EntertainmentCinemaSinger: ఈ సింగర్ మనసు బంగారం.. 3...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Singer: ఈ సింగర్ మనసు బంగారం.. 3 వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తూ..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సూపర్ స్టార్ మహేష్ బాబు రియల్ హీరో అన్న సంగతి తెలిసిందే. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండే ఈ హీరో.. అటు సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటారు. ఇప్పటివరకు ఎంతో మంది చిన్నారులకు హార్డ్ ఆపరేషన్స్ చేయించారు. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలిచి మరో జన్మను అందించారు. కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు..మరో సింగర్ కూడా ఎంతో మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను నిలిపేందుకు పోరాడుతుంది. ఇప్పటివరకు మూడు వేల మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి ప్రాణాలు కాపాడింది. ఇప్పుడు ఆ సింగర్ మంచి మనసు తెలిసి ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. ఇంతకీ ఆమె ఎవరంటే సింగర్ పాలక్ ముచ్చల్. సినిమాల్లో తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను మంత్రముగ్దులను చేయడమే కాదు.. చిన్నారుల పాలిట దైవంలా మారింది. చిన్నారుల గుండె ఆగిపోకుండా తన సొంతంగా చికిత్స చేయిస్తుంది.

ఇప్పటివరకు దాదాపు 3 వేల మంది నిరుపేద చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించారు. తన పాటలు ప్రాచూర్యం పొందడంతో ఆదాయం పెరిగిందని.. ఒక్క కాన్సార్ట్ తో 13- 14 ఆపరేషన్లకు సరిపడా నిధిలు సేకరిస్తున్నానని సింగర్ పాలక్ ముచ్చల్ వెల్లడించారు. మరో 400 మంది కంటే ఎక్కువ చిన్నారులకు గుండె ఆపరేషన్స్ జరగాల్సి ఉందని.. తన సంపాదిన వారికోసమే ఖర్చు పెడుతున్నట్లు చెప్పుకొచ్చింది. చిన్నారుల ప్రాణాలను కాపాడడంలోనే తనకు అసలైన ఆనందముందని అంటోంది. పాలక్ ముచ్చల్.. ఇప్పుడిప్పుడే సినీరంగంలో గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన పాలక్ ముచ్చల్.. చిన్నవయసు నుంచి సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తుంది. గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు తనవంతుగా నిధులు సేకరిస్తుంది. ఇందుకోసం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ స్టేజ్ షోలను ఇస్తూ నిధులు సేకరిస్తుంది. ఆ డబ్బుతోనే చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తుంది. పాలక్ ముచ్చల్ హిందీలో అనేక సినిమాల్లో పాటలు పాడింది. ఏక్ థా టైగర్, ఆషికి 2, కిక్, యాక్షన్ జాక్సన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఎంఎస్ ధోని, కాబిల్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో పాటలు పాడింది. ఇక ఇప్పుడు పాలక్ ముచ్చల్ మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this