Saturday, February 14, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Google: భారతీయులు ఈ ఏడాది ఎక్కువగా ఏం...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Google: భారతీయులు ఈ ఏడాది ఎక్కువగా ఏం సెర్చ్ చేశారంటే.. దేనికోసం, ఎవరి గురించి.. ఆశ్చర్యకర విషయాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Google Year in Search 2021: భారతీయులు ఈ సంవత్సరం (2021) గూగుల్‌లో ఎక్కువగా ఏ విషయం గురించి, ఎవరి గురించి, ఏ వివరాల కోసం వెతికారో జాబితా వచ్చేసింది. కొన్ని విభాగాల్లో ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి

  • ఈ సంవత్సరం భారత్‌లో టాప్ సెర్చ్ టెండ్స్ జాబితా విడుదల చేసిన గూగుల్
  • ఎక్కువగా వెతికిన విషయాల లిస్ట్ వెల్లడి
  • విభాగాల వారీగా పూర్తి వివరాలివే
2021లో భారతీయులు గూగుల్‌ (Google)లో ఎక్కువగా దేని గురించి వెతికారన్న వివరాలు వచ్చేశాయి. ఈ ఏడాది భారత్‌లో ఎక్కువ సెర్చ్‌లు వచ్చిన ట్రెండ్‌ను గూగుల్‌ (Google) ప్రకటించింది. ఈ ఏడాది టాప్‌లో నిలిచిన సెర్చ్ ట్రెండ్‌ల జాబితా (Google Year in Search 2021) వెల్లడించింది. 2021 సంవత్సరంలో భారతీయులు ఏ విషయం గురించి, ఎవరి గురించి ఎక్కువగా వెతికారో ప్రకటించింది. వివిధ విభాగాల్లో టాప్ సెర్చెస్ జాబితాను వెల్లడించింది. కొన్ని విభాగాల్లో ఆశ్చర్యపరిచే విషయాలు కూడా ఉన్నాయి.

కోవిన్‌ను గెలిచిన క్రికెట్

భారతీయులకు క్రికెట్ (Cricket) అంటే ఎంత ప్రేమో మరోసారి తేలింది. కరోనా తీవ్రంగా ఉన్న ఈ ఏడాదిలోనూ మనవాళ్లు ఎక్కువగా గూగుల్‌లో వెతికింది క్రికెట్ గురించే. ఆశ్చర్యకరంగా ఉన్నా ఇదే నిజం. 2021లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League – IPL) గురించే. ఇదే ఈ ఏడాది ఓవరాల్ గా గూగుల్ సెర్చ్ లో ఐపీఎల్ టాప్-1గా నిలిచింది.

ఆ తర్వాత కోవిన్ (COWIN) గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు ఇండియన్స్. ఇక మూడో స్థానంలో టీ20 ప్రపంచకప్ (T20 World Cup) నిలిచింది. యూరో ఫుట్ బాల్ కప్ (Euro Cup), టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. కోవిడ్ వ్యాక్సిన్ (COVID Vaccine), ఫ్రీఫైర్ రిడీమ్ కోడ్ (Free Fire Redeem Code), , కోపా అమెరికా (Copa America) టోర్నీ, టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra), ఆర్యన్ ఖాన్ (Aryan Khan) పేర్లు గూగుల్ ఇండియా అత్యధిక ఓవరాల్ సెర్చ్ టాప్-10 జాబితాలో ఉన్నాయి.

ఏ వ్యక్తి గురించి ఎక్కువగా..

2021లో భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా స్టార్ జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా గురించే వెతికారు. భారత ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్ లో తొలి స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రానే మోస్ట్ సెర్చ్‌డ్ పర్సన్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానం కాస్త ఆశ్చర్యకరంగా నిలిచింది. స్పోర్ట్స్ పర్సన్, హీరో కాకుండా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారంట నెటిజన్లు. ఆ తర్వాతి స్థానాల్లో షెహనాజ్ గిల్, రాజ్ కుంద్రా, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk), బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు (PV SIndhu), బజరంగ్ పునియా, సుశీల్ కుమార్, నటాశా దలాల్ ఉన్నారు.

జైభీమ్ హవా

2021లో భారతీయులు ఎక్కువగా ఓ ప్రాంతీయ సినిమా గురించే గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఓటీటీ విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న జైభీమ్ (Jai Bhim) సినిమా గురించే ఈ ఏడాది భారత్‌లో ఎక్కువ మంది వెతికారు.ఇక రెండో స్థానంలో బాలీవుడ్ సినిమా షేర్షా ఉంది. రాధే, బెల్ బాటమ్ హిందీ చిత్రాలు తర్వాత ఉన్నాయి. హాలీవుడ్ సినిమాలు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, ఎటర్నల్స్ కూడా టాప్-10లో నిలిచాయి.

నియర్ మీ’లో కొవిడ్ ఆధిపత్యం

నియర్ మీ (నాకు సమీపంలో) విభాగంలో గూగుల్‌లో కొవిడ్ గురించి సమాచారం కోసం భారతీయులు 2021లో ఎక్కువగా వెతికారు. సమీపంలోని కోవిడ్ వ్యాక్సిన్, కోవిడ్ టెస్ట్, కోవిడ్ ఆసుపత్రి టాప్-3లో నిలిచాయి. ఆ తర్వాత ఆక్సిజన్ సిలిండర్లు, సీటీ స్కాన్ ఉన్నాయి. ఆ తర్వాత ఫుడ్ డెలివరీ, టిఫిన్ సర్వీసులు, రెస్టారెంట్లు, లాక్ డౌన్లకు సంబంధించిన వివరాలు గూగుల్‌లో వెతికారు.
google: భారతీయులు ఈ ఏడాది ఎక్కువగా ఏం సెర్చ్ చేశారంటే.. దేనికోసం, ఎవరి గురించి.. ఆశ్చర్యకర విషయాలు


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this