Differences in Milk : ఆరోగ్యానికి ఆవుపాలు...

AP District Wise Cadre Strength and Working Strength – G.O.Ms.No.156

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి Finance Department ద్వారా G.O.Ms.No.156, తేదీ...

AP G.O. Ms. No. 33: Major Amendments to AP Educational Service Rules 2026

The Government of Andhra Pradesh has issued a landmark...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Differences in Milk : ఆరోగ్యానికి ఆవుపాలు మంచివా.. గేదె పాలు మంచివా..! రెండింటి మధ్య తేడాలు ఏంటి..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Differences in Milk : పాలు తాగడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. పాలల్లో ఎన్నో రకాలు అయిన పోషకాలు నిండుగా ఉంటాయి. 

ప్రతి రోజు పాలు తాగడం వలన బలం వస్తుంది. ఇందులో విటమిన్ డీ, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా చేయడంలో సహాయపడతాయి. అయితే చాలామందిలో ఒక డౌట్ ఉంటుంది అదేంటంటే మన ఆరోగ్యానికి ఆవు పాలు మంచివా? లేక గేదె పాలు మంచివా? అనే అయోమయంలో ఉంటారు. అసలు ఆవు పాలకు, బర్రె పాలకు మధ్య తేడా ఏంటో ఒకసారి చూద్దాం..

పాల‌ల్లో ఉండే కొవ్వుపై వాటి చిక్కద‌నం ఆధార‌ప‌డి ఉంటుంది. ఆవు పాల‌ల్లో 3-4 శాతం మాత్రమే కొవ్వు ఉంటుంది. అదే బ‌ర్రె పాలల్లో 7-8 శాతం వ‌ర‌కు కొవ్వు ఉంటుంది. అందుకే ఆవు పాల కంటే బ‌ర్రె పాలు చిక్కగా ఉంటాయి. దీనివ‌ల్ల బ‌ర్రెపాలు అర‌గ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది. ఆవు పాల‌తో పోలిస్తే బ‌ర్రె పాల‌ల్లో 10-11 శాతం ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల ఇవి ఎక్కువ‌గా వేడి నిరోధ‌క‌త‌ను క‌లిగి ఉంటాయి. అందుకే న‌వ‌జాత శిశువులు, వృద్ధుల‌కు బ‌ర్రె పాలు తాగించొద్దని చెబుతుంటారు.

ఆవు పాల‌తో పోలిస్తే బ‌ర్రె పాల‌ల్లో కొలెస్ట్రాల్ త‌క్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల ఊబ‌కాయం, ర‌క్తపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డేవారు ఆవు పాల‌కు బ‌దులు బ‌ర్రె పాలు తాగ‌డం మంచిది. ఆవుపాల‌తో పోలిస్తే బ‌ర్రె పాలల్లోనే కేల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి. కేల‌రీల‌తో పాటు ప్రోటీన్లు, కొవ్వు అధికంగా ఉంటాయి. ఒక‌ గ్లాస్ బ‌ర్రె పాల‌ల్లో 237 కేల‌రీలు ఉంటే.. ఒక గ్లాస్ ఆవు పాల‌ల్లో 148 కేల‌రీలు మాత్రమే ఉంటాయి. ఆవు పాలు ప‌సుపు, తెలుపు రంగులో ఉంటాయి. అదే బ‌ర్రె పాలు తెలుపు, క్రీమ్ క‌ల‌ర్‌లో ఉంటాయి. బ‌ర్రె పాలల్లోని బీటాకెరోటిన్ రంగులేని విట‌మిన్ ఏగా మారుతుంది. అందుకే బ‌ర్రె పాల‌ల్లో ప‌సుపు రంగు పోతుంది. ఆవు పాలల్లో కూడా బీటాకెరోటిన్ ఉంటుంది. కానీ త‌క్కువ మోతాదులో మాత్రమే ఉంటుంది.‌


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this