Subramanya Temple: ఆ గుడి నిండా పాములే.....

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Subramanya Temple: ఆ గుడి నిండా పాములే.. పూజలు చేస్తే మట్టిని ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Subramanya Temple:  ఎన్నో వేల సంవత్సరాల చరిత్రకలిగిన మన దేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. 

వాటిల్లో కొన్నింటిని రాజులు, భక్తులు వంశస్థుల తమకున్న దేవుడిపై భక్తిని చాటిచేప్పెందుకు నిర్మించారు. మరికొన్ని దేవాలయాల్లోని దేవతలు స్వయంభులుగా వెలిశారు.. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవుళ్లుగా పూజలు అందుకుంటున్నారు. అటువంటి ఆలయాల్లో ఒకటి కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయం ఒకటి.

కుక్కే శ్రీ సుబ్రమణ్యస్వామి గుడిలో నాగ దేవత ఎప్పుడూ కొలువైవుంటుంది అని ప్రగాఢ విశ్వాసం. నాగదేవత పరిహారం చేయించుకుని మహిమాన్వితమైన కుక్కే శ్రీ సుబ్రమణ్యస్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. కుక్కే శ్రీ సుబ్రమణ్యస్వామి వారి గుడి నాగదోషపరిహారములకు చాలా ప్రసిద్ధమైనది.ఇక్కడ ప్రధానంగా సర్పహత్యాదోషం, ఆశ్లేష బలి పూజ మరియు నాగప్రతిష్టపూజలు చాలా నిష్టగా నిర్వహిస్తారు.

కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని సుల్లియా అనే వూర్లో కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయం వుంది. ఈ ఆలయం ప్రాకృతిక సౌందర్యాల మధ్య కుమారపర్వత శ్రేణులమధ్య ధారా నది ఒడ్డున వున్న గ్రామం ‘సుబ్రహ్మణ్యం’లో వుంది. సుబ్రమణ్యస్వామిని ఇక్కడ నాగదేవతగా ఆరాధించటం విశేషం.

పూర్వం ఈ గ్రామాన్ని ‘కుక్కె పట్నం’ అని పిలిచేవారు.క్రమంగా ఇది కుక్కె సుబ్రహ్మణ్య’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ నాగదోషపరిహారములు చేసుకుంటే వారికి జీవితంలో కష్టాలుండవని సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.

కార్తికేయుడికి నిలయమైన ఈ క్షేత్రాలలో పరశురామక్షేత్రం ఒకటి. ‘స్కాందపురాణం’లో సనత్ కుమారసంహితలోని.. ‘సహ్యాద్రికాండ’లోని తీర్ధక్షేత్ర మహామణి పురాణంలో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది.

పూర్వం తారకుడు, సూర్పర్మాసురా అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు. తన ఆయుధాన్ని ఇక్కడి ధారానదిలో శుభ్రపరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ పర్వతశ్రేణుల్లో కార్తికేయుడు ఇంద్రుడు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో కార్తికేయుడు వెలసినందున ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది.

సుబ్రమణ్యస్వామి ముఖద్వారం తూర్పుముఖమై ఉన్నా, భక్తులు మాత్రం పృష్టభాగం నుండి ముందుకు వెళ్లి స్వామి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. గర్భాలయానికి, మండపద్వారానికి మధ్య వెండితో కప్పబడిన గరుడస్థంభం వుంది.

వాసుకి విషపు బుసలనుండి రక్షింపపడడానికి గరుడ స్థంభం నిర్మించారు అని ప్రతీతి. ఈ స్తంభాన్ని దాటిన తరువాత లోపలి మంటపం చేరుకోగానే గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టు సాక్షాత్కరిస్తాడు. పైభాగంలో సుబ్రమణ్యస్వామి,మధ్య భాగంలో వాసుకి, క్రిందిభాగంలో ఆదిశేషుడు వుంటారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this