NationalWayanad Landslide : అంతకంతకు పెరుగుతున్న వయనాడ్...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Wayanad Landslide : అంతకంతకు పెరుగుతున్న వయనాడ్ మృతుల సంఖ్య… ఎడతెరిపిలేని వర్షంతో సహాయక చర్యలకు ఆటంకం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

  • కేరళలో ప్రకృతి బీభత్సం
  • వర్షాలు, వరదలకు తోడు విరిగిపడుతున్న కొండచరియలు
  • వయనాడ్ లో ఇప్పటివరకు 93 మంది మృతి
  • ఇంకా శిథిలాల కింద అనేకమంది!

Wayanad Landslide ప్రకృతి అందాలకు నెలవైన కేరళను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 93 మంది మరణించినట్టు గుర్తించామని కేరళ రెవెన్యూ శాఖ వెల్లడించింది. ఇంకా 98 మంది ఆచూకీ తెలియరాలేదని పేర్కొంది. 116 మంది గాయపడగా, వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్టు తెలిపింది.

Wayanad Landslide

కాగా, వయనాడ్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దాంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, కేరళ పోలీసులు చేపట్టిన సహాయక చర్యల్లో డ్రోన్లు, పోలీసు జాగిలాల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు.

గత అర్ధరాత్రి వయనాడ్ ప్రాంతంలోని ముండకై వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో అధికారులు ఆ ప్రాంతంలోని ప్రజలను చురల్ మల వద్ద ఓ స్కూలు వద్దకు తరలించారు. అయితే తెల్లవారుజామున అక్కడ కూడా కొండచరియలు విరిగిపడడంతో స్కూలులో ఆశ్రయం పొందుతున్నవారు గల్లంతయ్యారు. స్కూలు, పరిసరాల్లోని ఇళ్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి.

బురదతో కూడిన వరద ప్రవాహంలో చిక్కుకుని అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అనేకమంది శిథిలాల కింద సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యాహ్నం కూడా ముండకై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడినట్టు తెలుస్తోంది.

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this