Science and TechnologyMobileBest Phones in India : ఈ...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Best Phones in India : ఈ జూలైలో రూ. 30వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Best Phones in India : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో ఈ నెలలో రూ. 30వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్ 8జీబీ లేదా 12జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లను అందిస్తుంది. ఈ ధర పరిధిలో వన్‌ప్లస్ నార్డ్ 4 బెస్ట్ ఆప్షన్ అవునా? కాదా? జూలై 2024లో రూ. 30వేల లోపు టాప్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1) వన్‌ప్లస్ నార్డ్ 4 :
వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ 2772 × 1240 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2,150 నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.74-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. యూఎస్‌బీ 2.0 పోర్ట్, అలర్ట్ స్లైడర్, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, ఎన్ఎఫ్‌సీ స్ప్లాష్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ65 రేటింగ్‌ను కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా ఆధారితంగా చేస్తుంది. అడ్రినో 732 జీపీయూతో వస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 4 హై-పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 8జీబీ లేదా 12జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ మెమరీతో వస్తుంది. 128జీబీ యూఎఫ్ఎస్ 3.1 లేదా 256జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది.

కెమెరాల పరంగా.. నార్డ్ 4 ఓఐఎస్, ఈఐఎస్‌తో కూడిన 50ఎంపీ సోనీ లైవైటీఐఏ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 112-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌‌కు 16ఎంపీ సెన్సార్ అందిస్తుంది. ప్రైమరీ సెన్సార్ 60ఎఫ్‌‌పీఎస్ వద్ద 4కె వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

అయితే, ఫ్రంట్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాలు 30ఎఫ్‌పీఎస్ వద్ద 1080పీ వీడియో వరకు రికార్డ్ చేయొచ్చు. ఈ ఫోన్ 5,500mAh బ్యాటరీ, 100డబ్ల్యూ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఆక్సిజన్‌ఓఎస్ 14.1తో సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. వన్‌ప్లస్ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్, 6ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌ వస్తుంది. ముఖ్యంగా, నార్డ్ 4 ఫ్లూయెన్సీ 72 మంత్ ఎ రేటింగ్‌ను పొందిన మొదటి ఫోన్ అని చెప్పవచ్చు. 6ఏళ్ల వరకు సాఫీగా పనిచేస్తుందని సూచిస్తుంది.

2) ఐక్యూ నియో 7 ప్రో :
ఐక్యూ నియో 7ప్రో 5జీ ఫోన్ 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లేను 8,000,000:1 కాంట్రాస్ట్ రేషియో, డీసీఐ-పీ3 కలర్ గామట్, 1.07 బిలియన్ కలర్ సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ప్రీమియం లెదర్ డిజైన్‌తో, ఫోన్ డార్క్ స్టార్మ్, ఫియర్‌లెస్ ఫ్లేమ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. అడ్రినో 730 జీపీయూతో వస్తుంది.

ఈ ఫోన్ 8జీబీ, 12జీబీ LPDDR5 ర్యామ్ వేరియంట్‌లలో వస్తుంది. 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను అందిస్తుంది. ఐక్యూ నియో 7ప్రో 5జీ వర్చువల్ ర్యామ్ విస్తరణ ఫీచర్‌ను కలిగి ఉంది. అదనంగా 8జీబీ ర్యామ్ అనుమతిస్తుంది. 5,000mAh బ్యాటరీతో ఆధారితంగా పనిచేస్తుంది. 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ కేవలం 25 నిమిషాల్లో 1శాతం నుంచి 100శాతం వరకు ఛార్జ్ చేయగలదు.

3) పోకో ఎఫ్6 :
పోకో ఎఫ్6 120Hz రిఫ్రెష్ రేట్, 2712 x 1220 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. 2400 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 1920Hz పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ వైడివైన్ ఎల్1, డాల్‌బై విజన్, హెచ్‌డీఆర్ 10+కి సపోర్టు ఇస్తుంది.

ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా విక్టస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్‌తో తయారైంది. టైటానియం, బ్లాక్ కలర్‌వేస్‌లో వస్తుంది. 4ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. పోకో ఎఫ్6 గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌లకు అడ్రినో 735 జీపీయూను కలిగి ఉంది. 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌ను అందిస్తుంది.

4) రియల్‌మి జీటీ 6టీ :
రియల్‌మి జీటీ 6టీ 2789 x 1264 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఎల్‌టీపీఓ కర్వ్డ్ అమోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే 2500Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 6000 నిట్‌ల గరిష్ట ప్రకాశం (అధిక బ్రైట్‌నెస్ మోడ్‌లో 1600 నిట్స్, 1000 నిట్స్ మ్యాన్యువల్ గరిష్ట బ్రైట్‌నెస్) కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్ట్ అందిస్తుంది. ఈ ఫోన్ దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ65 రేటింగ్‌ను కలిగి ఉంది.

క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 3 చిప్‌సెట్‌తో అడ్రినో 732 జీపీయూతో వస్తుంది. జీటీ 6టీ 12జీబీ వరకు (LPDDR5X) మెమరీ, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. రియల్‌మి జీటీ 6టీ 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ 600 ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 120డబ్ల్యూ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

5) ఇన్ఫినిక్స్ జీటీ 20ప్రో :
ఇన్ఫినిక్స్ జీటీ 20ప్రో 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌టీపీఎస్ అమోల్డ్ డిస్‌ప్లేను 1300నిట్స్ గరిష్ట ప్రకాశం, 144Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. ఈ ఫోన్ గ్రాఫిక్స్ టాస్క్‌లకు మాలి జీ610-MC6 జీపీయూ కలిగి ఉంది. పిక్సెల్‌వర్క్స్ ఎక్స్5 టర్బో అని పిలిచే గేమింగ్ డిస్‌ప్లే చిప్‌ను కూడా కలిగి ఉంది.

జీపీయూ పర్ఫార్మెన్స్ రిజల్యూషన్‌ను మెరుగుపరుస్తుంది. ఇన్ఫినిక్స్ జీటీ 20ప్రో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఇన్ఫినిక్స్ ఎక్స్ఓఎస్ 14పై రన్ అవుతుంది. ఇన్ఫినిక్స్ ఈ ఫోన్ కోసం 2 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను, అదనంగా ఏడాది సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this