Today Gold Price: మగువలకు గుడ్ న్యూస్.....

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Today Gold Price: మగువలకు గుడ్ న్యూస్.. స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. వివిధ నగరాల్లో తులం రేటు ఎంతుందంటే..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Gold Rate Today: దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో రోజురోజుకు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత రెండు నెలల కిందట తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మే నెల నుంచి పరుగులు పెట్టింది. ఈ తరుణంలో కూడా పసిడి ధరలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో నిత్యం పెరుగుతూ వచ్చిన ధరలకు మంగళవారం బ్రేక్ పడింది. దేశీయంగా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. అయితే ఒక్క చెన్నైలో మాత్రం 10 గ్రాముల ధరపై 30 రూపాయలు పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ46,930 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50,830కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,090 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,030 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,830 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 వద్ద కొనసాగుతోంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 వద్ద కొనసాగుతోంది.

కాగా, బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అందుకు ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this