Tuesday, February 24, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
CBSE 12th Class Exams: మ‌ల్టీపుల్ ఛాయిస్...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

CBSE 12th Class Exams: మ‌ల్టీపుల్ ఛాయిస్ విధానంలో సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు.? ఈ తేదీల్లో నిర్వ‌హించే అవ‌కాశాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

CBSE 12th Class Exams: క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డ సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై కేంద్ర విద్యా శాఖ క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల‌తో కేంద్రం వ‌ర్చువ‌ల్ మీటింగ్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. కేంద్ర ర‌క్ష‌ణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సమావేశంలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణపై ఓ సూచ‌న అంద‌రి దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది.

ఈ సూచ‌న మేర‌కు ఏ స్కూళ్లో చ‌దువుకుంటున్న విద్యార్థుల‌కు ఆ కేంద్రాల్లోనే ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి.. కేవలం 90 నిమిషాల్లో మల్టిపుల్‌ ఛాయిస్‌, షార్ట్‌ క్వశ్చన్స్‌ విధానంలో పరీక్షలు నిర్వహించాల‌నే ప్ర‌తిపాద‌న వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. దీనికి చాలా రాష్ట్రాలు ఓకే చెప్పార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే.. జులై 15, ఆగస్టు 26 మధ్య చేప‌ట్టాల‌ని యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను జూన్‌ 1న అధికారికంగా ప్రకటించనున్నట్లు స‌మాచారం. పూర్తిగా క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ.. రెండు ద‌శ‌ల్లో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే.. దేశంలో పెరుగుతోన్న క‌రోనా నేథ్యంలో ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాలంటూ ఇప్ప‌టికే త‌ల్లిదండ్రులు పెద్ద ఎత్తున ప్ర‌ధానికి లేఖ‌లు రాసిన విష‌య తెలిసిందే.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this