Thursday, November 20, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
HealthCovid-19 Life Time : కరోనా వల్ల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

DSC 2025 New Teachers: MEO Staff Contact Numbers Finder Tool

DSC 2025 లో నియమితులైన అందరు ఉపాధ్యాయులకు హార్థిక అభినందనలు! MEO...

DSC 2025 Web Options: School Head Master Contact Number with DISE Code | DSC School Selection Guide

Head Master Contact : DSC 2025లో ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు!...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

Covid-19 Life Time : కరోనా వల్ల భారతదేశ ఆయుర్ధాయం 2.6 ఏళ్లు తగ్గిందా..? కేంద్రం ఏం చెబుతోంది..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Covid-19 Life Time : కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020లో భారతదేశంలో ఆయుర్దాయం గణనీయంగా తగ్గిందని జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ఓ అధ్యయనం ప్రచురించబడింది. అయితే, ఈ స్టడీని భారత ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అధ్యయనం యొక్క ఫలితాలు ఆమోదయోగ్యం కాదని చెప్పింది. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. 2019 మరియు 2020 మధ్య భారతదేశం 2.6 సంవత్సరాల ఆయుర్దాయాన్ని కోల్పోయిందని పేర్కొంది. సామాజికంగా వెనకబడిన సమూహాలు, ముస్లింలు, షెడ్యూల్డ్ తెగలు అత్యంత తీవ్రంగా ప్రభావితమైనట్లు అధ్యయనం పేర్కొంది. పురుషులతో పోలిస్తే (2.1 ఏళ్లు) స్త్రీలు (3.1 ఏళ్లు) ఎక్కువగా నష్టపోయినట్లు తెలిపింది.

అయితే, ఈ అధ్యయనం లోపభూయిష్టం ఉందని మంత్రిత్వ శాఖ ఎత్తిచూపింది. రచయితలు 2021 జనవరి – ఏప్రిల్ మధ్య నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) నుంచి మొత్తం దేశ మరణాల రేటును అంచనా వేయడానికి గృహాల ప్రాతినిధ్యం లేని ఉపసమితిని ఉపయోగించారని చెప్పింది. NFHS నమూనా మొత్తంగా చూసినప్పుడు మాత్రమే జాతీయ మరణాల తీరును ఖచ్చితంగా సూచిస్తుందని మంత్రిత్వ శాఖ చెప్పింది. 14 రాష్ట్రాల్లో కేవలం 23 శాతం కుటుంబాలను విశ్లేషించడం జాతీయ మరణాల ధోరణులను ఖచ్చితంగా ప్రతిబింబించదని కేంద్రం నొక్కి చెప్పింది.

Covid-19 Life Time

కోవిడ్-19 మహమ్మారి సమయంలో సేకరించిన డేటా రిపోర్టింగ్‌లో పక్షపాతాలను నివేదించడం వంటి అధ్యయంలోని విషయాలను మంత్రిత్వ శాఖ విమర్శించింది. ఇండియా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(సీఆర్ఎస్) నమ్మకమైందని, 99 శాతం మరణాలను సంగ్రహిస్తుందని చెప్పింది. స్టడీలో 2019తో పోల్చితే 2020లో మరణాల నమోదులు దాదాపు 474,000 పెరిగాయని ప్రభుత్వం గమనించింది, ఇది అంతకుముందు సంవత్సరాల వలే ఉంది, కేవలం మహమ్మారి మాత్రమే కారణం కాదని చెప్పింది. మరణాల సంఖ్యలకు అధిక జనాభా పెరగడం కూడా కారణమని మంత్రిత్వ శాఖ చెప్పింది. దేశవ్యాప్తంగా విస్తృత మరియు వైవిధ్యభరితమైన జనాభాను కలిగి ఉన్న శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(SRS), 2019తో పోలిస్తే 2020లో అతి తక్కువ మరణాల సంఖ్యను నమోదు చేసిందని ప్రభుత్వం హైలైట్ చేసింది.

అధ్యయనం పేర్కొన్న వయసు, లింగ సంబంధిత మరణాల పెరుగదలకు సంబంధించిన విషయాలను ప్రభుత్వం సవాల్ చేసింది. కోవిడ్-19 మరణాలు మగవారిలో, వృద్ధుల్లో ఎక్కువ ఉన్నాయని అధికారిక డేటా సూచిస్తుంది. ఇది యువకులు, స్త్రీలపై పెద్దగా ప్రభావం చూపించలేదన్న లేదు. అయితే, అధ్యయనంలో మాత్రం స్త్రీలపై ఎక్కువగా ప్రభావం చూపించిందని చెప్పింది. ఇలాంటి అధ్యయన ఫలితాలు దాని వాదనలపై ఉన్న విశ్వాసాన్ని తగ్గిస్తాయని కేంద్రం పేర్కొంది.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this