EmployeesOffice Chit Chat is Danger ఆఫీస్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Office Chit Chat is Danger ఆఫీస్ కి వచ్చి కాఫీలు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారా? ఇక మీ జాబ్స్ పోవడం పక్కా!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Office Chit Chat is Danger ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆన్ లైన్ షాపింగ్ అందించే ఈ కామర్స్ సంస్థలో అమెజాన్ ఒకటి. తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం నుంచి ఆఫీస్ కి రావాలని కోరిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే రిటర్న్ టూ ఆఫీస్ విధానంలో ఉద్యోగులు ట్రిక్ ను ఉపయోగించారు. కాఫీ బ్యాడ్జింగ్ అనే ట్రిక్ తో  ఉద్యోగులు పని వేళల నిబంధన నుంచి తప్పించుకునేవారు. ఈ లోపాన్ని గుర్తించిన అమెజాన్ అలాంటి ఉద్యోగులపై చర్యలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే చాలా మం దికి కాఫీ బ్యాడ్జింగ్ అంటే ఏమిటి? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రముఖ సంస్థలో అమెజాన్ ఒకటి. ఇక్కడ ఎంతో మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. కోవిడ్ టైమ్ లో  చాలా మంది వర్క్ ఫ్రమ్ హోం చేశారు. గత ఏడాది ప్రారంభంలో అమెజాన్ రిటర్న్ టు ఆఫీస్ నిబంధనలను అమలు చేయడం ప్రారంభించింది. అయితే ఆమెజాన్ తీసుకొచ్చిన ఈ నిబంధనపై ఉద్యోగుల నుండి ప్రతిఘటన ఎదురైంది. సుమారు 30 వేల మంది ఉద్యోగులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని వినతులు ఇచ్చారు. అయినా, అమెజాన్ వారి డిమాండ్ లను పట్టించుకోలేదు. ఆఫీస్ కు రావాల్సిందేనని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. అలా రాని ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.

ఇది ఇలా ఉంటే.. అమెజాన్ లో ఉద్యోగులు ఆఫీస్ లో వర్క్ చేసే కనీస సమయం అంటూ నిబంధన లేదు. ఈ లూప్ ను గుర్తించిన కొందరు ఉద్యోగులు కొత్త ట్రిక్ కి తెరతీశారు. ఆఫీస్ కు వచ్చిన కొందరు ఉద్యోగులు కాసేపు తమ సీట్లో గడిపి.. ఆ తరువాత ఒక కాఫీ తాగి..అక్కడే టైమ్ స్పెండ్ చేస్తుంటారు. అనంతరం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లిపోయేవారు. దీన్నే ‘కాఫీ బ్యాడ్జింగ్’ అనడం ప్రారంభించారు. ఉద్యోగులు ఆఫీస్ లో ఉండాల్సిన కనీస గంటల నిబంధన లేకపోవడంతో అమెజాన్ లో కాఫీ బ్యాడ్జింగ్ అనే ట్రిక్ సాధ్యమైంది.

ఇక ఉద్యోగుల వినియోగిస్తున్న ఈ ట్రిక్ ను అమెజాన్ కాస్త ఆలస్యంగా గుర్తించింది. వెంటనే, ఆఫీస్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. కాఫీ బ్యాడ్జింగ్ కు తరచుగా పాల్పడిన ఉద్యోగులపై చర్యలకు దిగింది. ముఖ్యంగా రిటైల్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టీమ్ లో పని చేసే ఉద్యోగులు ఆఫీస్ లోకనీసం 2 గంటలు గడపాలని నిబంధన పెట్టింది. అలానే మరికొన్ని ఇతర ప్రాజెక్ట్ ల్లో పని చేసే ఉద్యోగులు కనీసం 6 గంటలు ఆఫీస్ లో ఉండాలంటూ నిబంధనలు మార్పులు చేసింది. ఇలా చాలా సంస్థల్లో కూడా కొందరు ఉద్యోగులు కాఫీలు తాగుతూ.. టైమ్ పాస్ చేస్తుంటారు. ఇలాంటి వారిపై అమెజాన్ మాదిరిగానే ఇతర సంస్థలు కూడా చర్యలు తీసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. మొత్తంగా ఎవరైనా ఇలా ఆఫీస్ వెేళ కాఫీలు తాగుతూ టైమ్ వృథా చేస్తున్నట్లు అయితే..వారి జాబ్ రిస్క్ లో పడినట్లే  అని పలువురు టెక్ నిపుణులు చెబుతున్నారు.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this