Home Blog Page 387

MDM Dash Board: మధ్యాహ్న భోజనం, టాయ్లెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంస్ డాష్ బోర్డులు

    0
    • జగనన్న గోరుముద్ద వెబ్ సైట్ లో మూడు రకాల డాష్ బోర్డులు ఏర్పాటు
    • మధ్యాహ్న భోజనం, టాయ్లెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంస్ డాష్ బోర్డులు
    • మీరు సబ్మిట్ చేసిన డేటాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంస్ రేటింగ్ ఇస్తుంది.
    • ఏ.టి.ఆర్ మాడ్యూల్ లో రైజ్ అయిన టికెట్స్ ను స్కూల్ స్థాయి లో రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది.

    Also Read: ఎం.డి.ఎం, టి.ఎం.ఎఫ్ డాష్ బోర్డు లో ఉన్న టికెట్స్ ను తెలుసుకునే విధానం

    ఈ క్రింది మెసేజ్ చదివి టికెట్స్ ను స్కూల్ స్థాయి లో రిజాల్వ్ చేయాల్సిన ఆవశ్యకతను తెలుసుకోన్డి.

    All the MEOs and mandal teams to concentrate clearing of tickets pending with HMs.So many issues pending with  HMs regarding sanitation.
    All should go through the dash board at the following website http://jaganannagorumudda.ap.gov.in/MDM
    The tickets pending can be seen at  “ATR analysis” for jaganannagorumudda for MDM related tickets pending and  at TMF   for sanitary related pending tickets…
    U can see school-wise and mandal-wise tickets pending.

    All should respond on this immediately… 

    ఇక్కడ క్లిక్ చేసి మీ స్కూల్ స్థాయి లో పెండింగ్ టికెట్స్ ఉన్నాయో లేదో తెలుసుకొండి.

    చదవడం మాకిష్టం ప్రారంభ పరీక్ష వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసే విధానం WE LOVE READING BASELINE TEST ONLINE DATA ENTRY PROCESS

      0

      Step 1: Go to https://schooledu.ap.gov.in/SIMSSERVICES21/

      Base Line Test Details: చదవడం మాకిష్టం ప్రారంభ పరీక్ష పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

      Step 2: Login with Child Info User ID (UDISE Code) & Child Info Password

      Step 3: Click On Services >> Click On S3 – Base Line Marks Entry

      Step 4: Enter Child ID then Click on Get Details (If you entered 1st, 2nd, 10th Class Child ID’s No Details Found Screen Will Appear)

      Step 5: Select Level in Telugu & English then Click on Save Details Button

       Repeat this process for every child. Thanq

      చదవడం మాకిష్టం ప్రారంభ పరీక్ష వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసే విధానం WE LOVE READING BASELINE TEST ONLINE DATA ENTRY PROCESS

      రెండవ శనివారం పని దినం – ఉత్తర్వులు విడుదల ULB 2nd Saturday is a Working Day

        0

        రెండవ శనివారం (13.03.2021) పని దినం – ఉత్తర్వులు విడుదల. 

        All  the  Regional  Joint  Directors  of  School  Education  and  the  District Educational Officers in the State is hereby informed that, the undersigned has accorded  permission  to  open  those  schools/educational  institutions  that  have declared holiday for elections (Urban Local Bodies (ULBs), 2021) shall run the schools on 13.03.2021 (second Saturday) due to less no.of instructional hours (working  days)  available  for  the  academic  year  2020-21  and  interest  of  the students  for  better  learning  outcomes  in  the  matter.  However,  students  will attend schools with the consent of their parents only.
        2.       In view of the above, the under mentioned officers are requested to take immediate necessary action accordingly and ensure strict enforcement of the of guidelines/ Standard Operating Procedures (SOPs) for all activities in the schools issued by the Government and ensure strict compliance on COVID Appropriate behavior such as, wearing of masks by all children, teachers and non-teaching staff, keeping physical/social distancing, frequent washing of hands, etc., in the schools without fail.

