HealthCancer: పేపర్‌ కప్పులో టీ తాగితే క్యాన్సర్‌...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Cancer: పేపర్‌ కప్పులో టీ తాగితే క్యాన్సర్‌ వస్తుందా.? నిపుణులు ఏమంటున్నారంటే.. | Drinking tea in paper cups may leads to cancer

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

టీ తాగకపోతే రోజు గడవని వాళ్లు మనలో చాలా మంది ఉంటారు. రోజుకు కనీసం రెండు సార్లు చాయ్‌ తాగాల్సిందే. ప్రయాణాలు చేసినా, బయటకు వెళ్లినా టీ కొట్టులో అయినా టీ తాగుతుంటారు. ఇక టీ కొట్టుల్లో ఒకప్పుడు అయితే గాజు గాసులో టీ తాగేవారు. అయితే ఆ తర్వాత ప్లాస్టిక్‌ గ్లాసులు అందుబాటులోకి వచ్చాయి. వీటి వాడకం సులభతరం కావడంతో చాలా మంది వీటినే ఉపయోగించారు.

అయితే ఆ తర్వాత ప్లాస్టిక్‌ పై నిషేధాలు విధించడం, ప్లాస్టిక్‌ వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరం కావడంతో క్రమంగా ప్లాస్టిక్‌ గ్లాసులను ఉపయోగించడం తగ్గిపోయింది. ప్రస్తుతం వాటి స్థానంలో పేపర్‌ కప్పులు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇవే కప్పులు కనిపిస్తున్నాయి. అయితే పేపర్‌ గ్లాసుల్లో టీ గాగడం ఎంత వరకు మంచిదన్న దానిపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పేపర్‌ గ్లాసులో టీ తాగడం వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉంటాయనే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

నిపుణుల అభిప్రాయం డిస్పోజబుల్ కప్పులలో అధిక మొత్తంలో బిస్ఫినాల్, BPA కెమికల్స్‌ ఉంటాయి. ఇలాంటి వాటిలో వేడి వేడి నీరు తాగడం వల్ల గ్లాసులోని రసాయనాలు దానిలో టీలో కలుస్తాయి. దీంతో గ్లాసులో ఉన్న రసాయనాలు పొట్టలోకి వెళ్తాయి. దీర్ఘకాలంలో ఇది క్యాన్సర్‌కు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పేపర్‌ కప్పుల వల్ల ఎలాంటి హాని ఉండదని ప్రజలు భావిస్తారు. కానీ వీటి తయారీలో బీపీఏ రసాయనాలు వాడుతారు. ఇది మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కాల క్రమేణ ఇది క్యాన్సర్‌కు దారి తీస్తుందని అంటున్నారు.

డిస్పోజబుల్ కప్పుల తయారీలో అనేక రసాయనాలను ఉపయోగిస్తారు. ఇందులో రసాయనాలతో పాటు మైక్రోప్లాస్టిక్స్‌ను ఉపయోగిస్తారు. ఈ మైక్రోప్లాస్టిక్స్, రసాయనాలు థైరాయిడ్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి పేపర్‌, ప్లాస్టిక్‌ పాత్రలకు బదులుగా స్టీల్ లేదా మట్టి కప్పులను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. మట్టి కప్పులో టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మట్టి కప్పుల్లో సహజ ఆల్కేన్ ఉంటుంది. ఇది టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. చాలా మంది ప్రజలు టీ తాగిన వెంటనే వచ్చే ఎసిడిటీ సమస్యకు దీంతో చెక్‌ పెట్టొచ్చు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this