Tuesday, February 24, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Andhra Corona Cases: ఏపీలో కొత్త‌గా 12,994...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Andhra Corona Cases: ఏపీలో కొత్త‌గా 12,994 పాజిటివ్ కేసులు.. మ‌ర‌ణాలు, పాజిటివ్ కేసుల వివ‌రాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Andhra Corona Cases:  ఏపీలో క‌రోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్త‌గా రాష్ట్రంలో 58,835 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 12,994 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,93,821కి చేరింది. తాజాగా 96 మరణాలు న‌మోద‌య్యాయి. క‌రోనా వ‌ల్ల కొత్త‌గా చిత్తూరులో 14, క‌ర్నూల్‌లో 10, విజ‌య‌న‌గ‌రంలో 10, అనంత‌పూర్‌లో 9, తూర్పుగోదావరిలో 8, విశాఖ‌ప‌ట్నంలో 8, గుంటూరులో 7,  కృష్ణలో 7, నెల్లూరులో7, శ్రీకాకుళంలో 7, ప‌శ్చిమ గోదావ‌రిలో4, ప్రకాశంలో 3, క‌డ‌ప‌లో 2 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,222కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,03,762 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 18,373 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ‌ బులిటెన్‌లో వెల్ల‌డించింది.

#COVIDUpdates: 24/05/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 15,90,926 పాజిటివ్ కేసు లకు గాను
*13,76,942 మంది డిశ్చార్జ్ కాగా
*10,222 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,03,762#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/vloYmWA8nk

— ArogyaAndhra (@ArogyaAndhra) May 24, 2021

తాజా కేసుల‌పై ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ అధికారి అర్జా.శ్రీకాంత్ వివ‌ర‌ణ‌…

కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తోంది. పాజిటివ్ రేటు 25.5 % నుండి 22.08% కు తగ్గింది. కోవిడ్ టెస్టులు తక్కువ చేయటం వలన ఈరోజు పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉంది

  • కొత్త‌గా  నమూనా పరీక్షలు: 58835
  • కొత్త‌గా కోవిడ్ పాజిటివ్ కేసులు : 12994
  • ప్ర‌జంట్ పాజిటివ్ రేట్ : 22.08%
  • తాజా మరణాలు : 96
  • మరణాలు ఇంకా తగ్గలేదు.
  • అధిక మరణాలు: చిత్తూరు 14
  • అత్యధిక కేసులు: తూర్పు గోదావరి (2652)
  • మిగిలిన జిల్లాలలో కాస్త అదుపులోకి వచ్చాయి
  • కరోనా యాక్టివ్ కేసులు: 203762
  • కరోన మృతులు ఇప్పటివరకు: 10222 (0.64%).
  • కరోనా వల్ల మృతుల సంఖ్య పది వేలు దాటింది
  • రికవరీ 15.93 లక్షల కేసుల‌లో 13.79లక్షల మంది రికవర్ అయ్యారు. (86.57%)
  • రికవరీ శాతం కూడా కొద్దిగా పెరిగింది


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this