Home Blog Page 389

ఆర్జీయూకేటీ సెట్‌కు 96 శాతం హాజరు

    0

    న్యూస్ టోన్, అమరావతి, నూజివీడు: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఆర్జీయూకేటీ-సెట్‌)కు 96శాతం మంది హాజరయ్యారు. 88,972 మంది దరఖాస్తు చేసుకోగా.. 85,760 మంది పరీక్ష రాశారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 97.61 శాతం మంది హాజరయ్యారు. తెలంగాణలోని కేంద్రాల్లో.. ఖమ్మంలో 95శాతం, నిజామాబాద్‌లో 86.6 శాతం మంది పరీక్ష రాశారు. ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలుంటే 7వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు ఆధారాలతోసహా వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఉపకులపతి హేమచంద్రారెడ్డి సూచించారు.

    RGUKT CET 96 ATTENDANCE

    పుస్తకాలు.. చదివిద్దాం

      0
      • ఆదివారం..కథా సమయం
      • గ్రంథాలయాల్లో విద్యార్థులతో సామూహిక పఠనం
      • 3-9 తరగతుల వారిలో నైపుణ్య పెంపుదలే లక్ష్యం

      ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేస్తూ విద్యార్థుల్లో పఠన నైపుణ్యం పెంచేందుకు ‘ఆదివారం కథా సమయం (సండే స్టోరీ టైమ్‌)’ పేరుతో గ్రంథాలయాల్లో పఠన కార్యక్రమానికి పాఠశాల విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 10- 12 గంటల మధ్య రెండు గంటలసేపు ముందుగా ఎంపిక చేసుకున్న కథలను చదవాల్సి ఉంటుంది. చదువంటే మా కిష్టం కార్యక్రమంలో భాగంగా దీనికి రూపకల్పన చేసినట్లు డీఈవో సీవీ రేణుక వెల్లడించారు. ఈ కార్యక్రమం అమలు కోసం ప్రజా గ్రంథాలయాలు, సామూహిక పఠన కేంద్రాల ప్రాంతాలను గుర్తించడంతో పాటు వాటిని సందర్శించి, ఉదయం 10 గంటలకు విద్యార్థులను ఆహ్వానించి కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ సామూహిక పఠనం చేయించాలి.

      సన్నద్ధమిలా..

      ●స్థానికంగా ఉండే గ్రంథాలయాలు, పుస్తక కేంద్రాల్లో (బుక్‌ డిపాజిట్‌ కేంద్రాలు) కాలనీలు, వీధుల్లో లేదా వార్డుల్లో సామూహిక పఠన సమావేశాలు నిర్వహించాలి. 

      ● గ్రంథ పాలకుడు, సచివాలయంలోని విద్య, సంక్షేమ సహాయకుడు, వాలంటీర్లతో ప్రధానోపాధ్యాయుడు సమావేశం ఏర్పాటు చేయాలి.

       ● స్థానికంగా ఉన్న 3 నుంచి 9 తరగతుల విద్యార్థులను సమావేశ పరచి ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య కార్యక్రమం కొనసాగించాలి. 

      ● ఆదివారం కథా సమయంలో పాల్గొనేలా ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు ప్రోత్సహించాలి. 

      ● స్థానిక గ్రంథాలయం నుంచి వీలైనంత వరకు బాలసాహిత్యం విభాగానికి చెందిన కథల పుస్తకాలను ఎంపిక చేసుకుని గ్రంథ పాలకుడు, విద్యా సంక్షేమ సహాయకులు, వాలంటీర్లలో ఒకరిని కథలను చదివేందుకు ఎంపిక చేయాలి. కథను చదివి వివరించిన తరువాత విద్యార్థులంతా అదే కథను పఠించాలి.

      WE LOVE READING STORY TIME

      ఏం చదువుకున్నారు?