        ఇక్కడ క్లిక్ చేసి ఉత్తర్వులు డౌన్లోడ్ చేసుకొండి

        రెండవ శనివారం పని దినం – ఉత్తర్వులు విడుదల ULB 2nd Saturday is a Working Day

         

        ఆ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. సులభంగా డిగ్రీ పూర్తి చేసేందుకు ‘వన్ టైం ఛాన్స్’.. దరఖాస్తుకు మూడు రోజులే గడువు DEGREE BACKLOG CHANCE

          0

          Osmania University: ఏళ్ల
          క్రితం డిగ్రీ చదివి సబ్జెక్టులన్నీ పాస్ కాలేక పోయి.. పట్టా అందుకోలేక
          పోయిన విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అందుకు
          సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

          చాలా మంది ఏళ్ల క్రితం డిగ్రీ చదివి.. వివిధ పరిస్థితుల నేపథ్యంలో నిర్ణీత
          గడువులోగా సబ్జెక్టులన్నీ పాస్ కాలేక పట్టాను అందుకోలేకపోతారు. గడువు
          పూర్తి కావడంతో వారి డిగ్రీ క్యాన్సెల్ అవుతుంది.

          దీంతో అలాంటి వారు మళ్లీ డిగ్రీ పట్టా పొందాలంటే నూతనంగా మళ్లీ అడ్మిషన్
          తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారికి ఉస్మానియా యూనివర్సిటీ గుడ్ న్యూస్
          చెప్పింది.

          యూనివర్సిటీ పరిధిలో గతంలో బ్యాక్ లాగ్స్ ఉండి డిగ్రీ(అండర్ గ్రాడ్యుయేషన్)
          పట్టా పొందలేకపోయిన విద్యార్థులకు ‘వన్ టైం ఛాన్స్’ కల్పిస్తోంది. రీ
          అడ్మిషన్ పొందకుండా గతంలో మిగిలిన సబ్జెక్టులకు మాత్రమే ఫీజులు చెల్లించి
          పరీక్షలను రాసే అవకాశం కల్పించింది.

          30 ఏళ్ల క్రితం డిగ్రీ చదివి అప్పట్లో సబ్జెక్టులు మిగిలి పోయిన వారు కూడా
          పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తూ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం
          విద్యార్థులు అప్లై చేసుకోవడానికి మార్చి 15 వరకు గడువు విధించారు.ఇందు కోసం సబ్జెక్టులు, డిగ్రీ చదివిన సంవత్సరం ఆధారంగా అధికారులు ఫీజులు
          నిర్ణయించారు. 2002-2012 మధ్య డిగ్రీ చదివి బ్యాక్ లాగ్ లు ఉన్న
          విద్యార్థులైతే సబ్జెక్టుకు రూ. 6 వేలతో పాటు రెండు పేపర్ల వరకు అదనంగా
          రూ.710, మూడు పేపర్లు ఆ పైనా ఉంటే అదనంగా రూ.1010 ఫీజుగా చెల్లించాల్సి
          ఉంటుంది.1988-2002 మధ్య విద్యార్థులైతే సబ్జెక్టుకు రూ. 10 వేలు చెల్లించాల్సి
          ఉంటుంది. రూ. 200 ఆలస్య రుసుంతో మార్చి 19 వరకు ఫీజు చెల్లించే అవకాశం
          కల్పించారు. ఇందుకు సంబంధించిన పరీక్షలు ఏప్రిల్ లో నిర్వహించనున్నట్లు
          యూనివర్సిటీ అధికారులు తెలిపారు.వివరాలకు యూనివర్సిటీ ఎగ్జామ్ బ్రాంచ్ ను సంప్రదించాలని లేదా యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు.ఇదిలా ఉంటే యూనివర్సిటీ గతంలో బ్యాక్ లాగ్స్ మిగిలిపోయిన విద్యార్థుల కోసం
          వన్ టైం చాన్స్ కల్పించడంపై విద్యార్థుల నుంచి హర్షం వ్యక్తం అవుతున్నా..
          ఫీజులు భారీగా నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.దీనిపై ఓ విద్యార్థి కోర్టును సైతం ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే
          కోర్టు ఫీజులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే ఆ మొత్తాన్ని విద్యార్థులకు
          తిరిగి చెల్లిస్తామని అధికారులు తెలిపారు.

