిశీలనలో ఉందని చెప్పారు.

    ABOLISH CPS DEMAND

    25వేల మంది డీఎడ్ విద్యార్థులకు సర్కార్ మేలు

      0

      న్యూస్ టోన్, అమరావతి: ప్రైవేటు డీఎడ్ కాలేజీల అక్రమాలతో ఆయా విద్యా సస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. ఇటువంటి విద్యార్థులకు నిలిపేసిన పరీక్షలను నిర్వహిం చనుంది. దీనివల్ల 25 వేల మంది (2018-20 బ్యాచ్) డీఎడ్ విద్యార్థులకు మేలు చేకూరుతుందని విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేశ్ గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మండలిలో బదులిచ్చారు. డీఎపాటు ఎల్పీజీ విద్యార్థులు పరీక్షలు రాయడానికి అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే, ‘2018-20 డీసెట్ ను 18 వేల మంది రాయగా వేల మంది మాత్రమే అర్హత సాధించారు. దీంతో డీసెట్ అర్హత మార్కులను తగ్గించేలా అప్పటి ప్రభుత్వంలోని వారికి ముడుపులు ఇచ్చి మరికొంతమందికి అర్హత వచ్చేలా కాలేజీలు చేశాయి. ఇలా 14.530 మంది సీట్లు పొందారు. ఆ తర్వాత మరో వేల మంది నుంచి రూ.లక్షలు చొప్పున వసూలు చేసి అనధికారికంగా చేర్చుకున్నాయి. ఇటీవల అధికారిక ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇతర విద్యార్థులకు పరీక్షలు పెట్టాలని యాజమాన్యాలు కోర్టును ఆశ్ర యించినా వారికి చుక్కెదురైంది. కాలేజీల తప్పునకు విద్యార్థులు నష్టపోకుండా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం లబ్ది చేకూరనుంది’ అని చెప్పారు.

      FAVOUR FOR 25K D.Ed STUDENTS

      2008 డిఎస్ సి అభ్యర్థులకు న్యాయం చేయాలి

        0

        అమరావతి బ్యూరో: డిఎస్సి 2008లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని
        నిరుద్యోగ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలోని అలంకార్ సెంటర్ లో వివిధ జిల్లాల నుండి వచ్చిన 2008 డిఎస్సీ క్వాలిఫై అభ్యర్థులు జగనన్న మీద ఆలక పేరుతో నిరసన దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా బిఇడి నిరుద్యోగ అభ్యర్థుల సంఘం కన్వీనర్ వెలుగుజ్యోతి మాట్లాడారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన జంబో డిఎస్ సిలో బిఇడి అభ్యర్థులకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. వందకు 77 మార్కులు వచ్చినా ఉద్యోగం ఇవ్వలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 2008 డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తామని మే నెలలో వివరాలను తీసుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి 2008లో అన్యాయానికి గురైన 2193 మంది నిరుద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని అన్నారు. ఈ దీక్షా శిబిరానికి విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ వెంకట్రామిరెడ్డి వచ్చి అభరులతో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తమతో మాట్లాడమని తనను పంపారని చెప్పారు. తమ అభ్యర్ధనను ప్రభుత్వం పరిశీలిస్తోందని అభ్యర్థులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిమ్మమరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

        JUSTICE FOR DSC 2008 CANDIDATES

        ఎట్టకేలకు టీచర్ల ప్రొవిజినల్‌ సీనియారిటీ జాబితా

          0
          • కమిషనర్‌ వెబ్‌సైట్‌లో జిల్లాల జాబితా డౌన్‌లోడ్‌కు ఉన్న ఆప్షన్‌
          • జిల్లా నుంచి 7,449 దరఖాస్తులు
          • ఆర్జేడీ, డీఈఓ, డీవైఈఓ, ఎంఈఓ స్థాయిల్లో 56 తిరస్కరణ

          అనంతపురం విద్య, డిసెంబరు 3: ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా ప్రొవిజినల్‌ సీనియారిటీ జాబితాను గురువారం ఎట్టకేలకు ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాల జాబితాలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ (సీఎ్‌సఈ) వెబ్‌సైట్‌లో ప్రదర్శించారు. జిల్లా జాబితాను రాత్రి ఆలస్యంగా ఉంచారు. జిల్లా నుంచి మొత్తం బదిలీలకు 7,449 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఆర్జేడీ, డీఈఓ, డీవైఈఓ, ఎంఈఓ స్థాయిల్లో 56 దరఖాస్తులను తిరస్కరించారు. నేటి నుంచి రెండు రోజులపాటు ప్రొవిజినల్‌ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ ఆమోదం తీసుకుని, తుది జాబితాను ప్రదర్శించనున్నారు.

