Andhra PradeshYS Jagan: ఢిల్లీలో నిరాహార దీక్షకు సిద్దమైన...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

YS Jagan: ఢిల్లీలో నిరాహార దీక్షకు సిద్దమైన వైఎస్ జగన్.. ఈ అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Jagan Deeksha ఏపీలో అధికార ఎన్డీయే కూటమి, విపక్ష వైసీపీల మధ్య పీక్స్‌కు చేరిన పొలిటికల్‌ ఫైట్‌లో ఢిల్లీ ట్విస్ట్‌ ఆసక్తికరంగా మారింది. ఏపీలో అధికార కూటమి వర్సెస్ విపక్ష వైసీపీ పంచాయితీ.. ఇక ఢిల్లీకి చేరనుంది. పార్లమెంటు సమావేశాల కోసం టీడీపీ, వైసీపీ వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశాయి. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైఎస్‌ జగన్‌. ఉభయ సభల్లో ఏవిధంగా వ్యవహరించాలో ఎంపీలకు సూచించారు. తాడేపల్లి నివాసంలో ఎంపీలతో సమావేశమైన జగన్‌.. ఢిల్లీలో తాను చేయబోయే ధర్నాపై చర్చించారు. రాష్ట్రంలో జరుగుతోన్న దాడులు, హత్యలను ఢిల్లీ వేదికగా కేంద్రం, దేశం దృష్టి తీసుకెళ్లాలన్నారు జగన్‌.

ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని నిన్న వినుకొండలో ప్రెస్ మీట్లో ఆరోపించారు మాజీ సీఎం జగన్. వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, వినుకొండలో జరిగిన హత్య ఘటన దీనికి పరాకాష్ట అన్నారు. గత 45 రోజులుగా ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలపై పార్లమెంట్‌లో గళమెత్తాలని ఎంపీలకు సూచించారు జగన్‌. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలంటూ తమ పార్టీ ఎంపీలను ఆయన ఆదేశించారు. ఏపీలో జరుగుతున్న హింసాకాండపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాల అపాయింట్‌మెంట్లు కోరామని ఎంపీలకు తెలిపారు జగన్. పార్టీ తరఫున పోరాటాలు చేయకపోతే ఈ దారుణాలకు అడ్డుకట్ట పడదన్న జగన్‌, అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన తెలుపుదామన్నారు.

పోరాటంతో ఏపీ సర్కార్‌పై ఒత్తిడి తీసుకురావాలని, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు వైసీపీ అధినేత. ఇక ఈ నెల 24న బుధవారం ఢిల్లీలో తలపెట్టిన నిరసన, ధర్నా కార్యక్రమం గురించి ఎంపీలతో జగన్‌ చర్చించారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని యావత్‌ దేశం గుర్తించేలా, ఏం చేయాలన్న దానిపై సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఢిల్లీ వేదికగా దేశం మొత్తానికి తెలియజేస్తామన్నారు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి. పార్లమెంటులో కూడా దాడుల అంశాన్ని లేవనెత్తుతామన్నారు. ఇక ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తోన్న అరాచకాలను పార్లమెంట్‌ దృష్టికి తీసుకొస్తామని, రాష్ట్రంలో జరుగుతోన్న హత్యాకాండను దేశం దృష్టికి తీసుకెళ్తామన్నారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. ఈ సందర్భంగా బుధవారం నాడు ఢిల్లీలో జగన్‌ ధర్నాతోపాటూ, నిరాహార దీక్ష చేస్తారన్నారు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this