          ఆ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. సులభంగా డిగ్రీ పూర్తి చేసేందుకు ‘వన్ టైం ఛాన్స్’.. దరఖాస్తుకు మూడు రోజులే గడువు DEGREE BACKLOG CHANCE

          స్కూల్స్ లో ఆయాల నియామకానికి మార్గదర్శకాలు విడుదల GUIDELINES FOR AYAHS ENGAGEMENT

            0
            • ఆయాల నియామకానికి మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
            • 60 ఏళ్ళు దాటిన వారికి నో చాన్స్
            • నెలకు 6000 వేలు చొప్పున 10 నెలల పాటు గౌరవ వేతనం
            • మిగిలిన రెండు నెలలకు 3000 చొప్పున గౌరవ వేతనం
            • మొదటి ప్రాధాన్యత స్కూల్లో చదివే విద్యార్థి తల్లికే

            న్యూస్ టోన్, అమరావతి: ఆయాల నియామకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు జీఓ 22 ను విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుడితి రాజ శేఖర్ విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల్లో స్కూల్స్ లో ఆయాల నియామకానికి సంబంధించిన పూర్తి అధికారాలను పేరెంట్స్ కమిటీ కి అప్ప చెప్పారు. పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకొండి.

            ఉత్తర్వులు డౌన్లోడ్ చేసుకొండి.

            ప.గో జిల్లా లో రెండవ శనివారం సెలవు పై క్లారిటీ ?! CLARITY ON SECOND SATURDAY HOLIDAY

              0

              ప.గో జిల్లా లో రెండవ శనివారం సెలవు పై క్లారిటీ ప్రయత్నం.

              ఈ మేరకు తాము జిల్లా విద్యా శాఖాధికారిణి వారితో మాట్లాడినట్లు గా యూ.టి.ఏఫ్ నాయకులు సందేశం ద్వారా తెలిపారు. ఈ సందేశం యొక్క సారాంశం ఈ క్రింది కలదు.

              UTFWG:
                ఈ నెల రెండోవ శని వారం సెలవు కు సంబంధించి డి ఈ ఓ గారితో యూటీఎఫ్ జిల్లా కమిటీ మాట్లాడడం జరిగింది.ఆ రోజు సెలవు గానే పరిగణించ వలెనని మేడం చెప్పడం జరిగింది.ఎం ఈ ఓ లు ఎవరైనా అభ్యంతరం పెడితే డి ఈ ఓ గారితో మాట్లాడమని చెప్పండి.

              ప.గో జిల్లా లో రెండవ శనివారం సెలవు పై క్లారిటీ ?! CLARITY ON SECOND SATURDAY HOLIDAY

              కిడ్నీ సమస్యను గుర్తించడమెలా? ఈ సమస్యకు పరిష్కార మార్గాలేమిటి? తెలుసుకోండి WORLD KIDNEY DAY 2021 KIDNEY PROBLEMS PRECAUTIONS

                0

                మన దేశ జనాభాలో 10 శాతం మంది
                దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారని నివేదికలు స్పష్టం
                చేస్తున్నాయి. వీటన్నింటికి ప్రధాన కారణం మనం కిడ్నీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ
                వహించకపోవడమే.

                ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. దీని
                నిర్మూలనకు, ప్రజల్లో కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఏటా మార్చి
                11న ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆరోగ్యం విషయంలో
                నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల భారత్​లో ప్రతి ఏటా సుమారు రెండున్నర లక్షల
                మంది వరకు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు గణాంకాలు
                చెబుతున్నాయి. మన దేశ జనాభాలో 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల
                వ్యాధులతో బాధపడుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీటన్నింటికి
                ప్రధాన కారణం మనం కిడ్నీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవడమే. అందువల్ల, ఈ
                సమస్య నుంచి బయటపడేందుకు, మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి పాటించాల్సిన
                చిట్కాలను తెలుసుకోండి.

                నీరు ఎక్కువగా తీసుకోండి

                సహజంగా వేసవిలో మనకు ఎక్కువ చెమట పడుతుంది. కాబట్టి, మనల్ని మనం హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం తప్పనిసరి. దీనికి గాను రోజుకు కనీసం 10 నుండి 12 గ్లాసుల నీరు త్రాగడంతో పాటు నీరు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. తద్వారా మీ కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. వృద్ధులకు కూడా ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటికే ఏదైనా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నట్లైతే, సంబంధిత వైద్యుడి సూచన ప్రకారం ఆహార పద్ధతులను అనుసరించండి. అలాగే, వేసవిలో సమతులాహారం తీసుకోవడానికే ప్రాధ్యతనివ్వండి

                ఉప్పు వాడకాన్ని తగ్గించండి

                అదనపు ఉప్పు వినియోగం మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేసి రక్తపోటును పెంచుతుంది. అందువల్ల, మీ ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించండి. సాధారణంగా, మనం రోజుకు 7 నుండి 10 గ్రాముల ఉప్పును తీసుకుంటాము. కాబట్టి, దీన్ని 4 నుండి 5 గ్రాములకు తగ్గించాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించకపోతే.. మూత్ర పిండ సమస్యలతో పాటు గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి.

                తగినంత ఫైబర్ తీసుకోండి

                అధిక ఫైబర్​ కలిగిన ఆహారం కేవలం జీర్ణక్రియను సులభతరం చేయడంలోనే కాదు, మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అందుకే, సికెడి (క్రానిక్ కిడ్నీ డిసీజ్)తో బాధపడుతున్న రోగులు ఎక్కువ ఫైబర్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. దీనికి గాను మీ రోజువారీ ఆహారంలో బీన్స్, బఠానీలు, బెర్రీలు, పుచ్చకాయ మొదలైన ముడి పదార్థాలను జోడించండి.

                జంక్​ ఫుడ్​ మానుకోండి

                సహజంగా మనం బయట తినే జంక్​ ఫుడ్ ఎంతో​ అనారోగ్యకరమైంది. వీటిలో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులు మొదలైనవి ఎక్కువగా ఉంటాయి. ఇవి మూత్రపిండ సమస్యలను పెంచుతాయి. కాబట్టి, దీనికి బదులుగా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి, మీ బరువును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ధూమపానం మానుకోండి, రోజూ వ్యాయామం చేయండని డాక్టర్లు సలహాలిస్తున్నారు.

                భారీ వ్యాయామాలు చేయకండి

                వ్యాయామం చేయడం, చురుకైన జీవితాన్ని గడపడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. కానీ అతి ఏదైనా ప్రమాదకరం. అందువల్ల, ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలను చేయకండి. ఇవి కండరాలకు గాయాలను ఏర్పరుస్తాయి. తీవ్రమైన కండరాల గాయం కొన్నిసార్లు రక్తప్రవాహంలో ప్రోటీన్ లీకేజీకి దారితీస్తుంది. ఇది క్రమంగా మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.

                మందుల వాడకాన్ని తగ్గించండి

                ఇండోమెథాసిన్, కాంబిఫ్లామ్, ఇబుప్రోఫెన్, ఆస్పిరిన్ వంటి ఓవర్ ది కౌంటర్ పెయిన్ కిల్లర్లను అవసరం లేకున్న వాడకండి. ఎందుకంటే ఇవి మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి. అంతే కాదు.. అవసరమైతే తప్ప బ్రూఫెన్ లేదా వోవెరాన్ వంటి పెయిన్ కిల్లర్లను అస్సలు వాడకండి.