          తేలిన లెక్క

          జిల్లాల నుంచి జాబితాలను రాష్ట్ర శాఖకు పంపా రు. దీంతో వారు జిల్లాల వారీగా జాబితాలను వెబ్‌సైట్‌లో ప్రదర్శించారు. ఆ మేరకు జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయ బదిలీలకు 7,449 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులకు సంబంధించి 188, స్కూల్‌ అసిస్టెంట్‌ తదితరాలు 7,210 ఉన్నాయి. రెండేళ్ల సర్వీసు పూర్తికాని, పీఈటీలవి, అనర్హత తదితర కారణాలతో ఆర్జేడీ 1, డీఈఓ 4, డిప్యూటీ డీఈఓలు 18, ఎంఈఓలు 33 దరఖాస్తులను తిరస్కరించినట్లు జిల్లా విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. మరో ఐదుగురి దరఖాస్తులను తి రస్కరించటంతో తిరిగి దరఖాస్తు చేయలేదని అధికారులు చెబుతున్నారు.

          సాంకేతిక సమస్యతో జాప్యం

          జిల్లా ప్రొవిజినల్‌ సీనియారిటీ జాబితా కమిషనరేట్‌ వెబ్‌సైట్‌లో కనిపించలేదు. ఇతర జిల్లాల జాబితాలు కనిపించినా.. అనంతకు సంబంధించి కనిపించకలేదు. మధ్యాహ్నం నుంచే బదిలీల సీనియారిటీ జాబితాలు అంటూ.. కొన్ని కేటగిరీ పోస్టుల జాబితాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. సాంకేతిక సమస్యలతో జిల్లా జాబితా వెబ్‌సైట్‌లో ప్రదర్శించలేదు. సమస్య పరిష్కారం తర్వాత ప్రొవిజినల్‌ సీనియారిటీ జాబితాను ప్రదర్శించారు.

          SENIORITY LIST ANANTAPURAM

          కేజీబీవీల్లో ప్రవేశాలకు 9లోపు దరఖాస్తులు

            0

            ఒంగోలువిద్య, డిసెంబరు 3 :  జిల్లాలోని వివిధ కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 6,7,8,ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ఖాళీలను భర్తీ చేసేందుకు అరు ్హలైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహానిస్తున్నట్లు ఏపీ సమగ్రశిక్ష అద నపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌  డాక్టర్‌ ఎం.శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రక టనలో తెలిపారు. ఈనెల 4 నుంచి 9వతేదిలోపు దరఖాస్తులను సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించాలన్నారు. జిల్లాలోని వెలిగండ్ల, రాచర్ల, మార్కాపురం, పెద్దారవీడు, సీఎస్‌పురం, ఉలవపాడు, కొమరోలు, చీ రాల, వి.వి.పాలెం, పామూరు, లింగసముద్రం, హనుమంతునిపాడు, పొ న్నలూరు, పిసిపల్లి, పెద్దదోర్నాల, అర్ధవీడు, జరుగుమల్లి, కేజీబీవీల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. విదార్థినులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

            KGBV ADMISSIONS LAST DATE 9TH

            ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం

            0
            • శాసనమండలిలో చర్చకు మంత్రి బుగ్గన జవాబు

            న్యూస్ టోన్, అమరావతి: అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు మూలవేతనంపై 27 శాతం మధ్యంతర భృతి మలు చేశామని, తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కూడా ప్రాధాన్యతల ప్రకారం సమస్యలను పరిష్కరిస్తూ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు, సౌకర్యాల విషయంలో ఒకే రకమైన విధానం ఉండాలన్న వినతిపై ప్రభుత్వం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ‘ఉద్యోగుల సంక్షేమం- ప్రభుత్వ విధానం’ పై శాసనమండలిలో గురువారం స్వల్పకాలిక చర్చకు మంత్రి జవాబిచ్చారు. బుగ్గన ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ. గత సర్కారు పెండింగ్లో పెట్టినవి కూడా…

            2019 నుంచే దేశమంతా ఆర్థిక వ్యవస్థ మందగించింది. కరోనాతో చావుదెబ్బ తగిలిం ది. రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా తగ్గిపోయింది. కాస్త ఆలస్యమైనా ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఉద్యోగులు, పింఛనుదారులందరికీ శాతం ఐఆర్ ను అమలు చేయడం ద్వారా ఏడాదికి రూ.9,291.71 కోట్లు అదనంగా ఖర్చు అవుతున్నా ఎన్నికల హామీకి కట్టుబడి సీఎం అమలు చేశారు. పూర్తి స్థాయి పీఆ రసీ అమలుకు చర్యలు చేపడుతున్నాం. టీడీపీ సర్కారు 2018 నుంచి ఉద్యోగులకు పెండింగ్లో పెట్టిన డీఏలు కూడా మేం ఇస్తాం. సీపీఎస్ రద్దు, అర్హత కలిగిన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాలపై మంత్రులు, అధికారుల కమిటీల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి

            గౌరవ వేతనాలు భారీగా పెంపు: అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్న ఆశా కార్య కర్తలు, గిరిజన సామాజిక హెల్త్ వర్కర్లు, మున్సిపల్ అవుట్ సోడ్ పబ్లిక్ హెల్త్ వర్కర్లు, మెప్మా ఆర్పీలు, సెర్ప్ వీవోఏలు, హోంగార్డులు, మధ్యాహ్న భోజన కుక్ కం హెల్పర్, అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల జీతాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికా రంలోకి రాగానే భారీగా పెంచింది. మొత్తం 3,18, 804 మందికి జీతాల పెంపు ద్వారా ఏటా రూ.1,185 కోట్ల మేర అదనంగా ఖర్చవుతున్నా భరిస్తాం. ఆశా వర్కర్ల జీతం రూ. 3 వేల నుంచి రూ.10 వేలకు, కేవలం రూ.400 జీతంతో పనిచేస్తున్న గిరిజన సామాజిక హెల్త్ వర్కర్లకు రూ.4 వేలు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.12 వేల నుంచి 18 వేల మేర పెంచాం. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏపీలో 4 లక్షలకు పైగా కొత్తగా ఉద్యోగాలు కల్పించాం.

            EMPLOYEE WELFARE IS THE AIM

            సీపీఎస్‌ ఎందుకు రద్దు చేయలేదు?

              0
              • శాసనమండలిలో తెదేపా, పీడీఎఫ్‌ సభ్యుల ధ్వజం
              • సీపీఎస్‌ రద్దుపై కేఏ పండిట్‌ కమిటీతో వాస్తవిక విశ్లేషణ: మంత్రి బుగ్గన వెల్లడి

              ఈనాడు, అమరావతి: ‘అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని జగన్‌ ప్రకటించారు. 18 నెలలైనా ఎందుకు చేయలేకపోయారు? పాత డీఏలను 30 నెలల తర్వాత జీతంలో కలిపి ఇస్తామంటారా? ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రజాస్వామికంగా వ్యవహరించలేరా? ఒక్కసారి కూడా సమస్యలపై చర్చించి పరిష్కరించలేరా?’ అని తెదేపా, పీడీఎఫ్‌ సభ్యులు శాసనమండలిలో ధ్వజమెత్తారు. ‘ఉద్యోగుల సంక్షేమం- ప్రభుత్వ విధానం’ అంశంపై గురువారం మండలిలో లఘుచర్చ జరిగింది. ఈ సందర్భంగా పీడీఎఫ్‌ సభ్యుడు ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఉద్యోగుల అసంతృప్తి వ్యతిరేకతగా మారకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శాంతియుత నిరసనలు తెలిపేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాలను అనుమతించడం లేదని.. నిరసన తెలిపే హక్కును అణచివేయొద్దని హెచ్చరించారు. ఉపాధ్యాయులతో నాడు-నేడు పనులు చేయించటం దారుణమని తెదేపా సభ్యుడు ఏఎస్‌ రామకృష్ణ పేర్కొన్నారు. పాఠశాలలు తెరవటం వల్లే అనేక మంది ఉపాధ్యాయులు కొవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ప్రజాస్వామికంగా మెలగాలని, లేకపోతే ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమని పీడీఎఫ్‌ సభ్యుడు విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు.

              వర్కింగ్‌ కమిటీని నియమించాం

              సీపీఎస్‌ రద్దుకు సంబంధించిన అంశంపై కేఏ పండిట్‌ కమిటీ వాస్తవిక విశ్లేషణ జరుపుతోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై మంత్రివర్గ ఉపసంఘాన్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వర్కింగ్‌ కమిటీని నియమించామన్నారు. ప్రస్తుతం వర్కింగ్‌ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. సీపీఎస్‌ రద్దుకు సంబంధించి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. శాసనమండలిలో ‘ఉద్యోగుల సంక్షేమం- ప్రభుత్వ విధానం’ అంశంపై జరిగిన లఘుచర్చకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం కరోనా వల్ల రాబడి పడిపోయిందని, ఉద్యోగుల సంక్షేమంలోనూ తొలుత చిరుద్యోగులకే ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. ఆ క్రమంలోనే ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, హోంగార్డులకు వేతనాలు పెంచామని తెలిపారు.