        0
        • ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఈ నెలలో ఇంటింటి సర్వే

        న్యూస్ టోన్, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో వివరాల సేకరణకు ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు ప్రయోగాత్మకంగా మంగళగిరి, తాడేపల్లిలో ఇప్పటికే సర్వే నిర్వహించారు. ఇది విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో చేపట్టనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖలోని క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్లు, గ్రామ, వార్డు సచివాలయ విద్య, సంక్షేమ సహాయకులకు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీరు వాలంటీర్లకు తర్ఫీదు ఇస్తారు. ఈ-ప్రగతి విభాగంతో కలిసి ఈ సర్వే చేస్తున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో ట్యాబ్‌ ద్వారా వివరాలను సేకరించనున్నారు. సర్వే పూర్తయ్యాక విశ్లేషించి, నివేదిక రూపొందించనున్నారు.

        చదువు ఎందుకు ఆపేస్తున్నారు

        ఉన్నత విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి(జీఈఆర్‌) చాలా తక్కువగా నమోదవుతోంది. కొన్నేళ్లుగా ఇందులో మార్పు ఉండటం లేదు. ‘అఖిల భారత ఉన్నత విద్య సర్వే’ ఏటా గణాంకాల్ని విడుదల చేస్తోంది. జాతీయస్థాయితో పోలిస్తే మెరుగ్గా ఉన్నా అనుకున్న స్థాయిలో ఉన్నత విద్యలో ప్రవేశాలు ఉండటం లేదు. రాష్ట్రంలో 32.4 శాతం మందే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో మహిళలు తక్కువ. ఎంతమంది ఎక్కడి దాకా చదువుకున్నారు? ఆపేయడానికి గల కారణాల్ని ఇంటింటి సర్వే ద్వారా గుర్తించనున్నారు. సర్వేలో సేకరించిన డేటాను అన్ని శాఖలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఏం చదువుకున్నారనే వివరాలు సేకరిస్తారు. ఆధార్‌, ఫోన్‌ నంబర్లు సహా వీటిని తీసుకుంటారు కాబట్టి సర్వేలో తప్పులు జరిగేందుకు ఆస్కారం ఉండదు. బడి మధ్యలో మానేస్తున్న వారు.. ఇంటర్‌ తర్వాత చదువు నిలిపివేస్తున్న వారు.. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారు.. ఇలా అందరి వివరాలు సేకరిస్తారు. 19 అంశాలకు సంబంధించి వివరాలు అడుగుతారు.

        SURVEY ON HIGHER EDUCATION

        ఉన్నత విద్య పరిస్థితులపై ఇంటింటి సర్వే

          0
          • నేడు సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్

          న్యూస్ టోన్, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఉన్నత విద్యామండలి ఇంటింటి సర్వే చేపట్టనుంది. ఇందుకోసం పాఠశాల విద్యా శాఖలో క్లస్టర్‌ రిసోర్సు పర్సన్లు(సీఆర్పీ), గ్రామ, వార్డు విద్య, సంక్షేమ సహాయకుల సేవలను వినియోగించుకోనుంది. సర్వేపై మొదట సీఆర్పీలకు శిక్షణ ఇస్తారు. వీరు విద్య, సంక్షేమ సహాయకులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటింటి సర్వేపై శనివారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రం లోని అందరు ఎం.ఈ.ఓ లకు, సీ.ఆర్.పీ ల తో ఈ కార్యక్రమం మీద ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వీడియో  కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

          HOUSEHOLD SURVEY ON HIGHER EDUCATION

          ఖాళీల కంగాళీ

            0
            • ఖాళీల్లో ఎస్‌ఏ-10 శాతం, ఎస్జీటీ-5 శాతం బ్లాక్‌కు చర్యలు
            • పరిశీలనాంతరం663 పోస్టుల నిలిపివేత
            • డీఈవో బ్లాగ్‌లో సీనియార్టీ జాబితా

