HealthHealth Zinc Deficit : శరీరంలో ఈ...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Health Zinc Deficit : శరీరంలో ఈ లక్షణాలా.? జింక్‌ లోపం ఉన్నట్లే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Health Zinc Deficit శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు సరిగ్గా లభిస్తేనే ఆరోగ్యంగా ఉంటామనే విషయం తెలిసిందే. ఏ ఒక్క పోషకం తగ్గినా శరీరంలో ఏదో ఒక సమస్య మొదలవుతుంది. అయితే శరీరానికి పోషకాలు లభించడం లేదన్న విషయం ఎలా తెలుసుకోవాలనే సందేహం రావడం సర్వసాధారణం. కానీ శరీరం ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. శరీరంలో పలానా పోషకలోపం ఉందని చెప్పేందుకు కొన్ని సంకేతాలను ఇస్తుంటుంది. అలాంటిదే జింక్‌ ఒకటి.

శరీరానికి తప్పకుండా కావాల్సిన పోషకాల్లో జింక్‌ ఒకటి. ఇది శరీరానికి చాలా ముఖ్యమైన ఖనిజం. శరీరానికి కావాల్సిన జింక్‌ అందాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఓట్స్‌, గుమ్మడి గింజలు, జీడిపప్పు, వాల్‌నట్స్‌ వంటివాటిని కచ్చితంగా తీసుకోవాలి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కచ్చితంగా జింక్‌ లోపాన్ని జయించవచ్చు. ఇంతకీ శరీరంలో జింక్‌ లోపం ఉన్న విషయాన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* శరీరంలో జింక్‌ లోపిస్తే ఆకలి తగ్గుతుంది. ఆహారం తీసుకోవాలనించదు. అలాగే రుచి, వాసనను గుర్తించే గుణం క్రమంగా తగ్గుతుంది. ఎలాంటి కారణం లేకుండా ఆహారం తక్కువగా తీసుకుంటున్నారంటే శరీరంలో జింక్‌ లోపించినట్లే అర్థం చేసుకోవాలి.

* శరీరంలో తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తున్నా జింక్‌ లోపంగానే భావించాలి. శరీరంలో జింక్‌ తగ్గితే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో పదేపదే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బాక్టీరియా, వైరస్‌ల దాడి శరీరంపై పెరుగుతుంది.

* శరీరంలో కణ విభజన, ప్రోటీన్‌ సంశ్లేషణకు జింక్‌ అవసరం. ఇది గాయాలను నయం చేయడంలో పనిచేస్తుంది. త్వరగా గాయాలు నయం కాకపోతున్నా శరీరంలో తగినంత జింక్‌ లేదని అర్థం చేసుకోవాలి.

* ఇక జింక్‌ లోపిస్తే చర్మ ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది. శరీరంపై ఎర్రటి దద్దుర్లు, మచ్చలు, మొటిమలు కనిపిస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే, మీ శరీరంలో జింక్ లోపం తలెత్తకుండా చూసుకోవాలి.

* జుట్టు రాలుతున్నా శరీరంలో జింక్‌ లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. జుట్టు రంధ్రాల ఆరోగ్యానికి అవసరమైన DNA, RNA ఉత్పత్తికి జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో జింక్‌ లోపిస్తే జుట్టు పెరుగుదల కూడా ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this