NewsWatch: తల్లిదండ్రులూ బీ అలర్ట్‌..! మీ పిల్లలు...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Watch: తల్లిదండ్రులూ బీ అలర్ట్‌..! మీ పిల్లలు ఇలాగే స్కూల్‌కి వెళ్తున్నారా..? వీడియోపై ఓ లుక్కేయండి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

చాలా మంది పాఠశాల విద్యార్థులు ఆటోలు, రిక్షాలలో స్కూల్‌కి వెళ్తుంటారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు విన్యాసాలు చేస్తూ రోడ్లపై హల్‌చల్‌ చేస్తుంటారు. అలాంటిదే కొందరు స్కూల్‌ విద్యార్థులు చేస్తున్న స్టంట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీ-లక్నో హైవేపై విద్యార్థులు ఇలాంటి స్టంట్ చేయడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఈ మార్గంలో భారీ వాహనాలు హై స్పీడ్‌తో వెళ్తుంటాయి. అలాంటిది ఒకే ఈ-రిక్షాలో దాదాపు 14 మంది విద్యార్థులు ప్రయాణిస్తుండటం అందరినీ షాక్‌కు గురిచేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అనేక మంది పిల్లలు ఈ-రిక్షాపై ప్రయాణిస్తూ, ఘోరమైన రీతిలో సరదాగా ఎంజాయ్‌ చేశారు. వైరల్‌ వీడియోలో విద్యార్థులు ఇ-రిక్షా చుట్టూ వేలాడుతూ దాని పైకప్పుపై కూడా కూర్చుని వెళ్తున్నారు. విద్యార్థులు రిక్షాకు వేలాడుతూ క్రమంలో ఆ రిక్షా బోల్తా పడే అవకాశం ఉంది. విద్యార్థులు చేస్తున్న ఈ స్టంట్‌ను అదే రోడ్డుపై ప్రయాణిస్తున్న ఎవరో వీడియో రికార్డ్ చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వైరల్‌గా మారిన వీడియోపై పోలీసులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు సూచించారు. ఎట్టకేలకు ఈ వీడియోలకు చేరింది. ఈ షాకింగ్ వీడియో ఢిల్లీ-లక్నో హైవే NH-9కి సంబంధించినదిగా తెలిసింది.

విద్యార్థుల ఈ స్టంట్‌పై సోషల్ మీడియాలో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం పోలీసుల వైపు కూడా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఈ మార్గంలో డ్యూటీ పోలీసులు లేకపోవటం వల్లే ఆటో డ్రైవర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఈ పిల్లలు తమ తల్లిదండ్రుల గురించి ఎందుకు ఆలోచించరు అని ఒకరు రాశారు.

ఇక్కడ తల్లిదండ్రుల తప్పు కూడా ఉందని మరికొందరు వ్యాఖ్యానించారు. ఎందుకంటే.. తమ పిల్లలు స్కూల్‌కి, కాలేజీకి వెళ్లే క్రమంలో ఎలాంటి ప్రయాణం చేస్తున్నారో అప్పుడప్పుడు గమనిస్తుండాలని చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తరువాత ప్రభుత్వాన్ని ఆరోపించటం పరిపాటిగా మారిందంటూ మరికొందరు నెటిజన్లు పేర్కొన్నారు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this