Tuesday, September 9, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
SportsCricketUnluckiest Dismissal : క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఇలాంటి...

One-year B.Ed, : ఇక 2-సంవత్సరాల B.Ed కాదు.. ప్రభుత్వం 1-సంవత్సరం ఫాస్ట్-ట్రాక్ కోర్స్ ప్రకటించింది!

One-year B.Ed భారతదేశంలో టీచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో పెద్ద మలుపు తిరిగింది....

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2025: జిల్లా వారీగా, పోస్ట్ వారీగా రిజెక్షన్ల వివరణ (DSC 2025 Rejections Analysis in Telugu)

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ (DSC) 2025 లో విద్యాఉద్యోగాలకు దరఖాస్తు చేసిన...

Unluckiest Dismissal : క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఇలాంటి ఔట్‌ను చూసి ఉండ‌రు.. వీడియో వైర‌ల్‌..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Unluckiest dismissal ever : క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు కొన్ని విచిత్ర ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. అలాంటివి చూసిన‌ప్పుడు కాసేపు మ‌న క‌ళ్ల‌ని మ‌నమే న‌మ్మ‌లేక‌పోతుంటాం. అయితే.. తాజాగా అలాంటి ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన‌ ప్ర‌తి ఒక్క‌రు కూడా ఇంతటి దుర‌దుష్ట‌వంతుడు మ‌రొక‌రు ఉండ‌రు అని ఓ బ్యాట‌ర్ పై జాలి చూపుతున్నారు. ఆ బ్యాట‌ర్ ఔటైన విధానం అలాంటిది మ‌రి.

ఈ ఘ‌ట‌న యార్క్‌షైర్‌ సెకెండ్‌ ఎలెవెన్‌, సోమర్‌సెట్‌ సెకెండ్‌ ఎలెవెన్‌ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ సందర్భంగా చోటు చేసుకుంది. యార్క్‌షైర్ బౌల‌ర్ బెన్ క్లిప్ బౌలింగ్‌లో సోమ‌ర్ సెట్ బ్యాట‌ర్ లియోనార్డ్ స్ట్రైయిట్ షాట్ ఆడాడు. ఆ బంతి నాన్ స్ట్రైక‌ర్ వైపుగా వ‌చ్చింది. ఆ బాల్‌ను త‌ప్పించుకునేందుకు నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న క్యాసే అల్‌డ్రిడ్జ్ కింద‌కు వంగాడు. అయిన‌ప్ప‌టికి బంతి అత‌డి భుజాల‌ను తాకింది. ఆ వెంట‌నే బాల్‌ బౌల‌ర్ దిశ‌గా వెళ్లింది. బౌల‌ర్ క్లిఫ్ చాలా సింపుల్‌గా క్యాచ్ అందుకున్నాడు. తాను కావాలని చేయలేదంటూ నాన్ స్ట్రైక‌ర్‌ క్యాసే అల్‌డ్రిడ్జ్ సారీ చెప్ప‌గా.. ఓకే అంటూ నిరాశతో లియోనార్డ్ మైదానాన్ని వీడాడు.

ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు దీనిపై త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇంత‌టి దుర‌దృష్ట వంతుడు మ‌రొక‌రు ఉండ‌ని ఓ నెటిజ‌న్ అనగా, దరిద్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడా ఏంటీ అని మ‌రోనెటిజ‌న్ కామెంట్ చేశాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో సోమ‌ర్సెట్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 191 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో యార్క్‌షైర్ 16.5 ఓవ‌ర్ల‌లో 125 ప‌రుగుల‌కు కూప్ప‌కూలింది.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this