Thursday, February 19, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Vaccine Finder: మీకు ద‌గ్గ‌ర్లోని వ్యాక్సిన్ సెంట‌ర్...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Vaccine Finder: మీకు ద‌గ్గ‌ర్లోని వ్యాక్సిన్ సెంట‌ర్ ఎక్క‌డుందో ఫేస్‌బుక్ చెబుతుంది.. అందుబాటులోకి కొత్త టూల్‌..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Vaccine Finder Tool In FaceBook: ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొవ‌డానికి మ‌న ద‌గ్గ‌ర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేష‌న్‌. వ్యాక్సిన్ చేయించుకున్న వారు క‌రోనా భారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని ఇప్ప‌టికే ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారంద‌రికీ వ్యాక్సిన్ అందించ‌నున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ మొదలైంది. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ సెంట‌ర్ ఎక్క‌డుందో తెలుసుకోవ‌డంలో ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. ఇది స‌హ‌జ‌మైన విష‌య‌మే.. ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డానికే ఫేస్‌బుక్ స‌రికొత్త ఫీచ‌ర్‌తో ముందుకు రానుంది.

భార‌త్‌లో వ్యాక్సిన్ ఫైండ‌ర్ పేరుతో ఓ టూల్‌ను తీసుకురావ‌డానికి సన్నాహాలు చేస్తోంది. త్వ‌ర‌లోనే ఈ టూల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫేస్‌బుక్ ఈ టూల్‌ను భార‌త ప్ర‌భుత్వ భాగస్వామ్యంతో రూపొందిస్తోంది. దేశంలోని 17 స్థానిక భాష‌ల్లో ఇందులో స‌మాచారం అందుబాటులో ఉంచ‌నున్నారు. ఫేస్‌బుక్ యాప్‌లో అందుబాటులో ఉండే ఈ టూల్‌తో యూజ‌ర్లు త‌మ‌కు ద‌గ్గ‌ర్లో ఉన్న వ్యాక్సిన్ సెంట‌ర్ల‌ను క‌నుక్కోవ‌చ్చు. కేంద్ర ఆరోగ్య శాఖ అందించిన వివ‌రాల ఆధారంగా వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల లొకేష‌న్లు, వాటి ప‌ని వేళ‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని అందిస్తుంది. ఇక ఈ టూల్‌లో కోవిన్ పోర్ట‌ల్‌ను కూడా లింక్ చేసి ఉంచారు. దీని ద్వారా టూల్ ద్వారానే వ్యాక్సినేష‌న్ రిజిస్ట్రేష‌న్ కూడా చేసుకోవ‌చ్చు. ఫేస్‌బుక్‌లోని కొవిడ్ 19 ఇన్ఫ‌ర్మేష‌న్ సెంట‌ర్‌లో ఈ టూల్ అందుబాటులో ఉంటుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this