Telangana 10th Results: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Telangana 10th Results: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ విడుదల.. ఈ సారి ఆ వివరాలు నమోదు చేస్తేనే ఫలితాలు చూసుకునే ఛాన్స్..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Telangana 10th Results: తెలంగాణ టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి సబితా రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి సబితారెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సారి పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ప్రభుత్వం పాస్ చేసింది. కరోనా కారణంగా ఈ విద్యాసంవత్సరంలో కేవలం 44 రోజులు మాత్రమే పాఠశాలలు నిర్వహించారు. ఆ సమయంలో విద్యార్థులకు ఒక ఫార్మేటీవ్ అసెస్మెంట్(FA-1) పరీక్షను నిర్వహించారు. ప్రతీ సబ్జెక్టులో 20 మార్కులకు ఆ పరీక్ష నిర్వహించారు. ఈ మార్కులను ఐదింతలు పెంచి వంద మార్కులకు గానూ ఫలితాలను అధికారులు రూపొందించారు.

గ్రేడ్ ల కేటాయింపు ఇలా..

విద్యార్థులకు గ్రేడ్ల కేటయింపు ఇలా ఉంటుంది. మొత్తం 100 మార్కులకు గాను 91-100 మార్కులు సాధించిన వారికి A1 గ్రేడ్‌ను కేటాయించారు. 81-90 మార్కులు సాధించిన వారికి A2, 71-80 మార్కులకు B1, 61-70 మార్కులు వచ్చిన వారికి B2, 51-60 మార్కులకు C1 గ్రేడ్, 41-50 మార్కులకు C2, 35-40 మార్కులు సాధించిన వారికి D, 0-34 మార్కులు వస్తే ఈ గ్రేడ్‌ను కేటాయించారు. అయితే ఈ ఏడాది మొత్తం 5,21, 392 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో దాదాపు 2 లక్షల మంది ఏ1 గ్రేడ్ సాధించినట్లు తెలుస్తోంది.

Results – Direct Link

ఫీజు చెల్లించింది 5,21,392 మంది పాస్..

ఈ విద్యాసంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ స్కూళ్లలో పదో తరగతిలో 5,46,865 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. ఈ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.150 నిర్ణయించారు. లేట్ ఫీజు రూ.50 తో మార్చి 16 వరకు ఫీజు చెల్లించడానికి గడువు ఇచ్చారు. మార్చి 22 వరకు రూ.500 లేట్ ఫీజుతో పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు విధించారు అధికారులు. అప్పటివరకు 5,21,392 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. టెన్త్ లో అడ్మిషన్ పొందిన 25,473 మంది విద్యార్థులు గడువులోగా ఫీజు చెల్లించలేదు. ఫీజు చెల్లించకపోవడంతో వారు FA-1 పరీక్షకు హాజరైనా అధికారులు పాస్ చేయలేదు. ఫీజు చెల్లించని వారు ఫెయిల్ అయినట్లేనని అధికారులు స్పష్టం చేశారు.

Telangana 10th Results: తెలంగాణ టెన్త్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు మంత్రి సబితారెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ లింక్స్ తో విద్యార్థులు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం తెలంగాణలో టెన్త్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థులకు క్లాస్ రూం తరగతులు నిర్వహంచిన 44 రోజుల్లో ఫార్మేటీవ్ అసస్మెంట్(FA-1) ఎగ్జామ్ ను నిర్వహించారు. ప్రతీ సబ్జెక్టుకు ఈ పరీక్షను 20 మార్కులకు నిర్వహించారు. అయితే ఈ మార్కులను ఐదింతలు పెంచి వంద మార్కులకు గానూ ఫలితాలను సిద్ధం చేశారు అధికారులు. అయితే టెన్త్ ఎగ్జామ్ కు పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులంతా పాస్ అయినట్లేనని సర్కార్ ప్రకటించడంతో ఆయా విద్యార్థులంతా పాస్ కానున్నారు. ఉదయం 11 గంటల తర్వాత తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫలితాల విడుదల సమయంపై విద్యాశాఖ అధికారులు ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ సారి అత్యధిక ఏ గ్రేడ్ లు…

పరీక్షకు మొత్తం 100 మార్కులు కాగా 91-100 మార్కులు సాధించిన వారికి ఏ1 గ్రేడ్‌, 81-90 మార్కులు సాధించిన వారికి ఏ2, 71-80 మార్కులు సాధిస్తే బీ1, 61-70 మార్కులు పొందిన వారికి బీ2, 51-60 మార్కులు సాధించిన వారికి సీ1, 41-50 మార్కులు వస్తే సీ2, 35-40 మార్కులు సాధించిన వారికి డీ, 0-34 మార్కులు వస్తే ఈ గ్రేడ్‌ను అధికారులు కేటాయించారు. అయితే ఈ ఏడాది మొత్తం 5,21, 392 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించగా ఇందులో దాదాపు 2 లక్షల మంది ఏ1 గ్రేడ్ సాధించినట్లు తెలుస్తోంది.

ఈ సారి పేరు నమోదు చేస్తే రిజల్ట్..

సాధారణంగా విద్యార్థులు ఏదైనా బోర్డు లేదా ప్రవేశ పరీక్ష రిజల్ట్ చూసుకోవాలంటే సంబంధిత వెబ్ సైట్ లో హాల్ టికెట్ నంబరును నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఈ సారి హాల్ టికెట్ల తయారీ ప్రక్రియ ప్రారంభం కాకముందే పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో విద్యార్థులు ఈ సారి హాల్ టికెట్ కు బదులు పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలను నమోదు చేసి రిజల్ట్ చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకోసం ఫలితాలు విడుదలైన అనంతరం bse.telangana.gov.in వెబ్ సైట్లను సందర్శించాలని సూచించారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this