            ఉపాధ్యాయ బదిలీ దరఖాస్తుల ప్రక్రియ పూర్తైనప్పటికీ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. గతంలో క్లియర్‌ వేకెన్సీలు, రేషనలైజేషన్‌ ఖాళీలు ఇలా ప్రతిదీ చూపించి ఆ మేరకు బదిలీలు కోరుకునే అవకాశం కల్పించేవారు. ఈ సారి ప్రతి మండలంలో ఉన్న మొత్తం ఖాళీల్లో ఎస్జీటీలో ఐదుశాతం, పాఠశాల సహాయకుల్లో పదిశాతం బ్లాక్‌ చేశారు. మండల విద్యాధికారులు 853 పోస్టులను బ్లాక్‌ చేయగా జిల్లా విద్యాధికారి మరోసారి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ఈ సంఖ్యను 663కు తగ్గించారు. మిగిలిపోయిన ఖాళీలను తిరిగి ఎలా నింపుతారని ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. బ్లాక్‌ చేసిన ఖాళీలను సిఫార్సు బదిలీలతో భర్తీ చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ బదిలీల్లో గ్రామాలకు రహదారి, రవాణా సౌకర్యం లేకుండా ఉన్నవి 150కి పైగా పాఠశాలలను కేటగిరి-4గా గుర్తించారు. 

            న్యూస్‌ టోన్, కర్నూలు విద్య: ప్రతి మండలంలో కేటగిరి 1, 2, 3 పోస్టుల్లో పది శాతం ఖాళీలను రిజర్వు చేయాలనే విద్యాశాఖ నుంచి ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయిలో ఎంఈవోలు ఎక్కువ సంఖ్యలో బ్లాక్‌ చేయడంతో విమర్శలు వచ్చిన నేపథ్యంలో విద్యాధికారులు మరోసారి పరిశీలించి 190 పోస్టులు ఓపెన్‌ చేశారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు తగ్గించడానికే నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నా వీటిపైనే ఆశలు పెట్టుకున్న సీనియర్‌ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ధ్రువపత్రాల పరిశీలనాంతరం తాత్కాలిక సీనియార్టీ జాబితా మేరకు ఖాళీల ఎంపిక జరగనుంది. స్పష్టత ఇవ్వని అధికారులు బదిలీల్లో అనుసరిస్తున్న విధానాలు ఉపాధ్యాయుల్లో కొందరికి ప్రయోజనం చేకూరుస్తుండగా..ఇంకొందరికి నష్టం కలిగిస్తున్నాయి. అన్ని కేటగిరిల్లో కంటే ఎస్జీటీలే ఎక్కువ సంఖ్యలో బదిలీ కానున్నారు. తప్పనిసరి కావాల్సిన 2264 మంది ఉపాధ్యాయుల్లో 80 శాతం ఎస్జీటీలే ఉన్నారు. దీంతో 1798 ఖాళీ పోస్టుల్లో అధికారులు 439 పోస్టులను పలు కారణాలతో బ్లాక్‌ చేశారు. ఈ కేటగిరి బదిలీలు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఐదు విద్యా సంవత్సరాల స్థానంలో సర్వీసును పరిగణనలోకి తీసుకోవడంతో 14 మంది మాత్రమే తప్పనిసరి బదిలీ కావాల్సి వస్తోంది. స్టేషన్‌ సీనియార్టీ సీలింగ్‌ పాయింట్లు తొలగించడంతో 2132 మంది ఎస్జీటీ, పాఠశాల సహాయకులు లబ్ధి పొందనున్నారు. కౌన్సెలింగ్‌ విధానంపై ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌పై స్పందించి  గతనెల 30న ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌పై డెమో ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇంతవరకు చేపట్టలేదు.

            *నవంబరు 28 నుంచి కొత్త షెడ్యూల్‌్ ప్రారంభమైంది. ప్రొవిజన్‌ సీనియార్టీ జాబితాను గురువారం ఆన్‌లైన్‌లో పొందుపరిచారు.