                చక్కెర, రక్తపోటును అదుపులో ఉంచండి

                మీ చక్కెర, రక్తపోటు స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. ఒకవేళ, మీరు డయాబెటిక్ లేదా బీపీ పేషెంట్​ అయితే, మీ వైద్యుడు సూచించిన విధంగా మీ మందులను తీసుకోండి. ఎందుకంటే, డయాబెటిస్, రక్తపోటు వంటివి మూత్రపిండాలను గణనీయంగా దెబ్బతీస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.

                ఈ లక్షణాలతో గుర్తించండి..

                కిడ్నీ సమస్యలకు చెక్​ పెట్టేందుకు, దాన్ని మొదట్లోనే గుర్తించడం చాలా కీలకం. కొన్ని లక్షణాలతో కిడ్నీ సమస్యలను సులభంగా గుర్తుపట్టవచ్చు. ముఖ్యంగా మూత్రం రంగు మారడం.- మూత్రం చెడు వాసన రావడం, మూత్రం నురుగు రావడం,- మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి కలగడం, – కళ్ళ చుట్టూ వాపు, అలసట రావడం, – వికారం, వాంతులు, -పొడి దగ్గు, దురద,- వెన్నునొప్పి, కడుపు నొప్పి వంటి లక్షణాలతో కిడ్నీ సమస్యను గుర్తించవచ్చు.   

                కిడ్నీ సమస్యను గుర్తించడమెలా? ఈ సమస్యకు పరిష్కార మార్గాలేమిటి? తెలుసుకోండి WORLD KIDNEY DAY 2021 KIDNEY PROBLEMS PRECAUTIONS

                ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? అయితే ఈ 10 తప్పులు అస్సలు చేయకండి! ANDROID USERS DON’T DO THESE 10 MISTAKES

                  0

                  ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ప్రపంచంలో చాలా ఫేమస్. కానీ ఐవోఎస్‌లో పోలిస్తే ఆండ్రాయిడ్‌లో సెక్యూరిటీ కాస్త తక్కువగా ఉంటుంది. ఈ 10 తప్పులు ఫోన్ ఉపయోగించేటప్పుడు అస్సలు చేయకూడదు.

                  ప్రధానాంశాలు:

                  • ఐవోఎస్‌తో పోలిస్తే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ కాస్త తక్కువే
                  • జాగ్రత్తలు పాటిస్తే డేటా సేఫే..

                  ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత పాపులర్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంలు రెండే. ఒకటి ఐవోఎస్, రెండోది ఆండ్రాయిడ్. ఐవోఎస్‌ను యాపిల్ కేవలం ఐఫోన్లలో మాత్రమే అందిస్తుంది. దాంతోపాటు దానికి భద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్ అలా కాదు. ఐవోఎస్‌తో పోలిస్తే ఆండ్రాయిడ్‌లో సెక్యూరిటీ కాస్త తక్కువ. దీంతో హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు, అడ్వర్టైజర్లను ఆండ్రాయిడ్ సులువుగా ఆకర్షిస్తుంది. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం కూడా అవసరం. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉపయోగించేటప్పుడు మనం చేసే పది తప్పులు ఇవే..

                  1. బలమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించకపోవడం

                  మనం మన ఫోన్ లాక్ చేయడానికి ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ అన్‌లాక్‌ను ఉపయోగిస్తాం. దీంతోపాటు బలమైన పాస్ వర్డ్ కూడా ఉండాలి. కేవలం నాలుగంకెల పిన్ మాత్రమే ఉపయోగిస్తే.. మీ ఫోన్ అన్ లాక్ చేయడం మరింత సులభం అవుతుంది. కాబట్టి బలమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి.

