SportsCricketIND vs PAK : అభిమానుల‌కు పండ‌గే.....

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

IND vs PAK : అభిమానుల‌కు పండ‌గే.. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో మూడు సార్లు త‌ల‌ప‌డ‌నున్న భార‌త్‌, పాకిస్తాన్‌..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

IND vs PAK : వ‌చ్చే ఏడాది పాకిస్తాన్ వేదిక‌గా ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 జ‌ర‌గ‌నుంది. మొత్తం 8 దేశాలు ఈ టోర్నీలో పాల్గొన‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి 19 నుంచి మార్చి 9 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఈ టోర్నీకి సంబంధించిన డ్రాప్ట్ షెడ్యూల్‌ను ఇప్ప‌టికే ఐసీసీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంద‌జేసింది. పాకిస్తాన్‌కు టీమ్ఇండియా వెళ్లే అవ‌కాశం లేద‌ని, హైబ్రిడ్ మోడ్‌లో టోర్నీని నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే ఐసీసీని బీసీసీఐ కోరింది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

IND vs PAK

గ‌త కొన్నాళ్లుగా భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు ద్వైపాక్షిక సిరీసుల్లో త‌ల‌ప‌డ‌డం లేదు. కేవ‌లం ఐసీసీ టోర్నీల్లోనే త‌ల‌ప‌డుతున్నాయి. భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. రెండు దేశాల అభిమానులే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తారు అని చెప్ప‌డంలో అతి శ‌యోక్తి లేదు.

ఇదిలా ఉంటే.. అభిమానుల‌కు మాత్రం ఓ కిక్ ఇచ్చే వార్త అందుతోంది. నివేదిక‌ల ప్ర‌కారం.. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్, పాకిస్తాన్‌లు గ్రూపు-ఏలో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. గ్రూపు-ఏలో భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల‌తో పాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జ‌ట్లు ఉన్నాయి. ఇక గ్రూపు-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, అఫ్గానిస్తాన్‌, ద‌క్షిణాఫ్రికాలు ఉన్నాయి. గ్రూపులోని ఒక్కొ జ‌ట్టు మిగిలిన జ‌ట్ల‌తో మ్యాచ్ ఆడ‌తాయి. ప్ర‌తి గ్రూపు నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు సూప‌ర్‌-4కి చేరుకుంటాయి. సూప‌ర్‌-4 ద‌శ‌లో ఒక్కొ జ‌ట్టు మిగిలిన మూడు జ‌ట్ల‌తో మ్యాచ్‌లు ఆడ‌తాయి. టాప్‌-2లో నిలిచిన జ‌ట్లు ఫైన‌ల్ అర్హ‌త సాధిస్తాయి.

ఈ లెక్క‌న‌ భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు మూడు సార్లు త‌ల‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఒకే గ్రూపులో ఉండ‌డంలో భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య ఖ‌చ్చితంగా ఓ మ్యాచ్ జ‌రుగుతోంది. ఇక రెండు జ‌ట్లు కూడా సూప‌ర్ ఫోర్‌కు క్వాలిఫై అయితే.. అక్క‌డ మ‌రోసారి పోటీప‌డ‌తాయి. సూప‌ర్ ఫోర్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే అప్పుడు మూడో సారి ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌తాయి.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this