Corona Vaccine 2nd Dose: కోవిడ్ వ్యాక్సీన్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Corona Vaccine 2nd Dose: కోవిడ్ వ్యాక్సీన్ రెండో డోసు తీసుకోకపోతే ఏమవుతుంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కోవిడ్ వ్యాక్సీన్ చుట్టూ అనేక అపోహలు అలముకున్నాయి. వ్యాక్సీన్ తీసుకోవాలా వద్దా అని చాలామంది సంశయిస్తుండగా.. మొదటి డోస్ తీసుకున్న తరువాత రెండో డోస్ తీసుకోకపోతే ఏమవుతుందన్న భయాన్నీ చాలామంది వ్యక్తం చేస్తున్నారు.

తమిళ నటుడు వివేక్ మరణం తరువాత, కోవిడ్ వ్యాక్సీన్ మొదటి డోసు తీసుకున్నవాళ్లు కూడా రెండో డోసు తీసుకోవడానికి భయపడుతున్నారు.

మొదటి డోసు తీసుకున్న తరువాత కూడా వ్యాక్సీన్ సైడ్ ఎఫెక్టుల గురించి భయమేస్తోందని కొందరు అంటున్నారు.

వ్యాక్సీన్ రెండో డోసు తీసుకోవడం అవసరమా? తీసుకోకపోతే ఏమవుతుంది? అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి.

దీనిపై నిపుణులు ఏమంటున్నారో చదవండి..

కోవిడ్ వ్యాక్సీన్ రెండో డోసు తీసుకోకపోతే ఏమీ కాదని, దాని వలన ఆరోగ్య సమస్యలేవీ తలెత్తవని తమిళనాడు పబ్లిక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ కుళందైసామి స్పష్టం చేశారు.

“ఎవరికైనా ఒక నిర్దిష్టమైన మందు వల్ల అలర్జీలు వస్తాయనుకుంటే అది మొదటి డోసు వేసుకోగానే తెలిసిపోతుంది. మొదటి డోసు వేసుకున్నాక ఏ సైడ్ ఎఫెక్టులు లేకపోతే రెండో డోసుకు కూడా ఏమీ ఉండవు.”

రెండో డోసు రోగ నిరోధక శక్తి మరింత పెరిగేందుకు దోహదపడుతుంది. మొదటి డోసుతోనే ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది.

రెండో డోసు తీసుకోకపోయినా ఏం ఫరవాలేదు. కానీ, తీసుకుంటే మంచిది. కోవిడ్‌తో పోరాడేందుకు రెండో డోసు మరింత ఉపయోగపడుతుంది” అని డాక్టర్ కుళందైసామి చెప్పారు.

ఇండియాలో తయారైన కోవిడ్ వ్యాక్సీన్ ఇండియన్ వేరియంట్‌పై మాత్రమే ప్రభావవంతంగా పని చేస్తుందా? లేక ఫారిన్ వేరియంట్లపై కూడా పని చేస్తుందా? అని కొందరు సందేహాలు వెలిబుచ్చారు.

“చాలామందికి ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి. ప్రస్తుతం ఇండియాలో రెండు వ్యాక్సీన్లు తయారవుతున్నాయి. ఒకటి కోవిషీల్డ్, రెండోది కోవాగ్జిన్. రెండు వ్యాక్సీన్లు కూడా అన్ని రకాల కరోనావైరస్ వేరియంట్లపై ప్రభావవంతంగా పని చేస్తున్నాయని కోవిడ్ సెకండ్ వేవ్‌లో తేలింది.”

ఇండియన్ వేరియంట్ మాత్రమే కాక ఫారిన్ వేరియంట్లను ఢీకొనడంలో కూడా మన వ్యాక్సీన్లు సఫలమవుతున్నాయి” అని కుళందైసామి వివరించారు.

కేంద్రం, రాష్ట్రాలు కూడా కోవిడ్ వ్యాక్సీన్ విషయంలో తలెత్తుతున్న సందేహాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయడం లేదని డాక్టర్ పుగళేంది అభిప్రాయపడ్డారు.

“నటుడు వివేక్ మరణం తరువాత చాలామందికి అనేక రకాల సందేహాలు తలెత్తుతున్నాయి. అది సహజం. వ్యాక్సీన్ వేసుకోవాలో వద్దో అనేది వ్యక్తిగత నిర్ణయం అని కేంద్ర తేల్చి చెప్పింది.”

వ్యాక్సీన్ వల్ల కలిగే నష్టాలకు కేంద్రంగానీ, మెడికల్ కంపెనీలుగానీ బాధ్యత వహించవని, ఎలాంటి పరిహారాలు చెల్లించవని కూడా తేల్చి చెప్పారు.

అయితే, కరోనా వ్యాక్సీన్ రెండు డోసులు వేసుకున్న తరువాత కరోనా సోకదని చెప్పలేం. అలాంటప్పుడు ప్రజలు ఎలా ధైర్యంగా వ్యాక్సీన్ వేసుకోగలరు?” అని డాక్టర్ పుగళేంది ప్రశ్నిస్తున్నారు.

“వ్యాక్సినేషన్ వలన సంభవించిన 600 మరణాలలో 15 మరణాలపై ప్రభుత్వం పరిశోధన జరిపింది. ఈ మరణాలు కోవిడ్ వ్యాక్సీన్ వల్ల సంభవించినవి కాకపోవచ్చని వ్యాక్సీన్ సైడ్ ఎఫెక్టులను పరిశీలిస్తున్న ప్రభుత్వ బృందం సందేహం వ్యక్తం చేసింది. అయితే, ఈ మరణాలకు కారణాలేంటో ప్రభుత్వం స్పష్టం చేయలేదు.

వివేక్ మరణానికి కారణాలను కనుగొనే ప్రయత్నం చేస్తామని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కానీ, వివేక కుటుంబ సభ్యుల అభ్యర్థనతో ఆ ప్రయత్నాలను విరమించుకుంది. ఇలాంటి సంఘటనలు ప్రజల్లో అవిశ్వాసాన్ని సృష్టిస్తాయి” అని ఆయన అన్నారు.

“వ్యాక్సీన్ పట్ల ప్రజల్లో కలిగే సందేహాలను నివృత్తి చేయడం ఒక పెద్ద సవాలు. అయితే అనుమానాలు రావడం అనేది సహజం” అని ఐసీఎంఆర్ మాజీ సైంటిస్ట్ మారియప్పన్ అన్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this