            * జిల్లాలో కచ్చితం -2,195 మంది, విన్నపం – 4,144 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు.

             *ప్రిఫరెన్షియల్‌ కేటగిరిలో 266 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 36 మంది ఆరోగ్య సమస్యలు, 59 మంది వ్యక్తిగత సమస్యలు, 76 మంది పెళ్లికానివారు, ఇతరులు.

            * స్పౌజ్‌ కేటగిరిలో 721 మంది దరఖాస్తు చేసుకున్నారు. విద్యాశాఖ ప్రాథమిక దశలోనే తప్పులను అడ్డుకోగలుగుతోంది.

            * ఏమైనా అభ్యంతరాలుంటే సోమవారం వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాధికారులు  చెబుతున్నారు.

            NO OBJECTIVE VACANCIES

            నిమిషం లేటైనా నోఎంట్రీ

              0

              • నేడు ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష

              ఒంగోలు విద్య, డిసెంబరు 4: ట్రిపుల్ ఐటీల్లో 2020-21 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు మొదటిసారిగా శనివారం పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఇది జరుగుతుంది. విద్యార్థులు ఉద యం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభ సమయానికి నిమిషం లేటుగా వచ్చినా అనుమతించేదిలేదని డీఈవో వి.ఎస్.ను బ్బారావు తెలిపారు. జిల్లాలో ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షకు 7,302మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం 59 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశ్న పత్రాలను 40 పోలీసు స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష నిర్వహణలో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఒక్కో గదికి కేవలం 16మందినే కేటాయించాలని డీఈవో ఆయా కేంద్రాల చీఫ్లు, డీవోలను ఆదేశించారు. విద్యార్థులు హాల్ టిక్కెట్ తోపాటు, ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తీసు కురావాలి. మొబైల్ ఫోన్లు, వాచ్, కాలుక్యులేటర్లు, ఇతర పరికరాలు తీసుకురాకూడదు. అంధ విద్యార్థులకు సహాయకులుగా 9వతరగతి విద్యార్థులను నియమించి పరీక్ష రాయించాలి. విద్యార్థులు జవాబులను బ్లాక్ లేదా బ్లూ బాల్పయింట్ పెన్నుతో మాత్రమే బబుల్ చేయాలని డీఈవో తెలిపారు.

              NO ENTRY AFTER 1 MINUTE RULE FOR IIIT ENTRANCE TEST

              బడిసంచి ఇక తేలిక

                0
                • తరగతుల వారీగా స్కూలు బ్యాగ్‌ బరువును ప్రకటించిన కేంద్రం
                • నిపుణుల సిఫార్సులతో ‘స్కూలు బ్యాగ్‌ పాలసీ–2020’ విడుదల
                • విద్యార్థి శరీర బరువులో బ్యాగ్‌ 10 శాతానికి మించకూడదు
                • స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, మంచినీరు తప్పనిసరి
                • అక్కడే హోమ్‌వర్కు చేసేలా సమయం సర్దుబాటు
                • తరగతుల వారీగా పాఠ్యపుస్తకాల సంఖ్య నిర్ణయం

