Science and TechnologyInsta Reels Viral: ఏకంగా లాకప్‌ లో...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Insta Reels Viral: ఏకంగా లాకప్‌ లో ఉన్న ఫ్రెండ్ తో రీల్స్‌.. పోలీసులు అంటే లెక్కలేదా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Insta Reels Viral: హైదరాబాద్ పాతబస్తీ లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. లాకప్ లో ఉన్న స్నేహితుడిని కలవడానికి వచ్చిన ఓ యువకుడు అతనితో కలిసి రీల్ చేశాడు. అంతేకాకుండా ఆ రీల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది చూసిన స్థానికులు ముక్కున వేలువేసుకున్నారు. యువతకు పోలీసులు అంటే లెక్క లేకుండా పోతుందని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్న పోలీసులు ఎలా ఊరికే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ లో రీల్స్ చేస్తున్నా పోలీసులు పట్టించుకోక పోవడం ఏంటని మండిపడుతున్నారు. ఇలా చేయడం వలన నిజమైన పోలీసులపై కూడా ప్రజలకు నమ్మకం పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రేమ పేరుతో తన కూతురుని ఎత్తుకెళ్లాడని ఓ తల్లి బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా స్థానిక యువకుడు మూదషీర్ పై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూదషీర్ ను పట్టుకున్నారు. అతనికి పోలీస్టేషన్ తీసుకువచ్చి దర్యాప్తు చేసిన అమ్మాయి జాడ కనిపెట్టలేకపోయారు. దీంతో మూదషీర్ ని పోలీస్టేషన్ లోనే ఉంచారు. పోలీస్ స్టేషన్ సెల్ లో ఉన్న స్నేహితుడిని కలవడానికి ముబారక్ వచ్చాడు. మూదషీర్ తో ముబారక్ కలిసి ఇద్దరు వీడియో రీల్ చేశారు. ఇక లాకప్‌లో ఉన్నాకూడా బాలిక కుటుంంబాన్ని బెదిరిస్తూ మూదషీర్ రీల్ చేశాడు. పోలీస్‌స్టేషన్‌లోనే ఫ్రెండ్స్‌తో రీల్స్‌ చేయిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడు . ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలోనే నిందితుడు మూదషీర్ కి పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అందుకు నిదర్శనమే పోలీస్‌స్టేషన్‌లో చేసిన రీల్సే రుజువు అంటున్నారు. పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల ముందే రీల్స్‌ చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తోంది బాలిక ఫ్యామిలీ. దీంతో సోషల్‌ మీడియా ద్వారా పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు పాతబస్తీ వాసులు. ఇదీ అచ్చితంగా ఎపుడైందో తెలియదు గానీ… ఈ వీడియో చూసిన ప్రజలు ముక్కున వెళుసుకుంటున్నారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this