Thursday, February 19, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Vaccine: మలేరియాకు వ్యాక్సిన్ వచ్చిందా..! యాబై వేల...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Vaccine: మలేరియాకు వ్యాక్సిన్ వచ్చిందా..! యాబై వేల ఏళ్ల నాటి వ్యాధికి టీకా..? మరి కరోనా సంగతేంటి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Malaria Vaccine : మలేరియా అనేది యాభై వేల సంవత్సరాలుగా మొత్తం మానవ జాతిని బాధపెట్టిన ఒక వ్యాధి. కానీ ఈ రోజు వరకు ఎటువంటి వ్యాక్సిన్ కనుగొనబడలేదు. గత ఏడాది ప్రపంచంలో కోవిడ్ వల్ల అనేక మరణాలు సంభవించాయి. ఆఫ్రికాలో ప్రతి సంవత్సరం మలేరియా కారణంగా అనేక మరణాలు సంభవిస్తాయి. ప్రతి సంవత్సరం 500 మిలియన్ల మంది మలేరియా బారిన పడుతున్నారు. 1 మిలియన్లకు పైగా ప్రజలు మరణిస్తున్నారు. మలేరియాతో మరణించే వారిలో ఎక్కువ మంది పిల్లలు, సహారా ఆఫ్రికాకు చెందిన యువకులు ఉంటున్నారు. మలేరియా ప్రధానంగా ఆసియా, ఆఫ్రికాలో వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు మలేరియాను నివారించగల టీకా లేదా వ్యాక్సిన్ కనుగొనబడలేదు.

కానీ ఇటీవల వైద్యులు ఒక సరికొత్త విషయాన్ని కనుగొన్నారు. బుర్కినా ఫాసోలో కొన్నేళ్లుగా మలేరియా వ్యాక్సిన్‌పై పరీక్షలు జరుగుతున్నాయి. ఆ పరీక్ష ప్రారంభ ఫలితాల్లో శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. ఈ ప్రారంభ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని మలేరియాకు వ్యాక్సిన్ తయారు చేయడంలో, వ్యాధి మూలం నుంచి తొలగించడంలో వైద్య శాస్త్రం విజయవంతమవుతుందని నమ్ముతున్నారు.ఒక సంవత్సరం పాటు కొనసాగిన ఈ టీకా విచారణ ప్రక్రియలో మొత్తం నాలుగున్నర మంది పిల్లలు పాల్గొన్నారు.

ఈ పిల్లలు 5 నెలల నుంచి 17 నెలల వయస్సులో ఉన్నారు. టీకా మూడు వేర్వేరు సమూహాలను పరీక్షలో చేర్చారు. టీకా ఫలితాలను పరీక్షించడానికి మూడు వేర్వేరు పరీక్షలు జరిగాయి. మొదటి సమూహానికి R21 / Matrix-M వ్యాక్సిన్ చిన్న మొత్తాలను ఇచ్చారు. రెండో సమూహానికి R21 / Matrix-M వ్యాక్సిన్ చిన్న మొత్తాన్ని ఇచ్చారు. మూడో సమూహానికి ఈ టీకా ఇవ్వబడలేదు. బదులుగా ఈ బృందానికి రాబిస్‌తో టీకాలు వేయించారు. అధిక మొత్తంలో R21 / మ్యాట్రిక్స్-ఎం వ్యాక్సిన్ ఇచ్చిన సమూహం మలేరియాకు వ్యతిరేకంగా 77 శాతం సక్సెస్ రేటును కలిగి ఉంది.

చిన్న మొత్తంలో R21 / మ్యాట్రిక్స్-ఎం వ్యాక్సిన్ ఇచ్చిన సమూహం 71 శాతం విజయాన్ని సాధించింది. టీకా ఇవ్వని మూడో సమూహంలో ఎటువంటి మార్పు కనిపించలేదు. దోమ కాటు వల్ల కలిగే ఈ ప్రాణాంతక వ్యాధి గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు, శాస్త్రవేత్తలను కలవరపెట్టింది. దాని చికిత్స కోసం వివిధ రకాల మందులు రూపొందించబడ్డాయి. అయితే వ్యాధి మూలాల నుంచి నిర్మూలించబడే పద్ధతి మాత్రం ఇప్పటి వరకు కనుగొనబడలేదు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this