                అమరావతి: పాఠశాలల్లో విద్యార్థులపై పెనుభారంగా మారిన స్కూలు బ్యాగు బరువు ఇక తగ్గనుంది. వారికి శారీరక సమస్యలతో పాటు ఒత్తిడికి, అలసటకు కారణమవుతున్న స్కూలు బ్యాగ్‌కు సంబంధించి కీలకమైన విధాన నిర్ణయాన్ని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. మద్రాస్‌ హైకోర్టు తీర్పుమేరకు కేంద్ర విద్యాశాఖ.. ఎన్‌సీఈఆర్టీ, కేవీఎస్, ఎన్‌వీఎస్, సీబీఎస్‌ఈ సంస్థల నిపుణుల సూచనల మేరకు ‘స్కూలు బ్యాగ్‌ పాలసీ–2020’ని వెలువరించింది.  దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని పేర్కొంది. ఈ పాలసీ ప్రకారం విద్యార్థి కేంద్రంగా బోధనాభ్యసన ప్రక్రియలు సాగే పద్ధతి ద్వారా పిల్లల్లో ఒత్తిడి, స్కూలు బ్యాగ్‌ బరువు తగ్గుతాయి. అనేక సర్వేల్లో స్కూళ్లలో విద్యార్థి కేంద్ర అభ్యసనం కన్నా పుస్తకాలు, టీచర్ల బోధన కేంద్రంగా మారిపోతుండడమే బ్యాగ్‌ బరువు పెరగటానికి కారణంగా తేలింది. బ్యాగ్‌ల బరువును తగ్గించడానికి పలు రాష్ట్రాలు సెమిస్టర్‌ పద్ధతి, పుస్తకాలను స్కూళ్లలోనే ఉంచేలా చేయడం వంటి విధానాలు అవలంభిస్తున్నా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. విద్యార్థుల స్కూలు బ్యాగ్‌కు తరగతుల వారీగా పరిమితులు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పులు వెలువరించినా సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. స్కూలు బ్యాగ్‌  బరువు కారణంగా పిల్లలు వెన్నెముక సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు కారణంగా శారీరక సమస్యలు రావడంతో వారి చదువులపై ప్రభావం చూపుతోంది. దీంతో కేంద్రం స్కూల్‌ బ్యాగ్‌ పాలసీని ప్రకటించి అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచించింది.

                అంతర్జాతీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..

                పిల్లల శరీర బరువును అనుసరించి స్కూలు బ్యాగ్‌ బరువు ఉండాలని పలు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. 2009లో అమెరికన్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ అసోసియేషన్‌ (ఏవోటీఏ), అమెరికన్‌ ఫిజియోథెరపీ అసోసియేషన్‌ (ఏపీటీఏ)లు విద్యార్థుల శరీర బరువులో 15 శాతం మేర మాత్రమే స్కూలు బ్యాగ్‌ ఉండాలని సూచించాయి. ద అమెరికన్‌ చిరోప్రాక్టీస్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) పిల్లల శరీర బరువులో 5 నుంచి 10 శాతానికి మించి ఉండరాదని పేర్కొంది.

                మన దేశంలో పరిస్థితి ఇలా..

                స్కూల్‌ బ్యాగ్‌ బరువుకు సంబంధించి దేశంలోని పరిస్థితిపై కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించి పలు సమస్యలను గుర్తించాయి. 1 నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లల బరువులో పదిశాతానికి సమానంగా 2 నుంచి 3 కిలోల బరువు మాత్రమే ఉండాల్సి ఉన్నా వారి బ్యాగ్‌లు 5 కిలోలకు మించిన బరువుతో ఉంటున్నాయి. 6వ తరగతి విద్యార్థులకు 6 కిలోల బరువు వరకు ఇబ్బంది లేదు. కానీ వీరి బ్యాగ్‌లలోని వస్తువుల బరువు ఇలా ఉంటోంది.
                పాఠ్యపుస్తకాలు – 1 నుంచి 3.5 కిలోలు
                నోట్సులు – 1 నుంచి 2.5 కిలోలు
                లంచ్‌బాక్స్‌ – 250 గ్రా. నుంచి 1 కిలో
                వాటర్‌ బాటిల్‌ – 200 గ్రా. నుంచి 1 కిలో
                బ్యాగు బరువు – 150 గ్రా. నుంచి 1 కిలో

