HealthWeight Loss Tips : భోజనానికి ముందు...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Weight Loss Tips : భోజనానికి ముందు ఓ గ్లాసుడు నీళ్లు తాగారంటే.. కొన్ని రోజుల్లోనే నాజూకై పోతారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Weight Loss Tips హోటల్ ఫుడ్‌తో పోల్చితే ఇంట్లో తయారుచేసిన ఆహారం అంత రుచిగా ఉండదు. అందుకే చాలా మంది ప్రతిరోజూ బయటి ఆహార తినడానికి ఆసక్తి చూపుతారు. ఫలితంగా జరిగిందేదో జరుగుతుంది. రోజురోజుకీ బరువు అమాంతం పెరిగిపోతుంటారు. సమతుల్య ఆహారం, సరైన శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది.

Weight Loss Tips

బరువు అదుపులో ఉంచుకోవాలంటే సరైన జీవితాన్ని గడపడం చాలా అవసరం. తగినంత నీరు, మితమైన నిద్ర కూడా అవసరం. ఓ అమెరికన్ జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. శరీర కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే తినడానికి ముందు నీరు తాగాలని పేర్కొంది.

ఒక ప్రయోగంలో 12 వారాల పాటు భోజనానికి ముందు నీరు తాగిన వారు వేగంగా బరువు తగ్గారని తేలింది. దీనికి విరుద్ధంగా భోజనానికి ముందు నీరు త్రాగని వారు బరువు తగ్గనట్లు గుర్తించారు. ఈ అధ్యయనం ప్రకారం అల్పాహారంలో తగినంత మొత్తంలో ప్రోటీన్లు ఉండాలి. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా తినాలనే కోరిక పుట్టదు. అందుకు ఉడకబెట్టిన గుడ్లను ఉదయాన్నే తినడం మంచిది.

పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం, ఓట్స్, క్వినోవా వంటి ఆహారాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. క్రమం తప్పకుండా ఎక్కువ ప్రోటీన్ తినడం, కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని తగ్గించడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు. అలాగే ప్రాసెస్డ్ ప్రొటీన్ రిచ్ ఫుడ్ తినడం వెంటనే మానుకోవాలి.

మితమైన ఆహారం, వ్యాయామం, నీళ్లతో పాటు బరువు తగ్గడానికి తగినంత నిద్ర చాలా ముఖ్యం. నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. జీవక్రియ చెదిరిపోతే, బరువు తగ్గడం కష్టం. బరువు తగ్గాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఉదయాన్నే నడవడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మంచి శరీరక సౌష్టవం పొందాలంటే క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయాలంటున్నారు నిపుణులు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this