              WHY CPS NOT ABOLISHED

              రేపు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష

                0

                ఒంగోలువిద్య, డిసెంబరు 3 : రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జి టె క్నాలజీస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రిపుల్‌ ఐటీల్లో 2020-21 విద్యాసంవ త్సరంలో అడ్మిషన్ల కోసం మొదటిసారిగా శనివారం ప్రవేశపరీక్ష నిర్వహిస్తు న్నారు. జిల్లాలో ఈ పరీక్షకు 7302 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 59 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలను 40 పోలీసుస్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు జ రుగుతుంది. ఉదయం 9గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవా లి. పరీఒంగోలువిద్య, డిసెంబరు 3 : రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జి టె క్నాలజీస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రిపుల్‌ ఐటీల్లో 2020-21 విద్యాసంవ త్సరంలో అడ్మిషన్ల కోసం మొదటిసారిగా శనివారం ప్రవేశపరీక్ష నిర్వహిస్తు న్నారు. జిల్లాలో ఈ పరీక్షకు 7302 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 59 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలను 40 పోలీసుస్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు జ రుగుతుంది. ఉదయం 9గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవా లి. పరీక్ష నిర్వహణలో కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఒక్కో గదికి కేవలం 16 మందినే కేటాయించాలని డీఈవో వీఎస్‌.సుబ్బారావు గురువారం ఓ ప్రక టనలో పరీక్ష కేంద్రాల చీఫ్‌లు, డీవోలను ఆదేశించారు.

                IIIT EXAM ON TOMORROW

                పోస్టులు బ్లాక్‌!

                0
                • తాత్కాలిక సీనియార్టీ జాబితా విడుదల
                • పోస్టుల బ్లాక్‌పై టీచర్లలో ఆందోళన
                • వాటిలో సిఫారసు బదిలీలు చేస్తారంటూ ఆరోపణ
                • టీచర్ల కొరతలేకుండా చేసేందుకేనంటున్న డీఈవో

                గుంటూరు(విద్య), డిసెంబరు 3: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన తాత్కాలిక సీనియార్టీ జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీగ్రేడ్‌, పీఈటీ, లాంగ్వేజ్‌ పండిట్‌ ఇలా క్యాడర్‌వారీగా జాబితాను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిశీలించి వాటిని  జేసీ ఆధ్వర్యంలో పరిష్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలాఉంటే ఉపాధ్యాయుల బదిలీల్లో కొన్ని పోస్టులు బ్లాక్‌ చేస్తున్నారని సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,425 సెకండరీగ్రేడ్‌ టీచర్‌ పోస్టులు ఖాళీలుంటే కౌన్సెలింగ్‌లో 1640 మాత్రమే చూపుతున్నారని సంఘాలు ఆరోపిస్తున్నాయి. దాదాపు 775(33శాతం) పోస్టులు ఈ క్యాడర్‌లో బ్లాక్‌ చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెబుతున్నారు. ఉన్నత పాఠశాల్లో సైతం 200వరకు పోస్టులు బదిలీ కౌన్సెలింగ్‌లో చూపడం లేదు. దీనివల్ల అర్హులైన ఉపాధ్యాయులు బదిలీలు కోరుకునే అవకాశం కోల్పోతారని చెబు తున్నారు. బ్లాక్‌ చేసిన పోస్టుల్లో అత్యున్నత స్థాయిలో వచ్చిన సిఫార్సు బదిలీలు చేస్తారని ఆరోపిస్తున్నారు. ఈ పోస్టుల్లో డీఎస్సీ 2008లో క్వాలిఫై అయిన మినిమం టై మ్‌స్కేల్‌ ఉపాధ్యా యుల్ని నియ మించాలనే విజ్ఞ ప్తులు కూడా ఉన్నాయి. వెబ్‌ కౌన్సెలింగ్‌ వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యక్ష కౌన్సెలింగ్‌లో ఎక్కడ ఏఏ ఖాళీలు ఉన్నాయనే విషయం తెలుస్తుందని, వెబ్‌ కౌన్సెలింగ్‌లో ఈ అవకాశం లేదనే వాదన ఉంది. దీనిపై డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని స్పదిస్తూ.. జిల్లాలో అన్ని ప్రాంతాల్లోని స్కూల్స్‌లో సమంగా ఉపాధ్యాయులు ఉండాలంటే కొన్ని పోస్టులు బ్లాక్‌ చేయడం తప్పదని పేర్కొన్నారు. లేకుంటే పల్నాడు, బాపట్ల, పిడుగురాళ్ళ వంటి సూదూర ప్రాంతాల్లోని స్కూల్స్‌లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వెబ్‌ కౌన్సెలింగ్‌పై ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