                ఇక పైతరగతులకు వెళ్లేకొద్దీ ఈ బ్యాగ్‌ బరువు ఇంకా పెరుగుతోంది. దీంతో విద్యార్థులు అలసటకు గురవడమే కాకుండా శారీరక సమస్యలతో చదువులపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. మంచినీటి సదుపాయం, మధ్యాహ్న భోజనం అమలయ్యే స్కూళ్లకు వెళ్లేవారికి ఆ రెండింటి బరువు తగ్గుతున్నా చాలా ప్రయివేటు పాఠశాలల్లో ఆ సదుపాయాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కొన్ని స్కూళ్లు పిల్లలతో బడిలోనే హోంవర్కు చేయిస్తూ నోట్సులు, వర్కు పుస్తకాలను స్కూల్లోనే ఉంచుతున్నాయి. ఇంటి దగ్గర హోంవర్కు చేయాల్సి వస్తే ఒకే పుస్తకంలో అన్ని సబ్జెక్టులవి చేయిస్తున్నాయి. కొన్ని స్కూళ్లు రోజు విడిచి రోజు స్కూలు బ్యాగ్‌ తెచ్చేలా ఏర్పాట్లు చేశాయి. సెకండరీ, హయ్యర్‌ సెకండరీ తరగతులకు వచ్చేసరికి వివిధ సబ్జెక్టులతో పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కు పుస్తకాలు పెరిగిపోతున్నాయి.

                కొత్త విధానంలో పలుసూచనలు

                కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం స్కూలు బ్యాగ్‌ బరువు తగ్గించేందుకు పలు సూచనలు చేసింది.
                – బ్యాగ్‌ను రెండు వైపులా భుజాలపై ఉండేలా రూపొందించాలి.
                – స్కూళ్లలో విద్యార్థులకు లాకర్లు, దివ్యాంగుల కోసం బుక్‌బ్యాంక్‌ ఏర్పాటు చేయాలి.
                – నేషనల్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ సూచనల ప్రకారం లైఫ్‌స్కిల్స్, కంప్యూటర్, మోరల్‌ ఎడ్యుకేషన్, జనరల్‌ నాలెడ్జి వంటి పాఠ్యపుస్తకాలు స్కూళ్లలోనే ఉంచేలా ఏర్పాట్లు చేయాలి.
                – స్కూలు బ్యాగ్‌ బరువు తగ్గేందుకు వీలుగా తరగతుల టైమ్‌టేబుల్‌ను మార్చుకోవాలి.
                – ఒకే సబ్జెక్టు వరుసగా రెండు పీరియడ్లు ఉండేలా చూడడం వంటి విధానలు పాటించాలి.
                – పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కుపుస్తకాల బరువును అనుసరించి నిర్ణీత పరిమితి మేరకు మాత్రమే బ్యాగ్‌ బరువు ఉండేలా టైమ్‌టేబుల్‌ రూపొందించాలి.
                – 1, 2 తరగతులకు ఒకే నోట్‌ పుస్తకం అమలుచేయాలి.
                – 3, 4, 5 తరగతులకు రెండు నోట్‌ పుస్తకాలు పెట్టాలి. ఒకదాన్ని బ్యాగ్‌లో ఉంచి, రెండోది స్కూల్లోనే ఉండేలా చూడాలి.
                – 6, 7, 8 తరగతుల వారికి లూజ్‌ పేపర్లలో క్లాస్‌వర్క్‌ చేసేలా ఫైల్‌ను ఏర్పాటుచేయాలి. 6వ తరగతి నుంచే ఈ వర్కు పేపర్లను ఒక పద్ధతిలో రాసేలా చేయాలి.
                – పాఠ్యపుస్తకాలకు మించి ఇతర పుస్తకాలను స్కూలులో అనుమతించరాదు.
                – స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అమలు, మంచినీటి సదుపాయం ఏర్పాటు ద్వారా విద్యార్థులు వాటిని ఇళ్లనుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఆ బరువు తగ్గుతుంది.