                  2. థర్డ్ పార్టీ యాప్స్‌ను అన్‌నోన్ సోర్స్ నుంచి ఇన్ స్టాల్ చేయడం

                  యాప్స్‌ను కేవలం ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవడం ఉత్తమం. మనలో చాలా మంది గూగుల్ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేయడం, లేకపోతే ఏపీకే ఫైల్స్ ఉపయోగించడం వంటివి చేస్తూ ఉంటారు. అది చాలా హానికరం. కాబట్టి ఇలా చేయకండి. మీకు కావాల్సిన యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోండి.

                  3. ఫోన్ అప్ డేట్ చేయకపోవడం

                  మీ ఫోన్‌కు ఆండ్రాయిడ్ వెర్షన్ అప్ డేట్స్ కానీ, సెక్యూరిటీ అప్ డేట్స్ కానీ వస్తే.. వెంటనే అప్ డేట్ చేయండి. ఇన్ స్టాల్ చేసేందుకు కాస్త సమయం పట్టినప్పటికీ.. అది కచ్చితంగా మంచిదే. ఎందుకంటే పాత ఆపరేటింగ్ సిస్టంలు ఉపయోగించేవారిని టార్గెట్ చేసుకుని దాడులు చేసే హ్యాకర్లు కూడా ఉంటారు.

                  4. యాప్స్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు నిబంధనలు చదవకపోవడం

                  ఒక యాప్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు దాని సేవా నిబంధనలు, దానికి ఇవ్వాల్సిన అనుమతులు అన్నీ చదవాలి. ఆ యాప్‌కు అవసరమైన అనుమతులు ఇవ్వకూడదు. ఉదాహరణకు వాల్ పేపర్స్‌కు సంబంధించిన యాప్స్‌కు కాంటాక్ట్ బుక్ లేదా మైక్ వంటి యాక్సెస్‌లు అవసరం లేదు.

                  5. ఫోన్ పోయినా దాన్ని సెక్యూర్ చేసేలా చేయకపోవడం

                  మీరు ఎప్పుడు ఫోన్ కొన్నా అందులో గూగుల్ ఫైండ్ మై ఫోన్ సర్వీసును యాక్టివేట్ చేయాలి. దీంతోపాటు లాక్ స్క్రీన్ సెట్టింగ్స్‌ను కూడా మార్చుకోండి. పాస్‌వర్డ్ ఇవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, మొబైల్ డేటా ఆఫ్ చేయడం వంటివి కుదరకుండా సెట్టింగ్స్‌లో మార్పులు చేయండి.

                  6. ఏ చార్జర్ పడితే ఆ చార్జర్ ఉపయోగించడం

                  ఎప్పుడూ హైక్వాలిటీ అడాప్టర్లు ఉపయోగించాలి. ఇప్పుడు అన్ని ఫోన్లలోనూ దాదాపు 5000 ఎంఏహెచ్ పైబడిన బ్యాటరీని అందిస్తున్నారు. అంత పెద్ద బ్యాటరీ చార్జ్ చేయాలంటే మంచి చార్జర్లు ఉండాలి. లో క్వాలిటీ చార్జర్లు ఉపయోగించకూడదు.

                  7. పర్సనల్ డేటా బ్యాకప్ చేయకపోవడం

                  మీ ఫోన్ పొరపాటున పోయినా, ఎవరైనా దొంగిలించినా, లేకపోతే పగిలిపోయినా అప్పుడు బ్యాకప్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. మీ డేటా మొత్తం పోతుంది. అందుకే ఫోన్‌లో ఎప్పటికప్పుడు డేటాను బ్యాకప్ చేసుకోవాలి.

