HealthPractice for longer life : ఎక్కువ...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Practice for longer life : ఎక్కువ కాలం జీవించాలంటే.. ఇలాంటి అలవాట్లను ఫాలో అవ్వండి..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Practice for longer life సానుకూల ఆలోచన మీ శరీరం, మనస్సుపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి తగ్గుతుంది, రక్తపోటు అదుపులో ఉంటుంది. మీ జీవితకాలం, ఆయుష్షు పెరుగుతుంది. ఒత్తిడిని ఎంతగా నియంత్రించుకుంటే అంత మంచిది. దీర్ఘకాలిక ఒత్తిడి, మానసిక ఆరోగ్యం పై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

Practice for longer life రోజూ యోగా చేయండి..

యోగా మీ ఎముకలు, కండరాలను బలపరిచే సులభమైన, సమర్థవంతమైన వ్యాయామం. ఒక అధ్యయనం ప్రకారం, రెగ్యులర్‌గా యోగా చేయడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. యోగా, లోతైన శ్వాస, ధ్యానం వంటివి వ్యాయామాలు మెదడుకు స్పష్టతను, జ్ఞాపకశక్తిని, మంచి దృష్టిని అందిస్తాయి. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే జీవితం అంత చక్కగా ఉంటుంది.

త్వరగా పడుకోవటం అలవాటు చేసుకోండి..

Practice for longer life మంచి నిద్ర మీ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ప్రతిరోజూ నిర్ణీత సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి. నిద్రపోయే ముందు ఫోన్ లేదా కంప్యూటర్ వాడకాన్ని తగ్గించండి.

పప్పులు, తృణధాన్యాలు తినండి..

పప్పులు, వోట్స్, బ్రౌన్ బ్రెడ్ వంటి తృణధాన్యాలు తినడం వల్ల మీ జీవితకాలం పెరుగుతుంది. వాటిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.

పులియబెట్టిన ఆహారాలు తినండి..

దోస, దోక్లా, పెరుగు వంటి పులియబెట్టిన ఆహారాలు మీ కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల మీ జీవితకాలం పెరుగుతుంది.

పెంపుడు జంతువులతో కాలక్షేపం..

ప్రతి రోజూ పెంపుడు జంతువులతో కొంత సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మీ మూడ్ బాగుంటుంది. పెంపుడు జంతువులతో కాలక్షేపం చేసే వారు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి.

ఎప్పటికప్పుడు మీ రక్తపోటు చెక్‌ చేసుకోవటం మంచిది..

అధిక రక్తపోటు అనేక వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల, మీ రక్తపోటును క్రమం తప్పకుండా చెక్‌ చేసుకోవటం మంచిది. అవసరమైతే, వైద్యుడిని సంప్రదించండి.

ఆరోగ్యకరమైన ఆహారం…

సమతుల్య ఆహారంలో పుష్కలంగా పండ్లు, కూరగాయలు, చేపలు, చిక్కుళ్ళు వంటి లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు ఉంటాయి. ఈ ఆహారాలు శరీరానికి, రోగనిరోధక శక్తి పనితీరు, మీ మొత్తం ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

స్మోకింగ్ అత్యంత హనికరం..

మన ఆరోగ్యానికి అత్యంత హనికరమైన అలవాటు స్మోకింగ్‌.. ఇది మన ఆరోగ్యాన్ని అతి వేగంగా దెబ్బ తీస్తుంది. స్మోకింగ్ వల్ల జీవితకాలం క్రమంగా తగ్గుతుంది. అందుకే ఎక్కువ కాలం జీవించాలంటే కచ్చితంగా స్మోకింగ్‌ మానేయాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని TV9 Telugu.com (టీవీ9 తెలుగు) ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this