                ఈ సూచనలు అమలైతే విద్యార్థులకు మేలు

                స్కూలుకు వెళ్లే పిల్లల బ్యాగ్‌ వారు మోసే శక్తికి మించి ఉంటోంది. దీనివల్ల విద్యార్థులు విపరీతమైన శారీరక శ్రమ, అలసటకు గురవుతున్నారు. ఇది వారి చదువుపై వ్యతిరేక ప్రభావం చూపిస్తోంది. ప్రయివేటు విద్యాసంస్థలు పాఠ్యపుస్తకాలకు అదనంగా ఇతర పుస్తకాలు ఇవ్వడం వారిని మరింత ఇబ్బంది పెడుతోంది. కేంద్రం ప్రకటించిన స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ సమగ్రంగా అమలవ్వాలి. విద్యార్థి శక్తిని అనుసరించి స్కూలు బ్యాగ్‌ బరువు ఉండాలి. వారి శరీర బరువును అనుసరించి ఈ బ్యాగ్‌ బరువు నిర్ణయించడం మంచి పద్ధతి. ఈ పాలసీలోని ఇతర సూచనలను కూడా అన్ని విద్యా సంస్థలు పాటించాలి.
                – ప్రొఫెసర్‌ జీ జానకిరామయ్య, ఎడ్యుకేషన్‌ విభాగాధిపతి, ఎస్వీ యూనివర్సిటీ

                ఈ పాలసీ మేరకు ముందుకెళ్లాం

                విద్యార్థులపై బ్యాగుల బరువు లేకుండా చేయాలన్న చర్చ చాలాకాలంగా ఉంది. పలు సంస్థలు, కమిటీలు అధ్యయనాలు జరిగి అనేక సిఫార్సులు ఇచ్చాయి. మన రాష్ట్రంలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. నో బ్యాగ్‌డేను అమలు చేయడంతో పాటు పాఠ్యపుస్తకాల బరువు తగ్గేందుకు సెమిస్టర్‌ విధానాన్ని అనుసరిస్తున్నాం. విద్యార్థులు అవసరమైన పుస్తకాలు మాత్రమే ఇళ్లకు తీసుకువెళ్లి తక్కిన వాటిని స్కూళ్లలోనే ఉంచుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం హోమ్‌ వర్కుతో పాటు ముఖ్యమైన పుస్తకాలు మాత్రమే ఇళ్లకు తీసుకువెళ్లేలా చర్యలు చేపడుతున్నాం. కేంద్రం ఇచ్చిన విధానపత్రాన్ని అనుసరించి ముందుకు వెళ్తాం.
                – డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి, డైరెక్టర్, రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి  

                WEIGHT LESS SCHOOL BAG POLICY

                సిపిఎస్ రద్దు చేయండి

                  0

                  మండలిలో పిడిఎఫ్ డిమాండ్

                  అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం(సిపిఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని పిడిఎఫ్ సభ్యులు డిమాండ్ చేశారు. ‘ఉద్యోగుల సంక్షేమం-ప్రభుత్వ విధానం’ పై శాసన మండలిలో గురువారం జరిగిన చర్చలో పిడిఎఫ్ పక్షనేత వి బాలసుబ్రహ్మణ్యం, సభ్యులు ఐ వెంకటేశ్వరరావు, యండపల్లి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. సిపిఎసను వారం రోజుల్లో రద్దు చేస్తామని వైసిపి ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా కమిటీలతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఢిల్లీ ప్రభుత్వం సిపిఎస్ అవసరం లేదని అసెంబ్లీలో తీర్మానించిందని, రాష్ట్రప్రభుత్వం కూడా ఇలాంటి తీర్మానం చేస్తుందా అని ప్రశ్నించారు. ఎప్పటిలోగా సిపిఎస్ రద్దు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2018 జులై 1 నుంచి 11వ పిఆర్సి ఉద్యోగులకు అమలు కావాల్సి ఉందని, దీనిని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలనికోరారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలతో ప్రభుత్వం చర్చించలేదని గుర్తుచేశారు. కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ విధానంపై ఒక పాలసీ ప్రకటించాలని కోరారు. కరోనా కాలంలో ప్రైవేట్ విద్యరంగంలో పనిచేసే 3లక్షల మంది సిబ్బందికి జీతాలు అందలేదని, వారిని ఆదుకోవాలని కోరారు ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సిపిఎస్ రద్దు రాష్ట్రప్రభుత్వం నియమించిన వర్కింగ్ కమిటీ పరిశీలనలో ఉందని చెప్పారు.

