Life StyleAlcohol: బీరు తాగే వారికి దోమలు ఎక్కువగా...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Alcohol: బీరు తాగే వారికి దోమలు ఎక్కువగా కుడుతాయా.? నిపుణులు ఏమంటున్నారంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దోమ కాటు ఎంత ప్రమాదకరమే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ మనిషిని కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా చేరు వేసే సంఘటనలు ఉన్నాయి. అందుకే దోమ కాటుకు గురి కాకుండా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కాయిల్స్‌ మొదలు లిక్విడ్స్‌ వరకు దోమలను తరిమికొట్టేందుకు ఉపయోగిస్తుంటారు.

అయితే దోమకాటులో కూడా సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా.? డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి ప్రమాదకరమైన వ్యాధులను వ్యాప్తి చేస్తే దోమలను ఎవరిని పడితే వారికి కుట్టవు. ఒక దోమ మనల్ని కుడుతుంది అంటే అందుకు ఒక రిజన్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఇలాంటి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బీరు సేవించే వారిని దోమలు ఎక్కువగా కుట్టే అవకాశం ఉందని తేలింది. అమెరికాలోని న్యూ మెక్సికో స్టేట్ యూనివర్శిటీలోని పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డాక్టర్ జగదీష్ ఖుబ్‌చందానీ ఈ విషయమై మాట్లాడుతూ.. దోమలు మనుషుల వైపు ఆకర్షితులవడానికి చాలా కారణాలున్నాయన్నారు. ముఖ్యంగా శరీర వాసన, చర్మం ఉష్ణోగ్రతతో పాటు శరీరం నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, ఆల్కహాల్ కూడా కారణమవుతుందని తెలిపారు.

ఇదిలా ఉంటే మొత్తం 3500 కంటే ఎక్కువ జాతుల దోమలు ఉన్నాయి. అయితే మనిషిని కేవలం ఆడ దోమ మాత్రమే కుడుతుంది. దీనికి కారణం ఆడ దోమలకు వాటి గుడ్లకు ప్రోటీన్ అవసరం ఉంటుంది. మనిషి రక్తం నుంచి దోమలకు ఈ ప్రోటీన్‌ లభిస్తుంది. ఇక ఏ బ్లడ్ గ్రూప్‌ ఉన్న వారిని దోమలు తక్కువగా కుడుతాయని పలు అధ్యయనాల్లో తేలింది. అలాగే ఓ బ్లెడ్‌ గ్రూప్‌ ఉన్న వారిని ఎక్కువగా కుడుతాయి. అంతేకాకుండా బీరు తాగే వారికి కూడా దోమలు ఎక్కువగా కుడుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఇదండీ దోమ కుట్టడం వెనకాల ఉన్నఅసలు అర్థం.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this