Chanakya Niti: ప్రజలు సమిష్టిగా తప్పు చేస్తే...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Chanakya Niti: ప్రజలు సమిష్టిగా తప్పు చేస్తే ఆ బాధ్యత రాజుదే.. తప్పులు- బాధ్యతలపై ఆచార్య చాణక్య ఏమంటారంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Chanakya Niti: రాజుగా ఉండటం కంటె.. ఆ రాజును చాకచక్యంగా మంచి పాలన అందించేవైపు నడిపించడం చాలా కష్టం. ఒక కింగ్ మేకర్ కావాలంటే దానికి ఎంతో స్థిత ప్రజ్ఞత కావాలి. 

అమోఘమైన తెలివితేటలూ అంతకు మించి ప్రతి విషయాన్ని నిశిత దృష్టితో గమనించి దానిని విశ్లేషించి నిర్ణయాలు తీసుకునే నిపుణత ఉండాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న వారు ఆచార్య చాణక్య. తన పదునైన తెలివితేటలు, నైపుణ్యంతో కూడిన వ్యూహం.. రాజకీయాల ఆధారంగా చంద్రగుప్త మౌర్యను చక్రవర్తిగా చేశారు ఆచార్య చాణక్య. అందుకే ఆయనను గొప్ప రాజకీయ నాయకుడు, దౌత్యవేత్త, ఆర్థికవేత్త అదేవిధంగా అన్ని విషయాలలో నిపుణుడిగా భావిస్తారు. ఆచార్య చాణక్య జీవితకాలమంతా అన్ని విషయాలను అధ్యయనం చేయడమే కాకుండా, జీవిత పరిస్థితులను నిశితంగా పరిశీలించి, జీవితాంతం ఉపాధ్యాయుడిగా ప్రజలకు సరైన మార్గాన్ని చూపించారు. ఆచార్య చాణక్య మాటలు నేటికీ చాలా ఖచ్చితమైనవి. ఆచార్య చాణక్య విధానం ఏమి చెబుతుందో తెలుసుకుందాం..

ప్రజల తప్పులకు రాజు బాధ్యుడు..

సాధారణంగా ఎవరు తప్పు చేస్తే వారు దానికి బాధ్యులుగా భావిస్తాం కానీ.. ఆచార్య చాణక్య మాత్రం అలా కాదంటారు. ఎందుకంటే, ఆ తప్పు చేసే అవకాశం కల్పించిన వారే దానికి బాధ్యత వహించాలి అంటారు. తమ అనుచరులుగా ఉన్నవారు తప్పు చేస్తే అది నాయకుని చేతకానితనమే అనేది ఆచార్య చాణక్య ఇచ్చే సందేశం. తప్పు-బాధ్యత విషయంలో ఆచార్య చాణక్యుడు ఇలా చెబుతారు..
1. దేశ ప్రజలు సమిష్టిగా ఏదైనా తప్పు చేసినప్పుడు, దానికి ఆ ప్రజలను పాలించే రాజు బాధ్యత వహించాలి. ఎందుకంటే రాజు తన విధులను సక్రమంగా నిర్వర్తించలేక పోయినప్పుడు, ప్రజలు తప్పుడు మార్గంలో వెళ్లి తిరుగుబాటు చేసి తప్పు పని చేస్తారు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు చేసే చర్యకు రాజు బాధ్యత వహించాలి. అందువల్ల, ప్రజలు తప్పు చేయకుండా ఉండేలా రాజు పాలన ఉండాలి.
2. రాజు తీసుకునే తప్పు నిర్ణయానికి లేదా అతని మతాన్ని సరిగ్గా పాటించకపోవడానికి పూజారులు, రాజు సలహాదారులు బాధ్యత వహిస్తారు. రాజుకు పూర్తి సమాచారం అదేవిధంగా సరైన సమాచారం ఇవ్వడం వారి విధి. తప్పుడు నిర్ణయం తీసుకోకుండా నిరోధించడం పూజారి పని.
3. ఒక స్త్రీ ఏదైనా తప్పు చేసినప్పుడు, ఆమె భర్త తన తప్పులను భరించాలి. అదే సమయంలో, భర్త ఒకవేళ తప్పు చేసినప్పుడు, భార్య ఆ తప్పులను అనుభవించాలి. అటువంటి పరిస్థితిలో, ఇద్దరూ ఒకరికొకరు జవాబుదారీగా ఉంటారు. కాబట్టి, భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు మంచి సలహాదారులుగా ఉండాలి.
4. గురువు తన పనిని సరిగ్గా చేయనప్పుడు, శిష్యుడు తప్పు పనులలో పాల్గొంటాడు. శిష్యుడి తప్పుడు చర్యలకు గురువునే నిందిస్తారు. అందువల్ల, ఒక గురువు ఎల్లప్పుడూ తన శిష్యుడికి సరైన మార్గాన్ని చూపించి, తప్పుడు మార్గంలో వెళ్ళకుండా నిరోధించాలి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this