NewsAanvi kamdar: విషాదంగా ముగిసిన ట్రావెల్ డిటెక్టివ్...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Aanvi kamdar: విషాదంగా ముగిసిన ట్రావెల్ డిటెక్టివ్ ప్రయాణం.. ఆన్వీ కామ్‌దార్ బ్యాగ్రౌండ్ ఇదే!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఆమెకు టూర్‌ లంటే మహా ఇష్టం. ఆమె ప్రయాణంలో అందమైన స్థలాల దగ్గరకు వెళ్లడం.. సముద్రాల దగ్గరకు వెళ్లడం.. పురాతన కట్టడాల దగ్గరకు వెళ్లడం హాబీ. వాటిని కెమెరాలో బంధించి ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్‌లో పోస్టు చేయడం చాలా ఇష్టం. అంతేకాదు.. దాని యొక్క విశిష్టతను వివరించడం మరింత ఇష్టం. స్వదేశమే కాదు.. విదేశాల్లో ఉండే అందమైన ప్రదేశాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. ఇలా మొదలైన ఆమె ప్రయాణం.. చివరికి అదే ఆమె ప్రాణాన్ని కూడా బలితీసుకుంది. ఆమెనే ట్రావెల్ డిటెక్టివ్ ఆన్వీ కామ్‌దార్. సొంత గడ్డపై ఉన్న జలపాతాన్ని చిత్రీకరిస్తూ.. ప్రమాదవశాత్తు లోయలోపడి తుదిశ్వాస విడిచింది. ఇక ఆమె లేదన్న చేదువార్త విని ఆమె అభిమానులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. అసలామె ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? ఎలా చనిపోయింది. ఆమెను మృత్యువు ఎలా వెంటాడింది అనేది తెలియాలంటే మరిన్ని వివరాల కోసం ఈ వార్త చదవండి.

ఆన్వీ కామ్‌దార్.. ట్రావెల్ డిటెక్టివ్. ముంబైలో జన్మించింది. ప్రయాణాలు అంటే ఆమెకు మహా ఇష్టం. అలా ఆమె అందమైన ప్రదేశాలను చిత్రీకరించి ఇన్‌స్టా, యూట్యూబ్‌లో పోస్టు చేస్తుంటుంది. దీంతో ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు పెరిగారు. దాదాపు 3 లక్షల మంది అభిమానులను సంపాదించుకుందంటే అతిశయోక్తి కాదు.

అయితే ఆమె రెండ్రోజుల క్రితం మహారాష్ట్రలోని కుంభే జలపాతానికి వెళ్లింది. ఓ వైపు జోరున వర్షం కురుస్తోంది. అయినా కూడా తన వృత్తి ధర్మాన్ని పాటిస్తూ.. స్నేహితులతో కలిసి విహరిస్తోంది. జలపాతం విశిష్టతను వివరిస్తూ.. పొరపాటున కొండ అంచున కాలి వేసింది. అమాంతంగా 300 అడుగుల లోతుల్లో పడిపోయింది. బండసందుల్లో ఇరుక్కోవడంతో ఆరు గంటల పాటు నరకయాతన అనుభవించింది. మొత్తానికి పోలీసులు, అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేసి… శ్రమించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. దీంతో ఆమె లేరన్న వార్త తెలిసి అభిమానులు, శ్రేయోభిలాషులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎక్కడ ప్రయాణం మొదలు పెట్టిందో.. అక్కడే ముగియడం ఆశ్యర్యం కలిగిస్తోంది.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this