EducationNEET-UG 2024 – సిటీ, సెంటర్‌ ఫలితాలు...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Talliki Vandanam (తల్లికి వందనం) Attendance Check – ఇప్పుడు మొబైల్ లోనే మీ పిల్లల హాజరు శాతం తెలుసుకోండి!

ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత...

How to Know Thalliki Vandanam Eligibility Status | తల్లికి వందనం ఏలిజిబిలిటీ స్టేటస్

తల్లికి వందనం పథకం 2026-27 – అర్హత స్థితి తనిఖీ విధానం2026-27...

NEET-UG 2024 – సిటీ, సెంటర్‌ ఫలితాలు విడుదల

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
న్యూఢిల్లీ : నీట్‌ యూజీ సిటీ, సెంటర్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టిఎ) ఈ ఫలితాలను విడుదల చేసింది. అయితే ఈ ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల గుర్తింపు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడింది. వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్షపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 5న నీట్‌ యూజీ పరీక్ష జరిగింది. 571 నగరాల్లోని 4,750 సెంటర్లలో నిర్వహించిన ఈ పరీక్షకు 24 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇందులో 14 కేంద్రాలు విదేశాల్లో ఉన్నాయి.

40కి పైగా పిటిషన్లపై సుప్రీం విచారణ….
నీట్‌-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ … 40కి పైగా పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతఅత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. పిటిషన్ల పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్ధీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే గత గురువారం సర్వోన్నత న్యాయస్థానం మాట్లాడుతూ … నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలను జులై 20 న శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా విడుదల చేయాలని ఎన్టీఏను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సెంటర్ల వారీగా ఫలితాలను వెబ్‌ సైట్‌లో ఎన్టీఏ పొందుపరిచింది. ఈ ఫలితాలను Exams.nta.ac.in/NEET/, neet.ntaonline.in లో చూసుకోవచ్చునని పేర్కొంది.

మళ్లీ ఈనెల 22 న విచారణ….
మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా.. లేదా అని తెలుసుకోవడానికే ఈ జాబితాను కోరుతున్నామని సుప్రీం తెలిపింది. ఫలితాలను ఎన్టీఏ వెబ్‌ సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని, అయితే విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడాలని సూచించింది. ఈ క్రమంలోనే ఎన్టీఏ నేడు ఫలితాలను విడుదల చేసింది. ఈ వ్యవహారంపై జులై 22న ధర్మాసనం తదుపరి విచారణ చేపట్టనుంది.

Source: Praja Sakti


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this