New Scam In WhatsApp: ఉచితమని క్లిక్‌...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

New Scam In WhatsApp: ఉచితమని క్లిక్‌ చేశారో మీ పని గోవిందా..? జియో రీఛార్జ్‌ పేరుతో వాట్సాప్‌లో మోసపూరిత లింక్‌..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 New Scam In WhatApp: భారతదేశంలో ఆ మాటకొస్తే యావత్‌ ప్రపంచవ్యాప్తంగా
ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్‌లలో వాట్సాప్‌ ప్రథమ స్థానంలో
ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తుంది
కాబట్టే ఈ యాప్‌కు అంత ప్రాముఖ్యత లభిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నో ఫీచర్లతో
ఆకట్టుకుంటోన్న వాట్సాప్‌ పలు రకాల మోసాలకు కూడా కేరాఫ్‌గా మారుతోంది.
రకరకాల ఆఫర్లతో కూడిన మోసపూరిత ప్రకటనలు ఇటీవల వాట్సాప్‌లో బాగా
సర్క్యూలేట్‌ అవుతున్నాయి. యూజర్లు కూడా వెనకా ముందు చూసుకోకుండా ఇలాంటి
మెసేజ్‌లను ఇతరులకు ఫార్వర్డ్‌ చేసేస్తున్నారు. అయితే ఈ ప్రకటనల చాటున
పెద్ద మోసమే జరుగుతోంది. తాజాగా ఇలాంటి ఓ ప్రకటన వాట్సాప్‌లో చక్కర్లు
కొడుతోంది. జియో రూ.550ల ప్లాన్‌ను ఉచితంగా అందిస్తోందని.. ఈ ఆఫర్‌ను
పొందాలంటే కింది లింక్‌ క్లిక్‌ చేయాలని ఓ సందేశం వస్తోంది. అయితే పొరపాటున
ఆ లింక్‌ చేశారో ఇక మీ పని గోవింద అని హెచ్చరిస్తున్నారు సైబర్‌ నిపుణులు.
సదరు లింక్‌ క్లిక్‌ చేసిన వెంటనే ఓ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది. దీంతో మీ
మొబైల్‌ లేదా కంప్యూటర్‌లో ఉన్న పూర్తి సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి
వెళిపోతుంది. మీ బ్యాంక్‌ అకౌంట్లకు సంబంధించిన వివరాలతో హ్యాకర్లు మీ
ఖాతాలోని డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి
వాట్సాప్‌లలో వచ్చే ఇలాంటి సందేశాలను నమ్మకూడదనేది సైబర్‌ నిపుణుల సూచన.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this