                  8. సెట్టింగ్స్‌లో ఇన్‌స్టాల్ అయిన యాప్స్ చెక్ చేసుకోకపోవడం

                  సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీ ఫోన్‌లో ఏయే యాప్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. కొన్ని మాల్ వేర్ యాప్స్.. స్క్రీన్ మీద కనిపిండకుండా హైడ్ అయి ఉంటాయి. సెట్టింగ్స్‌లో అలాంటివి చూసుకుని డిలీట్ చేసుకుంటూ ఉండాలి.

                  9. పాత యాప్స్ డిలీట్ చేయకపోవడం

                  మనం ఉపయోగించని యాప్స్ ఏమైనా ఉంటే వాటిని అన్ ఇన్‌స్టాల్ చేయడం ఉత్తమం. అవుట్ డేటెడ్ యాప్స్ కూడా డిలీట్ చేయండి. ఎందుకంటే ఇటువంటి యాప్స్ మెమొరీని ఆక్రమించడమే కాకుండా, మాల్‌వేర్ కూడా ఉండే అవకాశం ఉంది.

                  10. గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్ మార్చకపోవడం

                  మీ గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. దీనివల్ల ప్రైవసీకి భంగం వాటిల్లకుండా చూసుకోవచ్చు.

                  ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? అయితే ఈ 10 తప్పులు అస్సలు చేయకండి! ANDROID USERS DON’T DO THESE 10 MISTAKES

                  రేపు గుంటూరు జిల్లా మాచర్ల కు ముఖ్యమంత్రి జగన్ గారు CM YS JAGAN TOUR TO MACHERLA

                    0
                    • జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కూతుర్ని సన్మానించనున్న సీఎం జగన్ గారు
                    • జాతీయ పతాకం రూపొందించి వందేళ్లు పూర్తైన సందర్భంగా సత్కారం
                    Pingali
                    Venkayya was an Indian freedom fighter. He was a staunch worshipper of
                    Mahatma Gandhi and the designer of the flag on which the Indian national
                    flag was based. He was born at Bhatlapenumarru, near Machilipatnam, in
                    what is now the Indian state of Andhra Pradesh.
                    Born: 2 August 1876, Bhatlapenumarru
                    Died: 4 July 1963, Vijayawada
                    Nationality: Indian

                     

                    పింగళి వెంకయ్య గారి గురించి పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
                    పింగళి వెంకయ్య గారి కుమార్తె సీతా మహాలక్ష్మి గారు
                     

                    రేపు గుంటూరు జిల్లా మాచర్ల కు ముఖ్యమంత్రి జగన్ గారు CM YS JAGAN TOUR TO MACHERLA

                    ఐ.ఎం.ఎం.ఎస్ యాప్ లో డేటా సబ్మిషన్ లో ఎర్రర్స్ ఉంటే ఈ నంబర్ కి కాల్ చేయండి. TCS EMPLOYEE AMRUTH CONTACT FOR IMMS DOUBTS

                      0

                      IMMS యాప్ నందు ఎం.డీ.ఎం మరియు  శానిటేషన్ ఇన్స్పెక్షన్ ఫామ్ సబ్మిట్ చేయునప్పుడు ఎవరికైయినా ఇబ్బందులు ఎదురయినట్లు అయితే వెంటనే స్క్రీన్ షాట్ తో సహా అమృత్, TCS వారిని సంప్రదించవలెను.

                      ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా వాట్సాప్ మెసేజ్ పంపండి

                      లేదా

                      ఇక్కడ క్లిక్ చేసి కాంటాక్ట్ ఫైల్ డౌన్లోడ్ చేయండి (డౌన్లోడ్ అయిన ఫైల్ ను ఓపెన్ చేస్తే మీ కాంటాక్ట్ లిస్ట్ లో కి ఇంపోర్ట్ అవుతుంది)

                      ఐ.ఎం.ఎం.ఎస్ యాప్ లో డేటా సబ్మిషన్ లో ఎర్రర్స్ ఉంటే ఈ నంబర్ కి కాల్ చేయండి. TCS EMPLOYEE AMRUTH CONTACT FOR IMMS DOUBTS