                  ABOLISH CPS DEMAND

                  25వేల మంది డీఎడ్ విద్యార్థులకు సర్కార్ మేలు

                    0

                    న్యూస్ టోన్, అమరావతి: ప్రైవేటు డీఎడ్ కాలేజీల అక్రమాలతో ఆయా విద్యా సస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. ఇటువంటి విద్యార్థులకు నిలిపేసిన పరీక్షలను నిర్వహిం చనుంది. దీనివల్ల 25 వేల మంది (2018-20 బ్యాచ్) డీఎడ్ విద్యార్థులకు మేలు చేకూరుతుందని విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేశ్ గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మండలిలో బదులిచ్చారు. డీఎపాటు ఎల్పీజీ విద్యార్థులు పరీక్షలు రాయడానికి అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే, ‘2018-20 డీసెట్ ను 18 వేల మంది రాయగా వేల మంది మాత్రమే అర్హత సాధించారు. దీంతో డీసెట్ అర్హత మార్కులను తగ్గించేలా అప్పటి ప్రభుత్వంలోని వారికి ముడుపులు ఇచ్చి మరికొంతమందికి అర్హత వచ్చేలా కాలేజీలు చేశాయి. ఇలా 14.530 మంది సీట్లు పొందారు. ఆ తర్వాత మరో వేల మంది నుంచి రూ.లక్షలు చొప్పున వసూలు చేసి అనధికారికంగా చేర్చుకున్నాయి. ఇటీవల అధికారిక ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇతర విద్యార్థులకు పరీక్షలు పెట్టాలని యాజమాన్యాలు కోర్టును ఆశ్ర యించినా వారికి చుక్కెదురైంది. కాలేజీల తప్పునకు విద్యార్థులు నష్టపోకుండా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం లబ్ది చేకూరనుంది’ అని చెప్పారు.

                    FAVOUR FOR 25K D.Ed STUDENTS

                    2008 డిఎస్ సి అభ్యర్థులకు న్యాయం చేయాలి

                      0

                      అమరావతి బ్యూరో: డిఎస్సి 2008లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని
                      నిరుద్యోగ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలోని అలంకార్ సెంటర్ లో వివిధ జిల్లాల నుండి వచ్చిన 2008 డిఎస్సీ క్వాలిఫై అభ్యర్థులు జగనన్న మీద ఆలక పేరుతో నిరసన దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా బిఇడి నిరుద్యోగ అభ్యర్థుల సంఘం కన్వీనర్ వెలుగుజ్యోతి మాట్లాడారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన జంబో డిఎస్ సిలో బిఇడి అభ్యర్థులకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. వందకు 77 మార్కులు వచ్చినా ఉద్యోగం ఇవ్వలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 2008 డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తామని మే నెలలో వివరాలను తీసుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి 2008లో అన్యాయానికి గురైన 2193 మంది నిరుద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని అన్నారు. ఈ దీక్షా శిబిరానికి విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ వెంకట్రామిరెడ్డి వచ్చి అభరులతో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తమతో మాట్లాడమని తనను పంపారని చెప్పారు. తమ అభ్యర్ధనను ప్రభుత్వం పరిశీలిస్తోందని అభ్యర్థులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిమ్మమరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

                      JUSTICE FOR DSC 2008 CANDIDATES