                POSTS BLOCKED

                బదిలీల జాబితా కొలిక్కి

                  0
                  • కమిషనర్‌కు పంపి అభ్యంతరాలు స్వీకరించే యోచన

                  న్యూస్ టోన్, గుంటూరు: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. దీంతో బదిలీ దరఖాస్తులను తిరిగి పరిశీలన చేసి అర్హుల జాబితాను రూపొందించారు. గతంలో రూపొందించిన బదిలీల సీనియారిటీ జాబితాలు సైతం తారుమారయ్యాయి. అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరు తప్పనిసరిగా బదిలీ అవుతారో కొత్త సవరణల ప్రకారం తిరిగి జాబితాలు రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా బదిలీల కోసం 5901 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 2102 మంది తప్పనిసరిగా బదిలీ అవుతారని తాజాగా తేల్చారు. తొలుత బదిలీ జీవోలు జారీ చేసినప్పుడు ఉపాధ్యాయుల స్టేషన్‌ పాయింట్లు, వారి సర్వీస్‌ పాయింట్లు, ప్రధానోపాధ్యాయుల బదిలీకి నిర్దేశించుకున్న అకడమిక్‌ ఇయర్లు వంటివి మార్పులు చేసి నూతన సవరణలు తీసుకొచ్చారు. దీంతో ఆ ప్రకారం తిరిగి జాబితాలు తయారు చేసినట్లు జిల్లా విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. తొలుత బదిలీ జీవోలు ఇచ్చినప్పుడు ఉపాధ్యాయుల సర్వీసుకు సంబంధించి గరిష్ఠంగా 30 ఏళ్లు తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత వచ్చిన సవరణల్లో దీన్ని 32 ఏళ్లకు పెంచడంతో కొందరు ఉపాధ్యాయులకు పాయింట్లు బాగా పెరిగాయి. స్టేషన్‌ పాయింట్ల విషయంలోనూ గతంలో గరిష్ఠంగా ఎనిమిదేళ్లకే తీసుకోవాలని నిబంధన ఉంది. దాన్ని ఎత్తివేసి వారు ఎన్ని సంవత్సరాలైతే ఒకే పాఠశాలలో పనిచేశారో ఆ కాలానికి పాయింట్లు ఇవ్వాలని సూచించారు. దీంతో ఆ మేరకు కొందరికి అదనపు పాయింట్లు వచ్చాయి. ప్రధానోపాధ్యాయుల బదిలీకి అకడమిక్‌ ఇయర్‌ అని తొలుత సూచించారు. కానీ దాన్ని మార్పు చేశారు. వీరికి సంబంధించి 18.11.2015కు ముందు ఏ పాఠశాలలో అయితే పని చేస్తున్నారో అప్పటి నుంచి ఐదేళ్లు పూర్తయితే వారిని బదిలీకి అర్హులుగా పేర్కొంటూ సవరణలు వచ్చాయి. ఈ ప్రకారం తిరిగి అర్హుల జాబితా తయారు చేయగా అదనంగా మరికొందరు ప్రధానోపాధ్యాయులు బదిలీకి అర్హులుగా తేలారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

                  వెబ్‌ ఆప్షన్‌లకు అవకాశం?

                  ప్రస్తుతం రూపొందించిన బదిలీల జాబితాను పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌కు పంపి వారి సూచనల మేరకు ఒకటి, రెండు రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణకు ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంచాలనే యోచనలో అధికారులు ఉన్నారు. గతంలో తయారు చేసిన జాబితాలపై సంఘాల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఈ నెల 11 నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం కల్పిస్తారని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టనుండడంతో కచ్చితంగా బదిలీలు ఉంటాయని భావిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు కొందరు బదిలీలపై తమకు విద్యా సంవత్సరం ప్రకారం సర్వీసును ప్రాతిపదికగా తీసుకుని బదిలీలు చేపట్టాలని కోర్టును ఆశ్రయించారు. ఒక్క గుంటూరు జిల్లా నుంచే 10 మందికి పైగా ప్రధానోపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. వీటిపై కోర్టు ఇచ్చే తీర్పులకు లోబడి బదిలీలు ఉంటాయా? ఉండవా అనేది ఆధారపడి ఉందని మరికొందరు అంటున్నారు. అధికారులు మాత్రం బదిలీల దిశగానే ఉన్నత స్థాయిలో కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు.

                  SENIORITY LISTS FINALIZED