EntertainmentHorror OTT నిద్రపోతే కలలోకి వచ్చి చంపేసే...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Horror OTT నిద్రపోతే కలలోకి వచ్చి చంపేసే సైకో కిల్లర్.. OTT లో వణుకుపుట్టించే సైకో థ్రిల్లర్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇప్పటివరకు ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసి ఉంటారు. ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ కాన్సెప్ట్. ముఖ్యంగా సైకో కిల్లర్ సినిమాలలో ఇలాంటి సస్పెన్స్ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సైకో కిల్లర్ మూవీస్ లో ఎవరు ఎవర్ని.. ఎందుకు చంపుతున్నారో .. దాని వెనుక దాగి ఉన్న సైలెంట్ కిల్లర్ ఎవరో తెలుసుకోవడంలోనే ఈ మూవీ కథ సాగిపోతూ ఉంటుంది. అయితే వీటిలో హంతకుడు మనుషుల మధ్యలోనే ఉంటూ ఎవరికీ కనిపించకుండా తిరుగుతూ ఉంటాడు. కానీ ఇప్పడు చెప్పుకోబోయే మూవీలో మాత్రం ఏకంగా నిద్రపోతున్న వారి కలలోకి వచ్చి మరి చంపేస్తాడు. అసలు ఈ మూవీ ఏంటి .. ఈ సినిమాను మీరు చూశారా.. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. స్ప్రింగ్ వుడ్ డైనర్ అనే ఓ రెస్టారెంట్ లో ఒక కాలేజ్ కు సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే డీన్ అనే ఓ స్టూడెంట్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ.. నిద్రలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అతనికి కలలో డీన్ ను సగం కాలిపోయిన ఓ వ్యక్తి.. తన చేతికి బ్లేడెడ్ గ్లౌజ్ వేసుకుని తనని చంపడానికి వస్తాడు. సరిగ్గా అదే సమయంలో తన క్లాస్మేట్ క్రిస్ తనతో మాట్లాడుతుంది. అప్పుడు క్రిస్ తో.. డీన్ తనకు వచ్చే కలలన్ని నిజం అవుతున్నాయని చెప్తాడు. ఇక ఆ తర్వాత క్రిస్పీ రెస్టారెంట్ లో వర్క్ చేస్తున్న తన ఫ్రెండ్ నాన్సీతో మాట్లాడడానికి వెళ్తుంది. ఇక మళ్ళీ డీన్ డ్రీమ్ లోకి వెళ్ళిపోతాడు. ఇక డ్రీం లో ఆ వ్యక్తి మళ్ళీ అతని దగ్గరకు వచ్చి గొంతు కట్ చేస్తాడు. రియాలిటీలో డీన్ తానే తన నేక్ ను కట్ చేసుకుని చనిపోతాడు. అయితే డీన్ ఫ్యునరెల్ సమయంలో క్రిస్ప్.. డీన్ రూమ్ లో డీన్ చిన్నప్పటి ఫోటో చూస్తుంది. అందులో తన పిక్ కూడా చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే క్రిస్ప్ కు డీన్ కాలేజీ డేస్ నుంచి మాత్రమే పరిచయం. దీనితో ఆమెకు ఏమి అర్థంకాదు.

ఇక ఆ తర్వాత.. క్రిస్ప్ కు కూడా డీన్ లానే కలలు వస్తాయి. ఆమెకు కూడా కలలో ఎవరో వ్యక్తి చంపడానికి వస్తున్నట్లుగా కనిపిస్తాడు. దీనితో క్రిస్ప్ భయపడి.. నిద్రపోతే తానూ కూడా డీన్ లానే చనిపోతానేమో అనుకుని.. నిద్రపోవడం మానేస్తుంది. ఇక క్రిస్ప్ ఇంట్లో ఒక్కతే ఉండడంతో… తన బాయ్ ఫ్రెండ్ జెస్సి తనకు తోడుగా ఉంది దైర్యం చెప్తూ.. నిద్రపోమని చెప్తాడు. ఆమె నిద్రపోయిన వెంటనే ఆ సగం కాలిన వ్యక్తి వచ్చి ఆమెను దారుణంగా చంపేస్తాడు. ఆ సమయంలో క్రిస్ప్ బ్లడ్ జెస్సి మీద పడుతుంది. అప్పుడు జెస్సి భయపడి బయటకు వచ్చేస్తాడు. ఈ విషయం పోలీసులకు తెలుస్తుంది. దీనితో జెస్సి నే ఆమెను చంపాడేమో అనుకుని అతనిని అరెస్ట్ చేస్తాడు. ఇక అతను జైల్లో ఉన్నపుడే.. అతని కలలోకి కూడా సగం కాలిన ఆ వ్యక్తి వచ్చి.. ఇతన్ని కూడా చంపేస్తాడు. అసలు ఆ సగం కాలిన ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు నిద్రపోయిన వారందరిని చంపేస్తాడు ? తర్వాత కథ ఏమై ఉంటుంది ? ఇవన్నీ తెలియాలంటే.. “ది నైట్ మెర్ ఆన్ ఈఎల్ఎమ్ స్ట్రీట్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this