Science and TechnologyMeta: ఫేస్‌బుక్, ఇన్‌స్టా “వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌”లను...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Meta: ఫేస్‌బుక్, ఇన్‌స్టా “వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌”లను ప్రారంభించిన మెటా.. ఛార్జీలు ఎంతంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Meta: భారతదేశంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో బిజినెస్ కోసం టెక్ దిగ్గజం మెటా వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ని ఈరోజు ప్రవేశపెట్టింది. గత సంవత్సరం పరిమిత వినియోగదారులతో సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను పరీక్షించిన తర్వాత, మరిన్ని ఫీచర్లు, సపోర్ట్‌తో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మెటా వెరిఫైడ్ బిజినెస్ ఆఫర్‌ను విస్తరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వ్యాపారాల కోసం వెరిఫై చేయబడిన వారికి మెటా వెరిఫై బ్యాడ్జ్, మెరుగైన అకౌంట్ సపోర్ట్ అందిస్తుంది. మెరుగైన రక్షణతో పాటు అదనపు ఫీచర్లను అందించనుంది. ఈ ప్లాన్ నెలకు ఒక యాప్‌కి రూ. 639 నుంచి ప్రారంభమవుతుంది. ఇది రూ. 21,000 వరకు ఉంటుంది. ఇది రెండు యాప్‌లకు సంబంధించి ఒక నెలకు ప్రారంభ డిస్కౌంట్ రేట్ అని కంపెనీ వెల్లడించింది.

అంతేకాకుండా, వివిధ సంస్థలు తమ అవసరాలకు సరిపోయే మెంబర్‌షిప్ ప్యాకేజీని ఎంచుకోవడంలో సహాయపడటానికి మెటా వెరిఫైడ్ నాలుగు విభిన్న ప్లాన్లను అందిస్తోంది. ఇండియన్ యూజర్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్లను ఐఓఎస్, ఆండ్రాయిడ్ అధికారిక స్టోర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయడానికి వీలుంది. ఇండియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా యొక్క వెరిఫైడ్ బిజినెస్ ఆఫర్ ఇప్పుడు సాధారణంగా ‘బ్లూ టిక్’ అని పిలువబడే వెరిఫైడ్ బ్యాడ్జ్‌ని కలిగి ఉంటుంది.

బిజినెస్ ఓనర్లు ఈ వెరిఫైడ్ బ్యాడ్జ్ ద్వారా ప్రయోజనం పొందుతారని, ఇది విశ్వసనీయతను మెరుగుపరుస్తుందని, కస్టమర్లలో వారి ఇంటరాక్షన్‌ని సహాయపడుతుందని, విశ్వాసాన్ని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మెటా వెరిఫైడ్ సబ్‌స్క్రైబర్ల కోసం సపోర్ట్ అందించనుంది. ఇదే కాకుండా వెరిఫై చేయబడిన బిజినెస్ సబ్‌స్క్రైబర్లు ప్లాన్లను పెంచుకున్నప్పుడు వారి రీల్స్‌లో మరిన్ని లింకులను యాడ్ చేసుకోవచ్చు. వివిధ మెటా ప్లాట్‌ఫారమ్‌లలో వారి ప్రొఫైల్‌ను మెరుగుపరచడానికి మరిన్ని ఫీచర్‌లకు యాక్సెస్ పొందవచ్చు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this