AstrologyHoroscope Today: వారికి అనేక మార్గాల్లో ఆదాయం...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Horoscope Today: వారికి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దిన ఫలాలు (జూలై 20, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. మిథున రాశి వారు కుటుంబ సభ్యులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసర ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. చిన్ననాటి మిత్రులతో రోజంగా సరదాగా గడి చిపోతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కొద్దిగా గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగం మారే విషయం ఆలోచిస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు న్నాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు కొదవ ఉండదు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఉద్యోగ జీవితం సాదా సీదాగా గడిచి పోతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా మందగిస్తాయి. చేపట్టిన పనులన్నీ నిదానంగా పూర్తవు తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వారి నుంచి ఆహ్వానాలు కూడా అందుతాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. కుటుంబంలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

చేపట్టిన పనుల్లో తప్పకుండా యత్న కార్యసిద్ధి ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచ యాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఆనందం కలిగిస్తుంది. బంధువుల నుంచి నూతన ధన, వస్తు లాభాలు పొందుతారు. అనుకోకుండా వాహన యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా కొనసాగుతాయి. ఆరోగ్యం సజావుగా సాగిపో తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అవసరానికి ధన సహాయం అందుతుంది. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు చాలావరకు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో లాభాలు అందకపోవచ్చు. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలకు అవకాశం ఉంది. కొద్దిగా ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. అనుకోకుండా కొందరు ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండాలి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఇంటా బయటా అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండకపోవచ్చు. కుటుంబ వాతావరణం సమ స్యాత్మకంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. అనవసర ఖర్చులు పెరుగు తాయి. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆహార, విహారాల్లో అప్రమత్తంగా ఉండ డం మంచిది. వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి అండ దండలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచే కాక, సహోద్యోగుల నుంచి కూడా ఆదరణ, సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. వ్యాపా రాల్లో కీలక మార్పులు చేపట్టి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ఆర్థిక ప్రయోజనం పొందుతారు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

స్వల్ప అనారోగ్యం వల్ల ముఖ్యమైన పనులు, వ్యవహారాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తే సూచనలున్నాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి జీవితంలో ఆశించిన పురోగతి కనిపి స్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఇంటా బయటా ఆదరణ, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులు కొద్ది ప్రయ త్నంతో సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం సంపాదిస్తారు. వృత్తి, వ్యాపారాలను విస్తరించే ఆలోచన చేస్తారు. ఉద్యోగంలో హోదాలు పెరిగే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండ డం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ధనపరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత బాగానే ఉంటుంది. విశ్రాంతి కూడా కరువవుతుంది. ఉద్యోగ జీవిత సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. వ్యక్తిగత సమస్య లకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం శ్రేయస్కరం. నిరుద్యోగులకు అవకాశాలు, ఆఫర్లు పెరుగుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆశించిన స్థాయిలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. వస్త్రాభరణాలు, విలువైన వస్తుసామగ్రి కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విహార యాత్ర చేస్తారు. కొందరు బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాలకు సంబం ధించి శుభవార్తలు వింటారు. దైవ కార్యాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా ఉండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సా హంగా గడుపుతారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరిం చుకుంటారు. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this